దక్కన్ తాజ్ మహల్!
తాజ్ మహల్‍లాగానే అనిపిస్తుంది. ఇది ఆగ్రా కాదు. చూస్తున్నది తాజ్ మహలూ కాదు. తాజ్‍మహల్ లాంటిదే కట్టాలన్న ఓ ప్రయత్నం. పేరు బీబీ కా మఖ్బారా. ఔరంగా బాద్‍లో ఉంది. అందుకే దక్కన్ తాజ్‍గా వాడుకలోకి వచ్చింది. బీబీ కా మఖ్బారాలో తాజ్ మహల్‍లో ఉండే తేజం కనిపించదు, కానీ నిర్మాణ నైపుణ్యంలో తాజ్‍మహల్‍కు ఏ మాత్రం తీసిపోదు. ఔరంగజేబు భార్య దిల్‍రాస్ బానుబేగమ్ సమాధి నిర్మాణం ఇది. బాను బేగమ్ కొడుకు అజమ్ షా దగ్గరుండి …









