మన వారసత్వ సంపదను మనమే కాపాడుకుందాం!
భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంతో, సువిశాలంగా, సుసంపన్నంగా విలసిల్లే దేశం. చరిత్ర ప్రారంభకాలం నుంచి భారతదేశాన్ని ‘‘ల్యాండ్ ఆఫ్ మిల్క్ అండ్ హనీ’’ గా పేర్కొన్నారు. వేదకాలం నుంచి ఎన్నో దండయాత్రలు, మరెన్నో ప్రక•తి వైపరీత్యాలను చవిచూసినా ఎదురొడ్డి నిలచిన ఘనత మన దేశానిది. గ్రీకు, రోమన్, మెసపటోమియన్ నాగరికతలు ఎంతో వైభవాన్ని చూపినా కాలగర్భంలో కలిసిపోయాయి. అసలు నాగరికతే తెలియదు అనుకున్న భారతదేశం మాత్రం 5000 సం।।లకు పైగా ఒకే సంస్కృతికి కట్టుబడి ఉంది. సనాతన ధర్మాన్ని …








