అనుముల కృష్ణమూర్తి
‘‘ఎవని మనసు శిశు స్వచ్ఛమెవని బుద్ధిజాతి చైతన్య సంపన్నమెవని యాత్మసర్వతో ముఖ కల్యాణ సవనకుండమట్టివాని గుండెల నుండి బుట్టు కవిత’’అని కవికి కవితోత్రికి భాష్యం చెప్పిన అనుముల క•ష్ణమూర్తి గారు కొద్దిక•తులు మాత్రమే వెలువరించినా కవులలో మహాకవి, పండితులలో మహా పండితులు.ఆంధ్రనగరికి (ఓరుగల్లుకు) అనుబంధంగా మణిగిరి (మడికొండ) అనే గ్రామమున్నది. అది తెలుగుదేశంలోనే ప్రఖ్యాతిగాంచిన గ్రామం. ఎందుకంటే ఆ గ్రామం నిండా పండితులు, కవులే. కాళోజీ సోదరులు, వానమామలై సోదరులు, పల్లా దుర్గయ్య గారు, బిరుదురాజు రామరాజు, …









