మంటో కోపం
ప్రముఖ కథారచయిత సాదల్ హసన్ మంటో కథలు ఆటవికతని, వ్యభిచారాన్ని శవాలతో సంపర్కాన్ని చేస్తున్న విషయాలని ప్రతిబింబించాయి.దానివల్ల అతను ‘నీతిమంతులకి’ శత్రువయ్యాడు. కోర్టుల బారిన పడ్డాడు. అతని కథల్లో అశ్లీలం వుందని శిక్ష కూడా పడింది. తన విమర్శకులని మంటో చీల్చి చెండాడాడు. ఈ వ్యాసం అతని కోపానికి అసంతృప్తికి వ్యంగ్య సమాధానం.‘‘ఈ కొత్త విషయం మీకు తెలుసా?’’-కొరియా నుంచి వచ్చిన విషయమా?‘‘కాదు. కాదు’’-జునాఘడ్ బేగం గురించా?‘‘కాదు..’’-సెన్సేషనల్ హత్య జరిగిందా మళ్ళీ?‘‘కాదు. సాదత్ హసన్ మంటో గురించి’’-ఏమిటీ? అతను చనిపోయినాడా?‘‘కాదు. …









