పిల్లలే నయం
‘‘గొప్ప ఉపన్యాసం చేయలేని పని ఓ చిన్న కథ చేస్తుంది.’’నేను ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీలో ఓ సంవత్సరం క్రితం ఓ సంఘటన జరిగింది. ఓ ముగ్గురు పిల్లలు ఆడుకుంటూ కొట్టుకున్నారు. ఆది చిలికి చిలికి గాలివానగా మారింది. ఆ తరువాత పెద్దవాళ్ల జోక్యం మొదలైంది. కమ్యూనిటీలో ఓ వాట్సప్ గ్రూప్ ఉంది. అందులో నేను కూడా ఓ సభ్యుడినే. ఆ గ్రూపు నిండా ఆ గొడవకి సంబందించిన చర్చలే చర్చలు. చివరికి తిట్టుకునే స్థాయికి చేరుకుంది. ఇరు …









