నిజమైన అంబేద్కరైట్ కె.ఆర్.వీరస్వామి
(డిసెంబర్ 23 కె.ఆర్.వీరస్వామి జయంతి సందర్భంగా) 1940వ దశకంలో హైదరాబాద్ దళిత రాజకీయాలకు దిశానిర్దేశం చేసిన జాతీయవాది కె.ఆర్.వీరస్వామి. తన ఇంగ్లీషు రచనలు, పత్రికా ప్రకటనలు, పదునైన భాషణతో ప్రత్యర్థులను పత్తాలేకుండా చేసేవాడు. వివిధ దళిత సంఘాలను స్థాపించి తన ముక్కుసూటి తనం, తలవంచని నైజంతో పనిచేసిండు. తప్పుజేసిన వారు ఎంతటి వారైనా సరే తూర్పారా పట్టేవాడు. అందులో తన బంధువులున్నా అదే తీరులో స్పందించేవాడు. మొదటి నుంచి రెబెల్‍గా వెలిగిండు. మిగతా నాయకులకు భిన్నంగా మాల, …