బాధిత జంతువులు – మానవ బాధ్యతలు – పర్యావరణం
చరిత్రలో ప్రధాన బాధితులు జంతువులే అంటాడు చరిత్రకారుడు యూవల్ నోవా హరారి. పెంపుడు జంతువులను కూడా సమధికంగానే చరిత్రలో అధికంగా మానవులు బాధించారనీ ఆయన పేర్కొన్నాడు. ఈ అభిప్రాయాలు వినడానికి హాస్యాస్పదంగా అనిపిస్తాయి కానీ, ఇది తిరస్కరించలేని వాస్తవం. 1975లో పీటర్ సింగర్ ‘యానిమల్ లిబరేషన్’ అనే గ్రంధం ప్రచురించాడు. ఈ గ్రంధం కొంతయినా మనుషుల ఆలోచనల మీద ప్రభావం చూపింది. అసలు జంతువులు విముక్తి గురించి కొంతయినా ఆలోచించటానికి, కొద్దిగానైనా చర్చించటానికి ఈ పుస్తకం అవకాశమిచ్చింది.యానిమల్ …









