November

ప్రకృతే సౌందర్యం! 30 ప్రకృతే ఆనందం!! పాలు పోసేది మీరే! ప్రాణాలు తీసేది మీరే!!

కూ•రమృగాలుగా ముద్రవేసిన జంతువులు ఎదురుపడితే పారిపోతారు. అదే మేము (పాములు) ఎదురుపడితే అరిచి, జనాన్ని పోగుచేసి చంపుతారు. పైగా చిన్న పామునైనా పెద్దకర్రతో చంపాలని కథలు చెపుతారు. మరోవైపు ఏ జంతువుకు చూపని భక్తిశ్రద్ధల్ని, ఆరాధనను మాపట్ల చూపుతారు. నాగపంచమి పేరున మీ మహిళలు (మగవారు కాదు) మా ఆవాసాలైన పుట్టల్లో (అన్ని పుట్టల్లో మేం వుండం) పాలుపోసి తరిస్తారు. మాపట్ల మీకు ఇంత గౌరవం భక్తిశ్రద్ధలు వున్నాయి కదా అని మేం మీ వెనక వచ్చామనుకోండి… …

ప్రకృతే సౌందర్యం! 30 ప్రకృతే ఆనందం!! పాలు పోసేది మీరే! ప్రాణాలు తీసేది మీరే!! Read More »

అడ్వెంచర్‍ కమ్‍ ఆధ్యాత్మికం.. అహోబిలం ట్రెక్‍

అడ్వెంచర్‍ కమ్‍ ఆధ్యాత్మికం అహోబిలం (Ahobilam) ట్రెక్‍. గుంటూరు ట్రెక్కింగ్‍ కింగ్స్ (GTK) వారి అహోబిలం బ్రోచర్‍ చూడగానే ఆలోచనలో పడ్డాను. అహోబిలం రెండుమూడు పర్యాయాలు వెళ్ళాను. కానీ దట్టమైన నలమల పశ్చిమ కనుమల అందాలు ఎప్పుడూ చూడలేదు. వెళ్లాలనే ఉత్సాహం నానాటికీ పెరిగిపోయింది. ఉగ్రస్తంభం ఊరిస్తూ ఉన్నది. యూట్యూబ్‍ (Youtube) వీడియోలు భయపెడుతూ ఉన్నాయి. ఎలాగైనా వెళ్ళాల్సిందే.. అనే పట్టుదల పెరిగింది. GTK వాళ్ళతో తర్జనభర్జనల పిమ్మట ప్రయాణానికి సిద్ధమయ్యాను. HTC, YHA లాగా GTK …

అడ్వెంచర్‍ కమ్‍ ఆధ్యాత్మికం.. అహోబిలం ట్రెక్‍ Read More »

బాలల హక్కుల పరిరక్షణే ధ్యేయం నవంబర్‍ 14 మరియు 20న బాలల దినోత్సవాలు

జవహర్‍ లాల్‍ నెహ్రూకి పిల్లలన్నా, గులాబీ పూవులన్నా చాలా ఇష్టం. పిల్లలను జాతి సంపదలుగా నెహ్రూ చెబుతూ ఉండేవారు. ఆయన పాలనలో దేశంలో బాలల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అందుకే ఆయన పుట్టినరోజున మన దేశంలో బాలల పండుగ నిర్వహిస్తున్నారు. ఈరోజు చాచా నెహ్రూను తలుచుకుని పిల్లలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానిగా పనిచేశారు జవహర్‍ లాల్‍ నెహ్రూ. ఆయన జన్మించిన రోజున బాలల దినోత్సవం జరుపుకోవడానికి గల …

బాలల హక్కుల పరిరక్షణే ధ్యేయం నవంబర్‍ 14 మరియు 20న బాలల దినోత్సవాలు Read More »

సమాజంలో టెలివిజన్‍ ప్రాముఖ్యత! నవంబర్‍ 21న ప్రపంచ టెలివిజన్‍ దినోత్సవం

టీవీ ఓ ప్రసార మాధ్యమంగా వచ్చి ఇప్పుడు ప్రతి ఇంట్లో ఓ భాగం అయిపోయింది. ఇప్పుడంటే ప్రతి ఇంట్లోనూ టీవీలు ఉన్నాయి. 30 ఏళ్ల క్రితం ఒక ఉళ్లో ఒక్క టీవీ ఉండడం పెద్ద విశేషం. ఒకప్పుడు టీవీ అంటే డబ్బు ఉన్నవారి ఇళ్లలోనే ఉండేది. కానీ మారుతున్న పరిస్థితుల కారణంగా ప్రతి ఇంట్లో టీవీ భాగమైపోయింది. టెక్నాలజీ పెరిగి సెల్‍ ఫోన్ల వాడకం పెరిగినా టీవీలను చూసేవారు ఉన్నారు. 1996లో ఐక్యరాజ్యసమితి జనరల్‍ అసెంబ్లీ (UNGA) …

సమాజంలో టెలివిజన్‍ ప్రాముఖ్యత! నవంబర్‍ 21న ప్రపంచ టెలివిజన్‍ దినోత్సవం Read More »

గ్రామ నామాల పరిశోధకుడు మండలస్వామి మృతికి దక్కన్‍ల్యాండ్‍ నివాళి

కవి, రచయిత, సాహిత్య విమర్శకులు, గ్రామనామాల పరిశోధకుడు డాక్టర్‍ మండలస్వామి అక్టోబర్‍ 18న అనారోగ్యంతో మృతి చెందారు. వీరు ప్రస్తుతం నలగొండ మండలంలోని వెలువర్తి జడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. ‘ప్రాచీన గ్రామనామాల చారిత్రక సాంస్కృతిక సామాజిక దృక్పథం’ అనే అంశంపై పరిశోధన చేసారు. నల్గొండ జిల్లాలోని పలు గ్రామాలలోని ప్రాచీన శిలా శాసనాలను పరిశీలించి ఆ గ్రామాల నామాల గురించి పరిశోధనా వ్యాసాలను రాసారు. వారి రచనలు దక్కన్‍ల్యాండ్‍ ప్రచురించింది. వారి …

గ్రామ నామాల పరిశోధకుడు మండలస్వామి మృతికి దక్కన్‍ల్యాండ్‍ నివాళి Read More »

వక్క సాగు – పర్యావరణం బాగు

అతిథులకు భోజనం పెట్టిన తర్వాత వక్క పలుకు ఇవ్వకుంటే భోజనం పెట్టిన ఫలితం దక్కదట. అలాగే భోజనం పెట్టక పోయినా, తాంబూలంగా వక్కపొడి ఇస్తే భోజనం పెట్టినంత ఫలితం దక్కుతుందని పెద్దవాళ్లు చెబుతుంటారు. అంటే వక్క కు అంత ప్రాముఖ్యత ఉంది. సాంప్రదాయ అవసరాలకు, అనేక ఆచార సంబంధ కార్యక్రమాలు, శుభ, అశుభ కార్యక్రమాల్లో వక్కకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఆయుర్వేద గ్రంథాల ద్వారా వక్కకు ఔషధ గుణాలు ఉన్నట్లు తెలుస్తుంది. వక్కను అరికానట్‍ చెట్టు నుండి …

వక్క సాగు – పర్యావరణం బాగు Read More »

ఊదలు – ఆరోగ్య ప్రయోజనాలు

చిరు ధాన్యాల్లో ఊదలు (Barnyard Millet’s) ఒకటి. రుచికి తియ్యగా ఉండే వీటిని ఎక్కువగా ఆసియా ఖండంలోనే పండిస్తారు. మన దేశంలో ఈ ఊదలను ఎక్కువగా ఉత్తరాఖండ్‍లో పండించగా.. తమిళనాడులోని పర్వత ప్రాంతాల్లో కూడా వీటిని పండిస్తున్నారు.వీటితో తయారుచేసిన ఆహారం బలవర్ధకంగా ఉంటుంది. దీంతో సులభంగా జీర్ణమవుతుంది. ఊదలులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‍ కారణంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఊదలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు గురించి ఈరోజు తెలుసుకుందాం. ఒక 100 గ్రాముల …

ఊదలు – ఆరోగ్య ప్రయోజనాలు Read More »

తాపీమేస్త్రీ

ఈ కథలో మనకు ప్రధానంగా కనిపించే పాత్రలు రెండే రెండు రత్తమ్మ, సుందరమ్మ. రత్తమ్మ నెమ్మదస్తురాలు, డాంబికాలు నచ్చవు. ఉన్నదాంట్లో సర్దుకు పోయే మనిషి, సుందరమ్మ కాస్త డాబుసరి. ఆవిడకి హెచ్చులు, ఆడంబరాలు ఎక్కువ. ఇద్దరికీ భర్తలు లేరు. కాలాంతరము చెందారు. ఇరువురు తమ పిల్లల ఉద్యోగాల కోసం రాజమండ్రికి వచ్చారు. రత్తమ్మకు ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు బి.ఎ. పూర్తి చేసిఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. సుందరమ్మకు ఇద్దరూ కొడుకులే. ఒకడు బి.ఎ. పూర్తి …

తాపీమేస్త్రీ Read More »

ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేది మన ‘ఓటే’

ఓటు ఎంత వ్యక్తిగతమో అంత సామాజికమైనది. మనం బ్రతక వలసిన సమాజపు రూపురేఖల్ని నిర్ధారించి విధానాలను రూపొందించే నిర్మాణశక్తి ‘ఓటు’. ప్రపంచ దేశాల ముందు మనల్ని గౌరవంగానో, అగౌరవంగానో నిలబెట్టేది మన ఓటు ద్వారా నిర్మితమైన వ్యవస్థే. ప్రపంచంలోనే అతి పెద్దప్రజాస్వామిక దేశంగా మన దేశానికి గుర్తింపు, విలువా ఉన్నాయి. దీనికి కారణం మన వారసత్వపు ప్రజాస్వామిక దృక్పథం. దేశానికి స్వాతంత్య్రం వస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలిపోతుందనీ, అంతర్గత ఘర్షణలతో దేశం అల్లకల్లోలం అయిపోతుందనీ పాశ్చాత్య దేశాలు …

ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేది మన ‘ఓటే’ Read More »

భాగ్యరెడ్డి వర్మ

అంబేద్కర్‍ 125వ జయంత్సుత్యవాలు దేశ, విదేశాల్లో ఘనంగా జరుపుకొంటున్నాం. ఆయన రచనలన్నీ ఇప్పుడు వివిధ భాషల్లో ఉచితంగా అందరికీ అందుబాటులోకి వచ్చాయి. తెలుగు యూనివర్సిటీ ప్రచురించిన తెలుగు సంపుటాలు కూడా ఆన్‍లైన్‍లో అందుబాటులో ఉన్నాయి. అంబేద్కర్‍ని భిన్న పార్శ్వాల్లో దర్శించడానికి ఆయన రచనలు దారి చూపిస్తున్నాయి. అయితే అంబేద్కర్‍ కన్నా ముందే దేశవ్యాప్తంగా ‘ఆదిహిందువు’ల, నిమ్నజాతుల (హరిజన అనే పదాన్ని భాగ్యరెడ్డి వర్మ నిర్ద్వందంగా వ్యతిరేకించిండు) వారి నాయకుడిగా గుర్తింపు పొందినవాడు భాగ్యరెడ్డి వర్మ. కాశీనాథుని నాగేశ్వరరావు …

భాగ్యరెడ్డి వర్మ Read More »