ఈ గ్రానైట్ రాళ్ళలో…
తెలంగాణ ప్రాంతంలో గ్రానైట్ అనే పేరు విననివారు ఉండరు. మన దైనందినజీవితంలో అడుగడుగునా గ్రానైట్లు కనిపిస్తాయి. రోడ్డువేసే కంకర, పక్కన ఉన్న మైలురాయి, అనేక రకాల స్తంభాలు, గోడలకు వాడిన రాళ్ళు, దేవాలయంలో మంటపాలు, శిల్పాలు ఇంట్లో ఫ్లోరింగ్, వంటింటి స్లాబ్ ఇలా ఒకటేమిటి ఎటుచూసినా మనచుట్టూ గ్రానైట్ కనిపిస్తుంది. ఇంతకీ అసలీ గ్రానైట్‍లో ఏముంది, మనదగ్గరే ఎక్కువ ఎందుకు ఉంది. దీని వివరాలు పరిశీలిద్దాం..‘‘గ్రానైట్’’ అనే పదానికి ప్రాచీనభాషలలో మూలాలు ఉన్నాయి. వ్యుత్పత్తి: ఫ్రెంచ్ ‘‘గ్రానైట్’’ …









