పక్కా హైదరాబాదీ వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ
అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాదీలు చూపిన ప్రతిభ, తెగువ చరిత్రలో అంతగా రికార్డు కాలేదు. తెలంగాణ గడ్డమీద పుట్టిన వాళ్లు ప్రాణాలకు తెగించి కొట్లాడిన విషయమూ అందరికీ తెలియదు. ఇట్లా విస్మరణకు గురైన వాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే ఇవ్వాళ ఇక్కడ పక్కా హైదరాబాదీ వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ గురించి తెలుసుకుందాం. మాతృదేశ విముక్తి కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా యూరప్ కేంద్రంగా విప్లవోద్యమాలు చేసిండు. రహస్యంగా విప్లవకారుల మద్ధతు కూడగడుతూ అంతర్జాతీయ స్థాయిలో భారతీయుల వాణిని …









