కేసులు నిలవాలని పెట్టరు
‘గాంధీ మాలా బేత్లా’ అన్న కవితను వసంత్ దబాత్రేను గుర్జార్ అన్న మరాఠీ కవి రాశాడు. ‘గాంధీ నన్ను కలిశాడు’ అన్నది కవితా శీర్షిక తెలుగులో. అది ఓ వేయి పదాల కవిత. ఆ కవితని 1983లో గుర్జార్ రాశాడు. ఆయన వయస్సు ఇప్పుడు 72 సంవత్సరాలు. ఆ కవితలో అశ్లీలం వుందని 1994లో ఓ క్రిమినల్ కేసు దాఖలైంది. మహాత్మాగాంధీ తనని దేవాలయంలో, చర్చీలలో, మసీదులో అదే విధంగా ఓషో ఆశ్రమంలో, క్లెమ్లిన్‍లో, ముంచాయి రెడ్ …









