హైదరాబాద్ -ఇంటర్నేషనల్ మహిళలు
ఇవ్వాళ హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీగా రూపాంతరం చెందింది. అంతర్జాతీయ స్థాయి సంస్థలకు ఆలవాలమై దేశ విదేశీ ఉద్యోగులను, సంస్థలను ఆకర్శిస్తోంది. హైటెక్ సిటీ దాటి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్న ప్రాంతంలోకి వెళ్ళినట్లయితే అక్కడి మనుషులు, భవనాలు రెండూ హైదరాబాద్‍లో అమెరికా నగరాలను తలపిస్తాయి. ఇదంతా దశాబ్ద కాలంగా చోటు చేసుకున్న పరిణామాలు. నిజానికి హైదరాబాద్ శతాబ్దాల నుంచి అంతర్జాతీయ నగరమే అన్నది చరిత్ర తెలిసిన అందరూ ఆమోదించే విషయం. కుతుబ్‍షాహీల కాలంలో మనుచ్చి, అబెదుబెయ్, టావెర్నియర్ తదితర …









