deccanland

పోషకాల ఖజానా – మఖానా

ప్రస్తుతం సూపర్‍ ఫుడ్‍గా పేరొందిన వాటిలో మఖానా ఒకటి. ఆరోగ్య ప్రయోజనాలతోపాటు పోషకాల ద•ష్ట్యా కూడా ఈ మఖానా ఆకర్షణీయమైనదిగా మారింది. సాంప్రదాయికంగా దీనిని మఖానా, లోటస్‍ సీడ్స్, నానా లేదా పంకాజ్‍ సీడ్స్గా కూడా పిలుస్తారు. ప్రస్తుత కాలంలో మఖానా తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మఖానాలో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు మరియు అనేక పోషకాలు లభిస్తాయి. వీటిలో ప్రత్యేకంగా ఉండే లక్షణాలు, ఆర్థిక, శారీరక, మానసిక ఆరోగ్యానికి కలిగించే ప్రయోజనాలు …

పోషకాల ఖజానా – మఖానా Read More »

మత్స్య సంపదలో భారతదేశం స్థానం?

ప్రపంచవ్యాప్తంగా, 250 మిలియన్లకు పైగా ప్రజలు మత్స్య, ఆక్వాకల్చర్‍పై ఆధారపడి ఉన్నారు. భారతదేశంలో ఫిషింగ్‍ పరిశ్రమ సుమారు 28 మిలియన్ల మత్స్యకారులకు, లక్షలాది మంది మత్స్యకారులకు ఉపాధిని కల్పిస్తుంది. భారతదేశ ఆహార భద్రతకు దోహదపడటంలో కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శతాబ్దాలుగా, భారతదేశంతో సహా ప్రపంచంలోని కొన్ని దేశాలు మత్స్య, ఆక్వాకల్చర్‍లో ముందున్నాయి. ఫిషింగ్‍, ఆక్వాకల్చర్‍ యొక్క స్థిరమైన పద్ధతులు వనరులను రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి, భవిష్యత్‍ తరాలకు చేపల నిల్వలను అందుబాటులో ఉంచుతాయి. …

మత్స్య సంపదలో భారతదేశం స్థానం? Read More »

ప్రపంచ నదుల దినోత్సవం సందర్భంగామంజీరా నది తీరంలో ‘‘నదితో నడక’’

ప్రపంచ నదుల దినోత్సవం సందర్భంగా మంజీరా నది తీరంలోని ఏడుపాయల వద్ద ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ ఆధ్వర్యంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం, దక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్, ప్రభుత్వ సిటీ కాలేజీ సంయుక్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాయి. ప్రపంచ నదుల దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్‍ నెలలో నాలుగో ఆదివారం జరుపు కుంటారు. ఈ కార్యక్రమం 2025 సెప్టెంబర్‍ 28న ఉదయం 9.30 గంటలకు జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో నదుల ప్రాముఖ్యతను గుర్తుచేసే …

ప్రపంచ నదుల దినోత్సవం సందర్భంగామంజీరా నది తీరంలో ‘‘నదితో నడక’’ Read More »

పూటకూళ్ళవ్వ

(గత సంచిక తరువాయి)(జరిగిన కథ: అవ్వ దగ్గరికి వచ్చిన పిల్లలంతా తమను ఇచ్చిన డబ్బులకంటే సరుకులు తక్కువ తెచ్చారని, అమ్మానాన్నలు కొట్టారని అవ్వతో చెప్పుకొని బాధపడతారు. అసలు విషయం ఏమిటో తేల్చుకోవటానికి పిల్లలందరినీ తీసుకొని దుకాణం వద్దకు వెళుతుంది అవ్వ.)దుకాణం ముందర నిలబడిన పోలీసుతో… ‘‘సారూ… మాకు ఈ దుకాణం గురించి బాగా తెలుసు. ఏదో పొరపాటు జరిగినట్టుంది. ఆ సంగతంతా మేము చూసుకుంటాం బాబూ… దయచేసి మీరు వెళ్లిపోండి’’ అంటూ పోలీసుకు నచ్చ జెప్పి పంపిచేస్తుంది …

పూటకూళ్ళవ్వ Read More »

పర్యావరణ సంక్షోభం – పరిష్కారాలు

ప్రకృతి ఎప్పుడూ ఒకే స్థితిలో ఉండదు. ఆరు ఋతువులూ ప్రభావితం చేస్తాయి. ఆకురాలడం నుంచి చివురు చిగురించి పరిఢవిల్లుతుంది. ఆరు ఋతువుల చకభ్రమణంలోని విభిన్న వాతావరణాల్లోంచి వివిధ ప్రయోజనాలూ, మనుగడకు అవసరమైన స్థితులూ ప్రజలకు అందుతాయి. విలక్షణతలతో విలసిల్లడం ప్రకృతి సహజలక్షణం. ప్రకృతిలోని ఈ విలక్షతలకు భంగం కలిగించడం వల్లనే పర్యావరణ సంక్షోభం సంభవిస్తుంది. ప్రజల నిత్య జీవితాలకు భద్రత లేకుండా పోతుంది. ప్రకృతి విలక్షణతలకు భంగం కలిగించే అంశాలు బహుముఖీనమైనవి. ప్రకృతి విచ్ఛిన్నతకు మానవ తప్పిదాలే …

పర్యావరణ సంక్షోభం – పరిష్కారాలు Read More »

దాశరథి కమల కన్నుమూత

సుప్రసిద్ధ రచయిత డాక్టర్‍ దాశరథి రంగాచార్య సతీమణి దాశరథి కమల (92) మంగళవారం (23.09.2025) కన్నుమూశారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల అశ్రునయనాల నడుమ మారేడుపల్లిలోని హిందూ శ్మశాన వాటికలో ఆమె భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. దాశరథి దంపతులకు కుమారుడు విరించి, ఇద్దరు కుమార్తెలు సుధ, ఉదయశ్రీ ఉన్నారు. దాశరథి రంగాచార్య సాహితీ ప్రస్థానంలో కమల కీలక పాత్ర పోషించారు. ఆయన రచనలకు కమల వెన్నెముకగా నిలిచారని సాహిత్య లోకం గుర్తుచేసుకుంటోంది. దాశరథి కమల ఆత్మకు శాంతి చేకూరాలని …

దాశరథి కమల కన్నుమూత Read More »

దాశరథి రంగాచార్య మోదుగుపూలు నవలలో ప్రజా జీవితం పోరాటం

నవలా సాహిత్యంలో దాశరధి రంగాచార్యులు సుప్రసిద్ధులు. ఈయన రచించిన నవలల్లో తెలంగాణ జీవన విధానం, గ్రామీణ జీవన చిత్రణ, రజాకర్ల దుశ్చర్య, హైదరాబాద్‍ రాష్ట్ర పరిస్థితులు, జమిందారి వ్యవస్థ, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కరణాలు పట్వారిల పెద్దరికం, అనాటి ప్రభుత్వ అధికారుల వద్ద ప్రజల వెట్టిచాకిరి, భూ సమస్య పోరాటం, ప్రజల్లో చైతన్యం మొదలగు అంశాలు వివరించబడ్డాయి. రంగాచార్య చిల్లర దేవుళ్ళు, మోదుగు పూలు, జనపదం, మాయా జలతారు, రానున్నది ఏది నిజం, పావని, మానవత, శరతల్పం, …

దాశరథి రంగాచార్య మోదుగుపూలు నవలలో ప్రజా జీవితం పోరాటం Read More »

తృణకాంత మణి అంబర్‍

అంబర్‍ ఎంతో విశిష్టతకలిగిన రత్నం. ఇది చెట్టుజిగురు కాలక్రమంలో గట్టిపడి, శిలాజీకరణం చెందటంవల్ల ఏర్పడుతుంది. అందువల్ల ఇది ఖనిజం కాదు. Mineraloid మాత్రమే. రత్నంగా, శిలాజంగా, ఆయుర్వేద ఔషధంగా దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. భూవిజ్ఞానశాస్త్రపరమైన పరిశోధనలకు అనువైన గతాన్ని తనలో భద్రపరచుకున్న విలువైన సాధనం. దీని భౌతిక లక్షణాలను పరిశీలిస్తే మృదువైన, పెళుసుగా ఉండే గాజువంటి పారదర్శక పదార్థం. తేనెవన్నె పసుపురంగులో ఉంటుంది. తక్కువ కాఠిన్యం (2.5-3) కలిగిన రత్నం అవటంతో ఆభరణాలలో పొదగటానికి సులువుగా …

తృణకాంత మణి అంబర్‍ Read More »

భాగ్యదాయిని బతుకమ్మ

బతుకమ్మ పండుగ తెలంగాణ మహిళల గౌరవం, ఐక్యత, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా తొమ్మిది రోజులు పూలతో ఘనంగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటిని పూలతో నింపి.. మహిళ గుండెల్లో గర్వాన్ని, ఆనందాన్ని కలిగించే పండుగ బతుకమ్మ. భాద్రపద మాసంలో మొదలై తొమ్మిది రోజుల పాటు సాగే ఈ వేడుక తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. రంగురంగుల పూలను పేర్చి అందంగా అలంకరించిన బతుకమ్మల చుట్టూ స్త్రీలు వలయంగా తిరుగుతూ చప్పట్లు కొడుతూ …

భాగ్యదాయిని బతుకమ్మ Read More »

‘‘స్వంత కథ’’

(గత సంచిక తరువాయి)ఒక హైద్రాబాదీగా, భూమి పుత్రుడిగా హైద్రాబాద్‍ చరిత్రపై రచనలు చేయాలని నిర్ణయించుకున్నాను. ఫలితంగా 2006లో ‘‘షహర్‍నామా’’ (హైద్రాబాద్‍ వీధులు – గాథలు) పుస్తకం వచ్చింది. నగర వీధుల పేర్ల వెనుక చరిత్ర, బస్తీలు, అప్పటి మనుషుల గురించి ‘‘కథలు, కథలుగా’’ కథలల్లినాను. ఇది రెండు ముద్రణలకు నోచుకుంది. పుస్తకం కంటె ముందు వారం వారం సీరియల్‍గా 25 వారాల పాటు నమస్తే తెలంగాణా దినపత్రిక ఆదివారం సంచికలో ప్రచురించబడి పాఠకుల మన్ననలను పొందింది.ఆ తర్వాత …

‘‘స్వంత కథ’’ Read More »