పర్యావరణాన్ని పరిరక్షించే గిరిజనుల కల్పవృక్షం!
పేదవాడి కలప, ఆకుపచ్చ బంగారంగా పేరొందిన వెదురు- అడవులకు స్థిరీకరణ శక్తిగా పనిచేస్తుంది. అడవుల్లో వర్షాల ధాటికి మట్టి కొట్టుకొని పోకుండా నిలువరిస్తుంది. అడవులపై ఆధారపడిన గిరిజనులతోపాటు, గ్రామీణుల జీవితాలతోనూ వెదురు పెనవేసుకుపోయింది. జీవనోపాధి మార్గంగానే కాకుండా, సామాజిక, సాంస్కృతిక, మతపరమైన కార్యకలాపాల్లోనూ ఒక భాగంలా మారింది. వెదురుకు ఉన్న బహుళ ప్రయోజనకర లక్షణాల కారణంగా గిరిజనులు తదితరులకు ఆదాయ, ఉపాధి కల్పనలో తోడ్పడుతోంది. గిరిజనుల వేట, ఆహార సేకరణ, వ్యవసాయ పనిముట్లు, సంగీత వాయిద్యాలు, గృహోపకరణాలు …









