May

21 సూత్రాల అజెండాతో నయా ఉస్మానియా

ఉస్మానియా యూనివర్సిటీ ఆర్టస్ కాలేజ్‍ ముందు నిలబడి దాన్ని చూస్తుంటే ప్రతీ ఒక్కరిలోనూ ఎన్నో రకాల అనుభూతులు కలుగుతాయి. కొందరికి అక్కడ తాము చదువుకున్న రోజులు గుర్తుకొస్తే, మరి కొందరికి ఒకనాటి రాచరికం మదిలో మెదులుతుంది. కొందరికి అక్కడ ఉరకలు వేసిన తెలంగాణఉద్యమం గుర్తుకొస్తుంది. మరికొందరికి వివిధ అంశాల్లో అక్కడి విద్యార్థుల చైతన్యం యాదికొస్తుంది. అదే మన ఉస్మానియా యూనివర్సిటీ.యావత్‍ దేశంలో ఉన్నత విద్యకు మారుపేరుగా నిలిచింది ఉస్మానియా యూనివర్సిటీ. తాజాగా ఫౌండేషన్‍ డే వేడుకతో ఈ …

21 సూత్రాల అజెండాతో నయా ఉస్మానియా Read More »

సైబ పరంధాములు

పెద్దబజారు చిన్నసందులోని కళాత్మకమైన దర్వాజా లోంచి సన్నగా – సన్నని నడిమి పాపిట ఒత్తైన వెంట్రుకలతో, చేతిలో ఎన్నో పుస్తకాలతో స్టూడియో ‘ఆక•తి’కి నడిచి వెళ్తుంటే కళా సెలయేరు పారుతున్నట్లనిపిస్తుండేది… ఆ కళామూర్తే సైబ పరంధాములు.కీ.శే.సైబ పరంధాములు, శ్రీ సైబ లింగయ్య, శ్రీమతి గంగూబాయి దంపతులకు 08-4-1945న నిజామాబాద్‍ నగరంలో జన్మించారు. అప్పటి మల్టీపర్పస్‍లో చదివి గోల్డ్ మెడల్‍ సంపాదించారు. అనారోగ్య కారణాల వల్ల బి.టెక్‍. పూర్తి చేయలేక పోయారు. ఇది ఒకవైపు వారి శారీరక కోణం. …

సైబ పరంధాములు Read More »

అరబ్బీ మురబ్బా ‘బార్కాస్‍’

ఒక తాతీల్‍ (సెలవు) దినం పురుసత్‍గ చార్మినార్‍కు వెళ్లండి. అక్కడ చార్మినార్‍ చల్లని చత్రచ్ఛాయలలో ఒక పాత సైకిలు సీటు వెనుక త్రాళ్లతో కట్టిన గుండ్రటి వెదురు గంపలో దోరగా మగ్గిన జాంపండ్లను పెట్టుకుని, నడుముకు తోలు బెల్టుతో ఎగగట్టిన ఎర్ర గళ్లలుంగీని గట్టిగా బిగించి కట్టుకుని, నోటినిండా ఎర్రని పాన్‍ నములుతూ మధ్యలో తుపుక్‍, తుపుక్‍ మని రోడ్డుమీద ఉమ్మేస్తూ, సన్నగా పొడుగ్గా ఉన్న మేక గడ్డం చిరుగాలితో సయ్యాటలాడుతుంటే, తెల్లటి మస్లీన్‍ లాల్చీ ధరించి, …

అరబ్బీ మురబ్బా ‘బార్కాస్‍’ Read More »

జానపద గేయాలలో సామాజిక జీవనం

జానపదులు అంటే సామాన్యంగా గ్రామీణులు లేదా నిరక్షరాస్యులు అని అనుకుంటారు. జనపదం అంటే గ్రామం కాబట్టి గ్రామంలో నివసించే వారు జానపదులు అనుకున్నారు. కానీ మారిన కాలాన్ని బట్టి, సామాజిక పరిణామాన్ని బట్టి జానపదులు అంటే ఏదైనా ఒక విషయంలో భాగస్వామ్యం గల జనసముదాయం అని చెప్పవచ్చు.సమాజంలో అక్షరజ్ఞానం లేని సామాజికులు, గ్రామీణ, శ్రామిక సామాన్య జనం తమ శ్రమలో, ఆచారాల్లో, సంబరాల్లో అలవోకగా సృష్టించుకుని అలిఖితంగా తరతరాలుగా ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమింప …

జానపద గేయాలలో సామాజిక జీవనం Read More »

తెలంగాణలో పుష్కలంగా వారసత్వ సంపద

ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా హెరిటేజ్‍ పరిరక్షణ పర్యాటకంపై అవగాహన సదస్సు ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని దక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ (DHA), ఇంటర్నేషనల్‍ కౌన్సిల్‍ ఆన్‍ మాన్యుమెంట్స్ అండ్‍ సైట్స్ వింగ్‍ ఆఫ్‍ ఇండియా (ICOMOS), తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (TSTDC) అభివృద్ధి సంస్థ సహకారంతో హెరిటేజ్‍ పరిరరక్షణ పర్యాటకంపై అవగాహన సదస్సును ఏప్రిల్‍ 18న బేగంపేట్‍లోని హరిత ప్లాజాలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‍గౌడ్‍, …

తెలంగాణలో పుష్కలంగా వారసత్వ సంపద Read More »

పిల్లలమర్రి దేవాలయంలో ఉన్న ఆ ఒక్క వర్ణచిత్రాన్నీ కాపాడుకోలేమా?

ఆది మానవుని అడుగుజాడలకు అద్దం పట్టిన తెలుగు నేలపై శిలాయుగంలోనే చిత్రకళ పురుడుపోసుకుంది. తెలంగాణా – రాయల సీమ జిల్లాల్లో దాదాపు 45కుపైగా స్థావరాల వద్ద గుహల్లోనూ, కొండ చరియలపైనా ఆనాటి వర్ణచిత్రాలు అప్పటి సృజనకు ఆనవాళ్లుగా నేటికీ నిలిచేవున్నాయి. కరీంనగర్‍ జిల్లాలో రేగొండ, వరంగల్‍ జిల్లాలో పాండవుల గుట్ట, కర్నూలు జిల్లాలో కేతవరం, మహబూబ్‍నగర్‍ జిల్లాలో సంగనోన్‍ పల్లి, కడప జిల్లాలో చింతకుంట, నెల్లూరు జిల్లాలో నాయుడుపల్లి శిలాయుగపు చిత్రకళకు కొన్ని ఉదాహరణలు.మళ్లీ శాతవాహనుల కాలంలో …

పిల్లలమర్రి దేవాలయంలో ఉన్న ఆ ఒక్క వర్ణచిత్రాన్నీ కాపాడుకోలేమా? Read More »

దక్కన్‍ తాజ్‍ మహల్‍!

తాజ్‍ మహల్‍లాగానే అనిపిస్తుంది. ఇది ఆగ్రా కాదు. చూస్తున్నది తాజ్‍ మహలూ కాదు. తాజ్‍మహల్‍ లాంటిదే కట్టాలన్న ఓ ప్రయత్నం. పేరు బీబీ కా మఖ్బారా. ఔరంగా బాద్‍లో ఉంది. అందుకే దక్కన్‍ తాజ్‍గా వాడుకలోకి వచ్చింది. బీబీ కా మఖ్బారాలో తాజ్‍ మహల్‍లో ఉండే తేజం కనిపించదు, కానీ నిర్మాణ నైపుణ్యంలో తాజ్‍మహల్‍కు ఏ మాత్రం తీసిపోదు. ఔరంగజేబు భార్య దిల్‍రాస్‍ బానుబేగమ్‍ సమాధి నిర్మాణం ఇది. బాను బేగమ్‍ కొడుకు అజమ్‍ షా దగ్గరుండి …

దక్కన్‍ తాజ్‍ మహల్‍! Read More »

ప్లాస్టిక్‍ విముక్త సముద్రాలు – మానవాళి మనుగడ

సముద్రాలలో చేపల కన్నా ప్లాస్టిక్‍ అధికంగా పెరుగుతూ ఉన్నదని ఆందోళన చెందుతూ ఉంటారు పర్యావరణ వాదులు, శాస్త్రవేత్తలు. ఎక్కడో మనకు దూరంగా ఉన్న సముద్రంలోన నేనొక్కడినే ప్లాస్టిక్‍ను విడుదల చేస్తున్నానా? ఏమిటనే ప్రశ్నతో మనమేమీ ప్లాస్టిక్‍కు ‘నో’ చెప్పం. కనీసం వాడకమైనా తగ్గించాలని అనుకోం. ప్లాస్టిక్‍ వాడకం నెలకింత చొప్పున తగ్గించాలని భావించం. అయితే బారీ కామనర్‍ అనే సామ్యవాద పర్యావరణ వేత్త ‘ది క్లోజింగ్‍ సర్కిల్‍’ అనే ఓ గ్రంథం రాశాడు. దాన్లో ఆయన పర్యావరణ …

ప్లాస్టిక్‍ విముక్త సముద్రాలు – మానవాళి మనుగడ Read More »

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన పింక్‍ సిటీ జైపూర్‍ (రాజస్థాన్‍)

జైపూర్‍ను 2019 జూలై 6న యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పేర్కొనబడింది. ఇది అరుదైన యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది. ప్రపంచ వారసత్వ సందర్శనీయ ప్రాంతంగా గుర్తింపు ఇచ్చింది. ఈ మేరకు UNESCO యునెస్కో (యునైటెడ్‍ నేషన్స్ ఎడ్యుకేషనల్‍, సైంటిఫిక్‍, కల్చరల్‍ ఆర్గనైజేషన్‍) 2019 జూన్‍ 06 ట్విట్టర్‍లో అధికారికంగా ఓ ప్రకటన చేసింది. జైపూర్‍ భారతదేశంలో అత్యంత సామాజికంగా గొప్ప వారసత్వ పట్టణ ప్రాంతాలలో ఒకటి.జైపూర్‍, రాజస్తాన్‍ రాష్ట్రానికి రాజధాని. రాష్ట్రంలో అతిపెద్ద నగరం. …

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన పింక్‍ సిటీ జైపూర్‍ (రాజస్థాన్‍) Read More »

ఉస్మానియా విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం

7వ నిజాం ఫత్‍ జంగ్‍ మీర్‍ ఉస్మాన్‍ అలీ ఖాన్‍ ఆసఫ్‍ జా-Vll చే 1917, ఏప్రిల్‍ 26న స్థాపించబడింది ఓయూకు పూర్వవైభవం తీసుకొద్దాం గతవైభవాన్ని సైతం విద్యార్థులకు చాటిచెప్పేలా చర్యలు ఈ ఏడాది నుంచి ప్రతీ ఏటా ఘనంగా వ్యవస్థాపక దినోత్సవం సమావేశంలో వెల్లడించిన ఓయూ వీసీ ప్రొఫెసర్‍ రవీందర్‍ ఏప్రిల్‍ 26న ఠాగూర్‍ ఆడిటోరియంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సెల్స్ తో పాటు అంబేడ్కర్‍ రీసెర్చ్ సెంటర్‍, మైనార్టీ సెల్‍ ఆధ్వర్యంలో ఓయూ 105వ …

ఉస్మానియా విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం Read More »