deccanland

కొరమీను కేంద్రం కరీంనగర్‍

ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతికి చెక్‍ పెట్టనున్న రాష్ట్ర మత్స్యశాఖఉమ్మడి కరీంనగర్‍ జిల్లాలో రూ.6 కోట్ల వ్యయంతో చేపలు పెంపకం చేప ప్రియులు లొట్టలేసుకొని తినే కొరమీనుకు కరీంనగర్‍ కేంద్రం కాబోతోంది. కొరమీను చేపలతో రాష్ట్రం కళ కళ లాడేలా మత్స్యశాఖ ప్రణాళికలు రచిస్తోంది. ఇతర రాష్ట్రాలను నుంచి దిగుమతి చేసుకునే బదులు మన దగ్గరే వాటిని ఎక్కువగా పెంచేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం నాలుగు జిల్లాలను ఎంపిక చేసింది. కరీంనగర్‍ కేంద్రంగా జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల …

కొరమీను కేంద్రం కరీంనగర్‍ Read More »

నులుక సందయ్యల(మాదిగ గురువుల వారు)జాంబపురాణం-వర్ణ, కుల ఉపకులాల పరిశీలన

అష్టాదశ పురాణాలకు ఏమాత్రం తగ్గకుండ వెలసిన కులపురాణాలలో జాంబపురాణం ఒకటి. దీనికి ‘ఆది జాంబవ మహాపురాణం’ అని మాదిగ జాతి మూల పురుషుడి కథ అని, అదే విధంగా సృష్టికి ఆది పురుషుని కథ అని పరిశోధకులు చెబుతున్నారు.కాలక్రమేణ జాంబవంతుని సంతతిని నేడు మాదిగలుగ పిలువబడుతున్నారు. అన్ని కులాలకు ఉపకులాలు ఉన్నట్లే, మాదిగసామాజిక వర్గానికి (కులానికి) చిందు, దక్కలి, బైండ్ల, మాష్టి, కిన్నెరలతో పాటు నులుక సందయ్యలు (చందయ్యలు) అను వారు మాదిగల ఆశ్రిత కులంగా ఉంటున్నారు.నులుక …

నులుక సందయ్యల(మాదిగ గురువుల వారు)జాంబపురాణం-వర్ణ, కుల ఉపకులాల పరిశీలన Read More »

పూటకూళ్ళవ్వ

(జరిగిన కథ: పూటకూళ్ళవ్వ విడిదిలో బస చేసిన అభిరామ్‍ ఫ్రెండ్స్లో ఒకరైన కార్తీక్‍ తను లావుగా ఉంటానని బాధ పడుతుండటంతో అవ్వ అతనికి ఒక మందు గురించి చెప్పి దాని అడ్రస్‍ చెబుతుంది.) (గత సంచిక తరువాయి)ఉదయం లేచే సరికి సైకిల్‍ పంక్చర్‍ అయింది. అంత పొద్దున్నే దాన్ని రిపేర్‍ చేసేవారు ఎవరూ కనబడలేదు.‘‘ఇప్పుడెలా..? అడిగాడు అవ్వను.‘‘చాలామంది అటువైపు నడిచి కూడా వెళ్తుంటారట మరి నీకు ఇష్టమైతే అలా వెళ్లొచ్చు’’ అంది అవ్వ.కాసేపు ఆలోచనలో పడినా.. ‘‘మళ్లీ …

పూటకూళ్ళవ్వ Read More »

ప్రపంచ వారసత్వ దినోత్సవ ప్రేరణతోవారసత్వ సంపదను కాపాడుకుందాం

ఏప్రిల్‍ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచ వారసత్వ హోదా కలిగిన ప్రపంచవ్యాప్తంగా వున్న వివిధ ప్రదేశాలను రక్షించడంలో ఎదురవుతున్న సమస్యలను చర్చించి, ఆ అవగాహనతో వాటిని రక్షించే చర్యలను ఆచరణాత్మకం చేయడం ఈ ప్రపంచ వారసత్వ దినోత్సవ లక్ష్యం. ఇది ప్రపంచంలోని వివిధ సమాజాల సమిష్టి కృషికి, సాంస్కృతిక వారసత్వ అవగాహనకు తోడ్పడుతుంది.సహజ లేదా మానవ నిర్మిత ప్రాంతం లేదా అంతర్జాతీయ ప్రాముఖ్య కలిగిన నిర్మాణాలు, ప్రత్యేక రక్షణ అవసరమయ్యే స్థలం ప్రపంచ వారసత్వ …

ప్రపంచ వారసత్వ దినోత్సవ ప్రేరణతోవారసత్వ సంపదను కాపాడుకుందాం Read More »

నెల్లూరి కేశవస్వామి

నెల్లూరి కేశవస్వామి స్వాతంత్య్రానంతర తెలంగాణ కథకుల్లో ఒకరు. అయితే అందరూ తెలంగాణ కథకుల్లాగే వందల కథలు రాసినా ఎన్నో దొరక్కుండా పోయాయి. అదృష్టమేమిటంటే ఆయన 1969లో, 1981లో కొన్ని కథలనైనా కథా సంపుటాలుగా వెలువరించడం వల్ల తెలుగు సాహిత్యానికి కొన్ని మాత్రం దక్కాయి. చాలామంది రచయితలు రాసినా స్వంత పత్రికలు లేకపోవడంతో రాసింది అచ్చుకావడం తక్కువ. అచ్చయినవి పుస్తకాల రూపంలో తేవడం తక్కువ. అలా వందలాది కథలు సాహిత్య చరిత్రలో యువతరాలకు అందకుండా పోయాయి.1902 నుంచి ప్రారంభమైన …

నెల్లూరి కేశవస్వామి Read More »

వజ్రాలలో నాణ్యతలు-దోషాలు

వజ్రాల నాణ్యత నిర్ణయించటానికి ఉపయోగపడే 4సి (Colour Clarity Cut Caratage) లలో రెండవ లక్షణం క్లారిటీ. వజ్రాలు ఏరకమైన చేరిక మలినాలు దోషాలు లేకుండా ఉంటే అంత ఎక్కువ విలువ కలిగి ఉంటాయి. వజ్రం యొక్క స్వచ్ఛత దాని ఆకర్షణ విలువను ప్రభావితం చేస్తుంది. ‘‘స్పష్టత’’ (clarity grade) అనేది వజ్రంలోని లోపాల సంఖ్య, పరిమాణం మరియు రకాన్ని సూచిస్తుంది. అంతర్గతంగా ఉండే లోపాలను ‘‘చేరిక’’ (inclusion) అని, బాహ్యంగా ఉండే లోపాలను ‘‘మచ్చలు/దోషాలు’’ (blemishes) …

వజ్రాలలో నాణ్యతలు-దోషాలు Read More »

పుస్తకాలు పిల్లల ఊహలను ప్రేరేపిస్తాయిఏప్రిల్‍ 23న ప్రపంచ పుస్తక దినోత్సవం

ప్రపంచ పుస్తక దినోత్సవం, ప్రపంచ పుస్తక కాపీరైట్‍ దినోత్సవం అని కూడా పిలుస్తారు. ఇది ప్రతి సంవత్సరం ఏప్రిల్‍ 23న జరుపుకునే ఐక్యరాజ్యసమితి సెలవుదినం. ఈ రోజు పిల్లలు, యువకులు, పెద్దల్లో పుస్తకాలు, వివిధ రకాల సాహిత్యం చదివేందుకు, ప్రోత్సహించడానికి లక్ష్యంగా పెట్టుకుంటారు. వారిలో పుస్తకాలపై ప్రేమను పెంపొందించడానికి, వారి భవిష్యత్తు, అభివృద్ధికి దోహదపడటానికి వారిని ప్రోత్సహించాలి. ప్రపంచ పుస్తక దినోత్సవం రోజు మన కోసం పుస్తకాలను రూపొందించడానికి తెరవెనుక పనిచేసే వారందరికీ, రచయితలు, ప్రచురణకర్తలు, కాపీ …

పుస్తకాలు పిల్లల ఊహలను ప్రేరేపిస్తాయిఏప్రిల్‍ 23న ప్రపంచ పుస్తక దినోత్సవం Read More »

హిమాలయాలలో హిమాలయం…

హిమాలయ పర్వతాలలో సాధువులు, సన్యాసులు ఏం చేస్తుంటారు? సమాజంతో సంబంధం లేకుండా ఏకాంతంగా పర్వతాల మధ్య అరణ్యాల లోనో, గుహల్లోనో, లోయల్లోనో, శిఖరాలపైననో ఎక్కడో ఏకాంతంగా జీవిస్తూ, తపస్సు చేస్తూ వారు సాధించేదేమిటీ? వారికీ సమాజానికీ మధ్య సంబంధం ఏమన్నా వుందా? ఈ సమాజాభివృద్ధి కృషిలో వారి పాత్ర ఏమిటీ? వారివల్ల సమాజానికి జరిగే మేలు ఎటువంటిది? ఇలాంటి అనేక సందేహాలు మనలాంటి వారికి కలగడం సహజమే. సాధారణంగా సాధవులకూ, సమాజానికీ మధ్య సంబంధం ఏమీ లేదనే …

హిమాలయాలలో హిమాలయం… Read More »

నవభారత దార్శనికుడుఏప్రిల్‍ 14న డాక్టర్‍ బాబా సాహెబ్‍ అంబేద్కర్‍ జయంతి

భారతదేశ ప్రజల్లో సమానత్వం కోసం అహర్నిశలు తపించిన కృషీవలుడు డాక్టర్‍ బాబా సాహెబ్‍ అంబేద్కర్‍.‘బాబాసాహెబ్‍’గా ప్రసిద్ధి పొందిన భారతరత్న డాక్టర్‍ బీఆర్‍ అంబేడ్కర్‍ (BR Ambedhkar).. దేశంలోని అణగారిన వర్గాల ఆర్థిక, సామాజిక సాధికారికతకోసం తన జీవితం చివరి వరకూ పోరాటం చేశారు. రాజ్యాంగ పరిషత్తు సభ్యునిగా అంబేడ్కర్‍ విశేష శ్రమకోర్చి రాజ్యాంగ (Constitution) రచన చేయడం ఆయన జీవితంలో ప్రముఖ ఘట్టం. ధర్మశాస్త్ర పండితుడు, భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నేత, స్వంతంత్ర భారత తొలి …

నవభారత దార్శనికుడుఏప్రిల్‍ 14న డాక్టర్‍ బాబా సాహెబ్‍ అంబేద్కర్‍ జయంతి Read More »

తెలంగాణాలో క్రీ.పూ.4000 ఏళ్లనాటితొట్టతొలి చుట్టిల్లు

పాతరాతియుగంలో సహజసిద్ధమైన గుహలు, కొండ చరియల కింద నివసించిన ఆదిమ మానవుడు, ఆహార సంపాదనలో భాగంగా, మైదానాల్లో కొచ్చాడు. జంతువుల నుంచి రక్షణ కోసం, కొద్దిపాటి గుహల్లాంటి గుంట ఆవాసాల్లో నివసించాడు. ఆ తరువాత నీటి వనరుకు దగ్గరగా, ఆరుబయలు ప్రదేశాల్లో ఎండ, వానల నుంచి తప్పించుకొనేందుకు పూరిళ్లును నిర్మించుకొన్నాడు. ముతకరకం రాతి పనిముట్ల స్థానంలో, నునుపు దేలేట్లు కొనల్ని అరగదీసి, పదునైన, నాణ్యమైన రాతి పనిముట్లను తయారించు కొన్నాడు. పశువులను మచ్చిక జేసుకొన్నాడు. పంటల్ని పండించుకొన్నాడు. …

తెలంగాణాలో క్రీ.పూ.4000 ఏళ్లనాటితొట్టతొలి చుట్టిల్లు Read More »