June

సాంకేతిక రంగంలో సరికొత్త విప్లవం… బ్లాక్‍ చెయిన్‍ టెక్నాలజీ…!

సెలయేటి ఒడ్డున కూర్చుని పంట పొలాలకు ప్రవహించే నీటిని గమనించినట్లయితే పాతనీరు వెళుతుంటే, కొత్తనీరు వచ్చిచేరుతూ పంటపొలాలను సస్యశ్యామలం చేస్తూ ఉంటుంది. అదే విధంగా సాంకేతిక రంగంలో కూడా ఏదైనా ఒక కొత్త ఆవిష్కరణ వచ్చినపుడు దాని గురించి ఆలోచించేలోపే మరొక కొత్త ఆవిష్కరణ మనకు అందుబాటులోకి వస్తూ.. మానవాళికి మరింత సుఖాన్ని, సౌఖ్యాన్ని అందిస్తున్నాయనడం ఎంత మాత్రం సత్యదూరం కాదు. ఇక కంప్యూటర్‍ వచ్చాక మన సమాజం యొక్క తీరుతెన్నులే మారిపోయాయి. గంటలో చేసే పనిని, …

సాంకేతిక రంగంలో సరికొత్త విప్లవం… బ్లాక్‍ చెయిన్‍ టెక్నాలజీ…! Read More »

దిల్లీలో ఉన్న మన ‘హైదరాబాద్‍ హౌస్‍’

దేశాధినేతలతో దౌత్య సంబంధాలకైనా, విదేశీ ప్రముఖులతో ఛాయ్‍పే చర్చలకైనా.. విలేకరుల సమావేశాలైనా, ముఖ్య కార్యక్రమాలైనా అన్నింటికీ ఒకటే వేదిక. అదే దిల్లీలో ఉన్న హైదరాబాద్‍ హౌస్‍. ఏ దేశ అధ్యక్షులైనా మన దేశంలో పర్యటిస్తే దీని గడప తొక్కాల్సిందే. అతిథిగా రాచమర్యాదల రుచి చూడాల్సిందే. నిజాం ప్రభువుల కలల సౌధంగా రూపుదిద్దుకున్న ఈ కట్టడం దేశ రాజధాని నగరంలో హైదరాబాద్‍ దర్పానికి ప్రతిబింబంగా నిలుస్తోంది.వందేళ్ల చరిత్ర..దిల్లీ నగరం నడిబొడ్డున దాదాపు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ …

దిల్లీలో ఉన్న మన ‘హైదరాబాద్‍ హౌస్‍’ Read More »

నాలుగు గొప్ప చోళ దేవాలయాలు

మనదేశంలో విలసిల్లిన మూడు దేవాలయ శైలుల్లో నాగరపద్ధతిలో వింధ్య పర్వతాల నుంచి కృష్ణానది వరకు, ద్రావిడ పద్ధతిలో కృష్ణానది నుంచి కన్యాకుమారి వరకు ఆలయాలు నిర్మించబడినాయి. క్రీ.శ.4-5 శతాబ్దాల్లో ప్రారంభమైన ఈ దేవాలయ నిర్మాణం తమిళ నాట క్రీ.శ.13-14 శతాబ్దాలకు పతాకస్థాయికి చేరుకొన్నాయి. ముందు ఇటుక, కొయ్యలతో ప్రారంభమై గుహాలయాలు, రాతి ఆలయాలుగా రూపు దిద్దుకొని, రానురాను ఆగమశాస్త్రాల్లో పేర్కొన్న పూజ, పునస్కారాల కోసం, ఆలయం కూడా గర్భాలయ, అర్థ, మహామండపాలకు తోడు అనేక కట్టడాలు చేరి, …

నాలుగు గొప్ప చోళ దేవాలయాలు Read More »

నదుల పరిరక్షణ తక్షణ అవసరం

ప్రతి సంవత్సరం పర్యావరణ ప్రేమికులు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు జూన్‍ 5న పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక అంశంపై దృష్టి పెడుతున్నట్లే ఈ సంవత్సరం థీమ్‍ ‘ఓన్లీ వన్‍ ఎర్త్’. ఈ సమస్త విశ్వంలో ప్రాణకోటికి జీవించగల అవకాశం ఉన్నది ఈ ఒకే ఒక్క భూమిపై మాత్రమే. ఈ భూమిపై గల ప్రకృతి వనరులను పరిరక్షించుకుంటూ మానవాళి సహజీవనం చేయాల్సి వుంటుంది. నిజానికి ఏం జరుగుతోంది? ప్రకృతి వనరుల సంరక్షణ కంటే వినియోగం …

నదుల పరిరక్షణ తక్షణ అవసరం Read More »

ఆరోగ్యం కోసం యోగా జూన్‍ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం

2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్రమోడి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్‍ 21న జరుపుకొనుట గురించి ప్రతిపాదన చేయడం, ఈ తీర్మానానికి 193 ఐరాస(ఐక్య రాజ్య సమితి) ప్రతినిధులలో 175 మంది మద్దతు ఇవ్వడం తెలిసిందే. భద్రతా మండలిలో శాశ్వత సభ్యులుగా ఉన్న అమెరికా, ఇంగ్లాండ్‍, చైనా, ఫ్రాన్స్, రష్యా వంటి దేశాలు సహ ప్రతినిధులు కూడా ఈ తీర్మానంపై విస్తృతమైన చర్చల తరువాత డిసెంబర్‍ 2014లో ఆమోదించారు. …

ఆరోగ్యం కోసం యోగా జూన్‍ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం Read More »

ఆధ్యాత్మిక నిలయం హంపి 1986లో UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు

భారతదేశంలో ఉన్న చాలా ఆలయాలు చారిత్రక వారసత్వ సంపదకు పుట్టినిల్లుగా తారసపడడం అత్యంత సహజం. అయితే చారిత్రక విశేషాలతో పాటు పౌరాణిక ప్రాశస్త్యాన్ని కూడా కల్గిన మహత్తర ఆలయాలెన్నో మన దేశంలో ఉన్నాయి. అది మహత్తర ఆలయమే కాదు, మనం అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే వసంతోత్సవానికి (హోలీ) పునాది వేసిన పుణ్య స్థలమది. అదే కర్ణాటక రాష్ట్రంలోని హంపి.13-15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య రాజధాని. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలోని ఒక చిన్న పట్టణం. …

ఆధ్యాత్మిక నిలయం హంపి 1986లో UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు Read More »

బిద్రీ దశాబ్దాల హస్తకళ

భారతీయ మెటల్‍ క్యాస్టింగ్‍ యొక్క అత్యుత్తమ సంప్రదాయాల్లో ఒకటి బీద్రి. హైదరాబాద్‍కు సుమారుగా 145 కి.మీ దూరంలో, బహమని, బీదరీ సామ్రాజ్యాల రాజధానిగా ఉన్న బీదర్‍ నగరంలో మొదటగా ఈ కళ రూపుదిద్దుకుంది. ఈ కళ మూలాలు ఎక్కడో ఇంకా తేలనప్పటికీ, ఇస్లామిక్‍ ప్రపంచంలో ఇది పరిపూర్ణతను సం తరించుకుంది. అక్కడి నుంచి అది దక్షిణ భారతదేశానికి చేరుకుంది. దక్కన్‍ పాలకులు ఈ కళను పెంచి పోషించారు. ఈ మెటల్‍ వర్క్ శైలి, డెకొరేటివ్‍ ఎలిమెంట్స్ రెండూ …

బిద్రీ దశాబ్దాల హస్తకళ Read More »

సాదత్‍ హసన్‍ మంటో ఐదవ విచారణ

బ్రిటిష్‍ వాళ్ల కాలంలో ఉన్న కోర్టులు, స్వాతంత్రం వచ్చిన తరువాత వున్న కోర్టుల కన్నా చాలా బాగా పనిచేసాయి. ఈ విషయం మన అనుభవం లోకి రాలేదు కానీ, అవి మంటో అనుభవంలో వున్నవే. మంటో వాటిని చూశాడు ఇబ్బందులు కూడా పడ్డాడు. బ్రిటిష్‍ వాళ్లు వెళ్లిపోయిన తర్వాత మంటో సమస్యలు మరింత పెరిగాయి. కొత్తగా ఆవిర్భవించిన పాకిస్థాన్లో అతను ఒక విభిన్నమైన ‘మోరల్‍ కోడిని’ చూశాడు. అసహనంతో ఉన్న ‘‘రాజ్యాన్ని’’ చూశాడు. కొత్త కేసులని ఎదుర్కొన్నాడు.అతని …

సాదత్‍ హసన్‍ మంటో ఐదవ విచారణ Read More »

తెలంగాణాలో సాగునీటి ప్రాజెక్టులు – పర్యావరణ పునరుద్దరణ

మిషన్‍ కాకతీయ:తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష, తెలంగాణా ప్రజల స్వప్నం అయిన చెరువుల పునరుద్దరణ కార్యక్రమాన్ని మిషన్‍ కాకతీయ పేరుతో, మన ఊరు మన చెరువు ట్యాగ్‍ లైన్‍తో బృహత్తరమైన ఫ్లాగ్‍ షిప్‍ పోగ్రాంని రూపకల్పన చేసారు ముఖ్యమంత్రి కెసిఆర్‍. ఆ పోగ్రాంని కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాక ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతో నడిచే ఒక ప్రజా ఉద్యమ కార్యక్రమంగా జరగాలని ఆయన బావించారు. ఈ నాలుగేండ్లలో మిషన్‍ కాకతీయ కార్యక్రమం నాలుగు …

తెలంగాణాలో సాగునీటి ప్రాజెక్టులు – పర్యావరణ పునరుద్దరణ Read More »

అంతర్జాతీయ ప్రమాణాలతో దేశీయ అవసరాలు తీర్చుతున్న ఈసీఐఎల్‍

వ్యూహాత్మక ఎలక్ట్రానిక్స్లో స్వయం సంవృద్ధిని సాధించి, దేశీయ అవసరాలు తీర్చాలన్న లక్ష్యంతో ఏర్పడిన ప్రెస్టీజియస్‍ సంస్థ ఎలక్ట్రానిక్‍ కార్పొరేషన్‍ ఆఫ్‍ ఇండియా. ఈసీఐఎల్‍గా అందరికీ సుపరిచితమై ప్రపంచఖ్యాతినార్జించిన ఈ సంస్థ అణు శక్తి విభాగం ఆధ్వర్యంలో 11 ఏప్రిల్‍, 1967లో మన హైదరాబాద్‍లోని కుషాయి గూడ ప్రాంతంలో ఆవిర్భవించింది. దూసుకుపోయే క్షిపణులు, విమానాల కాక్‍పిట్‍ వాయిస్‍ రికార్డర్లు, అణువిద్యుత్‍ను సృష్టించే రియాక్టర్లు, రేడియేషన్‍ను గుర్తించే డిటెక్టర్లు, వినోదాలు పంచే టీవీలు, వైద్య చికిత్సకు ఉపయోగించే ఉపకరణాలు… మరీ …

అంతర్జాతీయ ప్రమాణాలతో దేశీయ అవసరాలు తీర్చుతున్న ఈసీఐఎల్‍ Read More »