చరిగొండ చరిత్ర
చరికొండ గ్రామము పాత మహబూబ్ నగరం జిల్లా, కల్వకుర్తి తాలుకా, ఆమనగల్ మండలంలో వుండేది. ఇప్పుడది రంగారెడ్డి జిల్లా, కడ్తాల మండలానికి మార్చబడ్డది. గ్రామానికి ఉత్తరంగా మేడిపల్లి నక్కేర్త, తూర్పున కొలుకులపల్లి, దక్షిణాన నాగిళ్ళ, పడమర ముదివెన్ను గ్రామాలున్నాయి. చరికొండలో అడివి దాదాపు 5వేలఎకరాలలో విస్తరించి వుండేది. అడవిలో నీటివూటల కాలువలు, వూరి దగ్గర పారే కల్లెడ వాగు, గౌరమ్మ చెరువు చరికొండ నీటివనరులు. ఊరావల గుట్టల్లో నాగప్పచెరువు, పెరుమాండ్ల కుంట, కొత్తచెరువులు అదనపు నీటిసంపదలు. ఊరికి…









