కళావరు రెండు
గుహనిండా చెల్లా చెదరుగా పడి ఉన్న రాళ్ళ మధ్య వాళ్లు నలుగురూ, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నించున్నారు. గుహ బయట ఉన్న రాళ్ళు, రప్పలు, తుప్పలు, ఆకుపచ్చని వెలుగులో తళ తళలాడిపోతున్నాయి. ఆ రాళ్ళ మధ్య వాళ్ళు వచ్చిన అంతరిక్ష నౌక ‘పినాకిని’ నిశ్చలంగా ఉంది. గుహ బయట వాళ్ళకు ఎదురుగా పర్వతంలా ఉన్న ఒక భయంకరమైన జంతువు నిలబడి ఉంది. ఆ జంతువు పెద్ద లోహపు ముద్దలా ఉంది. దాని వీపు నిండా ఉన్న ముళ్ళు …









