అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-8
ముదుగొండచాళుక్య కుసుమాదిత్యునికుక్కునూరు రాగిరేకుతెలుగు (గద్య) శాసనం క్రీ.శ.12వశతాబ్ది ఖమ్మం జిల్లా పాల్వంచతాలూకా కుక్కునూరులో దొరికిన ముదుగొండచాళుక్య కుసుమాదిత్యుని రాగిరేకు శాసనం, ఆ రాజ వంశానికి చెందిన రెండోశాసనం. ఇది క్రీ.శ.12వ శతాబ్ది నాటిది. కాకతీయుల కంటే ముందు తూర్పు తెలంగాణా ప్రాంతాన్ని దాదాపు రెండు శతాబ్దాలు పాలించిన ముదుగొండచాళుక్యుల వంశవృక్షాన్ని, విజయాలను, నాటి తెలుగు భాష స్వరూపాన్ని తెలియజేసే ఈ శాసనం చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకొంది. 1973వ సం।।లో బి.హెచ్.లక్ష్మీనారాయణ అనే పరిశోధకులు, భద్రాచలంలో ఉన్న తన …









