deccanland

గణితంలో సున్నా ఆవిష్కరణశాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధి

మనిషి అవసరాల నుండి పుట్టుకొచ్చినది గణితం. అక్షరాస్యుడికైనా, నిరక్షరాస్యుడికైనా రోజువారి జీవనగమనంలో అడుగడుగునా గణితము యొక్క వినియోగం అనివార్యమైనది.సున్నా అనే పదము సంస్కృత పదము శూన్యము నుండిఉద్భవించింది. దీని అర్థము ఖాళీ లేదా శూన్యము.పురాతన మెసపటేమియా మరియు మాయా నాగరికతలలో సున్నాలు పోలి ఉండే ప్లేస్‍ హోల్డర్‍ చిహ్నాల ప్రారంభఉదాహరణలు కనిపించాయి.భారతదేశంలో ‘సున్నా’ చరిత్ర లోతైన గణిత ఆవిష్కరణల కథ. భారతీయ గణిత శాస్త్రవేత్తలు ముఖ్యముగా ఆర్యభట్టు మరియు బ్రహ్మగుప్తుడు వరుసగా 5మరియు 6 శతాబ్దాలలో సున్నాను …

గణితంలో సున్నా ఆవిష్కరణశాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధి Read More »

వేములవాడ చాళుక్యుల విద్యావ్యవస్థ-సంస్థలు

ఉపోద్ఘాతం: దక్కన్‍లో రాష్ట్రకూటుల పాలన సాగుతున్నప్పుడు చాళుక్యులలోని ఒక శాఖను తెలంగాణ ప్రాంతానికి సామంతులుగా నియమించారు. వీరు ముందుగా పోతన లేదా బోధన్‍ను రాజధానిగా చేసుకొని సపాద లక్ష దేశమును పరిపాలించారు. అనంతరం వీరు మూలవాగు ఒడ్డున ఉన్న వేములవాడకు తమ రాజధానిని మార్చి పాలించడం ప్రారంభించారు. నాటి నుండే వీరు వేములవాడ చాళుక్యులుగా ప్రసిద్ధిపొంది చరిత్రలో సుస్థిరస్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ వంశంలో మొదటివారు వినయాదిత్య యుద్ధమల్లుడు. వీరు సా.శ.750లో రాజ్యానికి రావడంతో వేములవాడ రాజ్యపాలన ప్రారంభమైంది. …

వేములవాడ చాళుక్యుల విద్యావ్యవస్థ-సంస్థలు Read More »

రెస్క్యూలో సింగరేణి మహిళా ఉద్యోగులు

సింగరేణిలో మహిళా రెస్క్యూ జట్టు తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాలని, నైపుణ్యం, కృషి, అంకితభావంతో ఉత్తమ సేవలు అందించాలని సింగరేణి సీఎండీ ఎన్‍.బలరామ్‍ పిలుపునిచ్చారు. 136 ఏళ్ల సింగరేణి చరిత్రలో తొలిసారిగా రెస్క్యూలో శిక్షణ పొందిన మహిళా జట్టును ఆయన హైదరాబాద్‍ సింగరేణి భవన్‍లో జులై 5న అభినందించి, సర్టిఫికేట్లు ప్రదానం చేశారు.సింగరేణిలో మొదటి మహిళా రెస్క్యూ జట్టును ఏర్పరచడం, ప్రత్యేక శిక్షణ ఇవ్వడం సంతోషకరంగా ఉందన్నారు. ప్రమాదాల సమయాల్లో, సేవా కార్యక్రమాల్లో మహిళా రెస్క్యూ జట్టు …

రెస్క్యూలో సింగరేణి మహిళా ఉద్యోగులు Read More »

తెలంగాణలో జాతీయ పసుపు బోర్డుగోల్డెన్‍ స్పైస్‍కు ప్రభుత్వ మద్దతు

భారతీయ వంటశాలలలో ముఖ్యమైన సుగంధ ద్రవ్యమైన పసుపు, చివరకు దానికి అవసరమైన మద్దతును పొందుతోంది. జూన్‍ 29, 2025న, కేంద్ర హోం మంత్రి అమిత్‍ షా తెలంగాణలోని నిజామాబాద్‍లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు.పసుపు (కుర్కుమా లాంగా) భారతదేశానికి చెందినది. దాని ఆరోగ్య ప్రయోజనాల కోసం విస్తృతంగా అధ్యయనం చేయబడింది. ఆహారం, ఆరోగ్య అనుబంధంగా దీనికి ప్రజాదరణ ఉన్నప్పటికీ, పసుపు రైతులు పెద్దగా ప్రయోజనం పొందలేకపోయారు. దశాబ్దాలుగా బోర్డు ఏర్పాటును డిమాండ్‍ చేస్తున్నారు. అక్టోబర్‍ …

తెలంగాణలో జాతీయ పసుపు బోర్డుగోల్డెన్‍ స్పైస్‍కు ప్రభుత్వ మద్దతు Read More »

పూటకూళ్ళవ్వ

(గత సంచిక తరువాయి)(జరిగిన కథ: స్కూల్‍ పిల్లలకు హోమ్‍ థియేటర్‍లో ‘‘స్వచ్ఛ భారత్‍’’కు సంబంధించిన సినిమా చూపిస్తుంది అవ్వ)సినిమా మొత్తం అయిపోగానే పిల్లలకు విడిదిలో చేసిన తీయటి బిస్కట్లు కాగితం ప్లేట్లలో పంచి పెట్టింది. వాళ్ళందరూ ఏదో ఆలోచనలోపడటం గమనించింది అవ్వ.బయటికి వచ్చాక అందరూ ఆ బిస్కెట్లు తిన్నారు. కొంత మంది పిల్లలు ఎప్పటిలా ఖాళీ పేపర్లు వరండాలో పడేయ బోయారు. కొంచెం పెద్ద పిల్లలు వాళ్లను ఆపారు. ‘‘ఈసినిమా చూశాక ఎందుకో అలా పడేయాలనిపించడం లేదురా… …

పూటకూళ్ళవ్వ Read More »

ప్రపంచ దినోత్సవాలునిర్మాణాత్మక ఆచరణకు స్ఫూర్తినిస్తాయి

నిత్యజీవితంలో ప్రతిరోజూ జాగ్రత్తగా పాటించవలసిన విషయాలను మనుషులు సహజంగానే నిర్లక్ష్యం చేస్తుంటారు. దానివల్ల అనేక రకాల కష్టాలకు నష్టాలకు గురవుతారు. ఈ కష్టనష్టాలు సుదీర్ఘ కాలం కొనసాగవచ్చు. కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చు. కొన్నిసార్లు శాశ్వతం కావచ్చు. నిర్లక్ష్యం చేయబడుతున్న అంశాలను ప్రజలకు గుర్తుచేసి అప్రమత్తం చేయడం కోసం, సరైన ఆచరణకోసం ఒకో అంశానికి ఒకో ప్రత్యేక దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరపుకోవడం మనకు తెలుసు. ప్రతినెలా కొన్ని ఉంటాయి. చారిత్రిక ప్రాధాన్యతను బట్టి, సంఘటనల ప్రాతినిధ్యాన్ని బట్టి ప్రతినెలా …

ప్రపంచ దినోత్సవాలునిర్మాణాత్మక ఆచరణకు స్ఫూర్తినిస్తాయి Read More »

మహిళా స్ఫూర్తిప్రదాత దుర్గాబాయి దేశ్‍ముఖ్‍

జూలై 15న జయంతి తన జీవితమంతా సమాజ సేవకు ముఖ్యంగా స్త్రీజనోద్ధరణకు అంకితం చేసిన స్ఫూర్తిప్రదాత శ్రీమతి దుర్గాబాయి దేశ్‍ముఖ్‍. ఈమె దేశభక్తురాలిగా, స్వాతంత్య్ర సమరయోధురాలిగా, సంఘ సంస్కర్తగా, కార్యకర్తగా, రచయిత్రిగా… తన కాలంలో మరెవరూ చూపని ధైర్యసాహసాలను, ప్రజ్ఞను చూపి చరిత్రలో నిలిచిపోయారు.మన ఆంధ్రరాష్ట్రం గర్వించదగ్గ మహిళామూర్తులో దుర్గాబాయిని ఆగ్రగణ్యులుగా చెప్పుకోవచ్చు. ఆమె వ్యక్తి మాత్రమే కాదు, ఒక వ్యవస్థ, ఓ గొప్ప మహోన్నత శక్తి. మేధావిగా, న్యాయ కోవిదురాలుగా, మానవతావాదిగా, ఆంధ్రమహిళాసభ వ్యవస్థాపకురాలిగా.. బహుముఖ …

మహిళా స్ఫూర్తిప్రదాత దుర్గాబాయి దేశ్‍ముఖ్‍ Read More »

వజ్రాలు కాని వజ్రాలు

వజ్రాలు సహజ పరిస్థితిలో భూమి అడుగున లోతుల్లో అధికపీడనం ఉష్ణోగ్రత వద్ద ఏర్పడి పైపొర లోపలికి అంతర్గమాల ద్వారా చేరిన కర్బన రూపాలు. ఇవి చాలా అరుదుగా మాత్రమే దొరుకుతాయి. వజ్రాలకు ఉన్న వాణిజ్య విలువవల్ల అందరికీ అందుబాటులో ఉండవు. ఈ కారణంగా అనేక ఇతర ఖనిజ/కృత్రిమ పదార్థాలు వజ్రాలకు ప్రత్యామ్నాయంగా వాడ బడుతున్నాయి. వాణిజ్యపరంగా వీటిని కూడా ‘‘వజ్రాలు’’ అనే అంటారు. వీటికిగల వజ్రాన్ని పోలిన లక్షణాలవల్ల తరచుగా వజ్రాలు అనే పదం వీటికి కూడా …

వజ్రాలు కాని వజ్రాలు Read More »

‘‘స్వంత కథ’’

(గత సంచిక తరువాయి)సరే. మళ్లీ మనం మా బాపు పరవస్తు జియ్యరు స్వామి గారి వద్దకు వెళ్లుదాం. ఆయనా, ప్రజాకవి కాళోజీ నారాయణరావుగారు ఇద్దరూ 1915వ సంవత్సరంలోనే మడికొండ గడ్డమీద జన్మించారు. వారిద్దరు సమకాలికులు. ఇద్దరు కూడా హన్మకొండలోని ‘‘మర్కజీ’’ స్కూలు విద్యార్థులే. మా బాపు ‘‘తహెతానియా’’ అంటే మిడిల్‍ స్కూలు అయిపోగానే టీచర్‍ ట్రేయినింగ్‍ కోర్సు చేసి ఏకోపాధ్యాయ పాఠశాలలో టీచర్‍ ఉద్యోగం 1935లో సంపాదించినాడు. మరాఠ్వాడా గ్రామాలలో టీచర్‍గా పనిచేస్తూ 1948 పోలీస్‍ యాక్షన్‍ …

‘‘స్వంత కథ’’ Read More »

తెలుగువారి తొలి రాజధాని కోటలింగాల

శాతవాహనులు తమ పరిపాలన ప్రారంభించింది ప్రతిష్ఠాన (పైథాన్‍)పురం నుంచి కాదనీ, తెలుగుకు ‘ఆణ’మైన తెలంగాణాలోని కోటలింగాల కోటనుంచి అని తెలిసిన తరువాత తెలంగాణాతో పాటు తెలుగునేలంతా పులకించింది. గర్వంతో తొణికిసలాడింది. 1978లో రాష్ట్ర పురావస్తుశాఖ, వి.వి.కృష్ణశాస్త్రి, ఎన్నెస్‍ రామచంద్రమూర్తిల ఆధ్వర్యంలో కోటలింగాల (ప్రస్తుతం జగిత్యాల జిల్లా)లో జరిపిన తవ్వకాల్లో విస్తుబోయే పురాతన ఆనవాళ్లు బయల్పడినాయి. శాతవాహన వంశ మూలపురుషుడైన ఛి(సి)ముక శాతవాహనుడు సా.శ.పూ. 1వ వతాబ్దిలో సామంత స్థాయి నుంచి, రాజుగా ఎదిగి, సొంత రాజ్యానికి హద్దుల్ని, …

తెలుగువారి తొలి రాజధాని కోటలింగాల Read More »