తెలంగాణా ప్రాచీన శివాలయాలు
ఇంద్రపాలనగర శివాలయాలువిష్ణుకుండులు తమ తొలి రాజధాని అమరావతి (నేటి మహబూబ్‍నగర్ జిల్లాలోని అమ్రాబాద్) నుండి కొంత కాలం తరువాత నల్లగొండ జిల్లాలోని తుమ్మలగూడెం దగ్గరి ఇంద్రపాలగుట్టకు వెళ్ళి ఆ ప్రాంతాన్ని మరో రాజధానిగా చేసుకున్నారు. ఆ గుట్ట పైన వారు కట్టించిన కోట గోడలు, దేవాలయాలు, కోనేర్లు, బౌద్ధ స్థూపాలు, జైన మత విగ్రహాలు ఇప్పటికీ ఉన్నాయి. కోటగోడ కొసన వారి రాజ చిహ్నమైన పంజా ఎత్తి గర్జిస్తున్న సింహం శిల్పం రాజదర్బారు వెనుకనే పడి ఉండటంతో …