స్త్రీ విముక్తిని కోరే జ్వలిత ‘సంగడిముంత’
‘‘అనాదిగా వెలి వేయబడ్డ నేను/ అక్షరాలను వెలిగించి అంధకారానందాన్ని తగలబెడుతున్నాను/ నా వెంట ఆత్మవిశ్వాసపు అన్నలు/ ఆత్మాభిమానపు అక్కలు/ పూలు మొగ్గులు నా సైన్యం’’ ఈ కవిత చదివితే జ్వలిత అంటే ఎవరో ఏమిటో తెలిసిపోతుంది. జ్వలిత గత రెండు దశాబ్దాలుగా తెలుగు సాహిత్య రంగంలో కవయిత్రిగా రచయిత్రిగా రాణిస్తున్నారు. ఈమె 2007 నుంచి ‘‘కాలాన్ని జయిస్తూ నేను’’ అనే మొదటి కవితా సంపుటితో మొదలు పెట్టి ‘‘సుదీర్ఘ హత్య’’, ‘‘అగ్ని లిపి’’ ‘‘సంగడి ముంత’’ అనే …









