పర్యావరణం
కౌశాంబీ రాజ్యాన్ని కీర్తి సేనుడు పరిపాలిస్తున్న కాలంలో ఉన్నట్టుండి ఆ రాజ్యంలో వర్షాలు లేక కరువుకాటకాలు ప్రారంభమైనాయి. ప్రజలంతా ఆకలితో ఆహాకారాలు చేశారు. మంత్రి తమ మిత్ర రాజ్యాల నుండి ఎన్ని సార్లు సరకులను దిగుమతి చేసినప్పటికినీ ప్రజల అవసరాలకు అవి సరిపోలేదు. దానికి తోడు ఎప్పుడూ అన్ని పోటీల్లో విజయఢంకా మోగించే కౌశాంబీ రాజ్యం తమకన్నా చిన్న రాజ్యాల కంటే కూడా చాలా వెనుకబడిపోయింది. కానీ మహారాజు ఇవేవీ పట్టించుకోకుండా తన విలాసాలలో మునిగితేలాడు. అప్పుడు …









