అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ
దేవుళ్లను పూలతో పూజించడం మనకు తెలుసు. పూలనే దేవుళ్లుగా కొలిచి పూజించే సంస్కృతి బహుషా ప్రపంచంలో ఎక్కడా ఉండకపోవచ్చు. అలాంటి పండుగ తెలంగాణలో ఉండటం గర్వకారణం. మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలు షురూ కానున్నాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో పాటకు ఎంత ప్రాధాన్యత ఉండేదో.. బతుకమ్మ కూడా అంతే. మిలియన్ మార్చ్ నుంచి వంటావార్పు వరకు ఇలా చరిత్రలో ఎన్నో తెలంగాణ ఉద్యమాలకు బతుకమ్మ కేరాఫ్‍గా నిలిచింది. తెలంగాణ అస్తిత్వ పోరాట చిహ్నంగా …









