Author name: deccanland

తీర్పుల్లో మొదటి ఉర్దూ కవిత


మొఘలుల కాలంలో కోర్టు భాష పర్షియన్‍. ఆ తరువాత ఉర్దూ కోర్టు భాషగా మారింది. ఆ తరువాత ఇంగ్లీషు ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఉర్దూ భాషలో ఎక్కువగా పర్షియన్‍ పదాలు వుంటాయి. కోర్టులో కూడా ఎక్కువ ఉర్దూ పదాలు కన్పిస్తాయి. స్వాతంత్య్రం వచ్చి కోర్టు భాష ఇంగ్లీషుగా మారిపోయిన తరుణంలో కూడా ఉర్దూ పదాలు …

తీర్పుల్లో మొదటి ఉర్దూ కవిత Read More »

బీగల్‍ యాత్ర (Voyage) లక్ష్యాలు!

ప్రకృతే నియంత్రిస్తుంది! 12 ప్రకృతే శాసిస్తుంది!!



(గత సంచిక తరువాయి)

ఏదైనా ఓ లక్ష్యం నెరవేరాలంటే సరియైన ప్రణాళిక వుండాలి. లేకుంటే సత్ఫలితాలు రావు. పారిశ్రామిక విప్లవంతో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో యూరప్‍ దేశాలన్నీ ప్రపంచం వైపు దృష్టిసారించాయి. ఆయా దేశాల, ప్రాంతాల, భౌగోళిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులపై సర్వేలను చేపట్టాయి. దీంతో …

బీగల్‍ యాత్ర (Voyage) లక్ష్యాలు! Read More »

సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం

సిరి ధాన్యాలు (Millets) ఎందుకు తినాలి?
ఇవి మన జీవితంలో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఎలా నింపుతాయి?
(గత సంచిక తరువాయి)


మధుమేహం టైపు 2 రావడానికి కారణాలు :
మైదా, రిఫైన్డ్ చక్కెర పదార్థాల వాడకం, పీచు పదార్థం లేని ఆహార దినుసులను ముఖ్య ఆహారంగా సేవించడం, అధికంగా తెల్ల చక్కెర పదార్థాలు వేసిన డ్రింకులూ, …

సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం Read More »

తేనెగుడ్లు


కాంచీపురంలో ‘భుజంగం’ అనే తెలివైన దొంగ ఉండేవాడు. అతను తెలివిని ఉపయోగించి యుక్తిగా దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు భుజంగం దొంగతనానికి బయలు దేరాడు. ఆ ఊరిలోని షావుకారు ఇంటి వెనుకకు వెళ్ళి మెల్లిగా గోడ దూకాడు. ఒక్కసారిగా మంచి మిఠాయిల వాసన వచ్చింది. సహజంగా భోజన ప్రియుడైన భుజంగానికి, నగలూ, డబ్బూ బదులు మిఠాయిలు …

తేనెగుడ్లు Read More »

‘ఆరోగ్యదాయ నగరం’ భావన పట్టణ ప్రణాళికారచనలో కీలకం..



ఎప్పటికప్పుడు మానవాళిని విపత్తులు చట్టుముడుతూనే వుంటాయి. వాటిని ఎదుర్కోవడానికి మార్గాలు అన్వేషించడమూ, నివారించుకోవడమూ అంతే సహజం. ఇప్పుడు కరోనా అనే మహమ్మారినే కాక తద్వారా ఏర్పడిన అనేక ఒత్తిళ్లను తట్టుకొని నిలబడాల్సి వస్తుంది. వీటిని అధిగమించడానికి దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరం. ఈ విపత్తులకూ, అమలు చేస్తున్న, చేయబోతున్న ప్రణాళికలకు విడదీయరాని సంబంధం ఉంటుంది. ముఖ్యంగా నగరాలు, …

‘ఆరోగ్యదాయ నగరం’ భావన పట్టణ ప్రణాళికారచనలో కీలకం.. Read More »

చిందుల ఎల్లమ్మ

శ్రమ నుంచి పుట్టిన ఏ కళారూపమైనా మట్టి పరిమళాలు వెదజల్లుతుంది. అణచివేతకు గురైన సామాజిక వర్గాల జీవితాల నుంచి జనించే కళారూపాలేవైనా శ్రమను మరిపించేలా చేస్తాయి. ఇలాంటి కళారూపాలు ఎన్ని ఒడిదుడుకుల సునామీలొచ్చినా తట్టుకుని నిలబడతాయి. పునాదిలో మార్పు రానంతకాలం, శ్రమజీవుల జీవితాల్లో వెలుగులు పరుచుకోనంత కాలం అలాంటి కళలు సజీవంగానే ఉంటాయి. అలా సజీవంగా …

చిందుల ఎల్లమ్మ Read More »

‘బెస్ట్ టూరిజం విలేజ్‍’ కాంటెస్ట్ పోటీలో భూదాన్‍ పోచంపల్లి

పోచంపల్లి.. మన దేశానికి స్వాతంత్య్రం అనంతరం భూములు దానాలు చేయడం వల్ల భూదాన్‍ పోచంపల్లిగా మారింది. స్వాతంత్య్రం రాకముందు అరబ్‍ దేశాలకు గాజులు పంపడంవల్ల ‘గాజుల పోచంపల్లి’గా పేరు వచ్చింది. పోచంపల్లి చీరలతో ప్రపంచం మొత్తం గుర్తింపు పొందింది. ఎక్కడెక్కడ నుంచో జనాలు ఇక్కడికి వచ్చి చీరలు కొంటారు. ఇప్పుడు యునైటెడ్‍ నేషన్స్ వరల్డ్ టూరిజం …

‘బెస్ట్ టూరిజం విలేజ్‍’ కాంటెస్ట్ పోటీలో భూదాన్‍ పోచంపల్లి Read More »

తారే జమీన్‍ పర్‍ ‘ఇరామ్‍ మంజిల్‍’


చదివేస్తే ఉన్నమతి పోయి, కాకరకాయను కీకరకాయ అన్నట్లు మనం మన వీధులు, బస్తీల పేర్లన్నింటినీ అపసవ్యానికి, అపభ్రంశానికి గురి చేసాం.

అందుకే నేక్‍నాం పల్లె నాంపల్లి అయ్యింది. నేక్‍ నాం ఖాన్‍ కుతుబ్‍షాహీల కాలంలో ఒక ఉన్నతాధికారి. అతను నివసించిన ప్రాంతమే నేక్‍నాంపురా లేదా నేక్‍నాంపల్లె. చివరికి మనం ఆధునిక కాలంలో నేక్‍ను ఎగరగొట్టి నాంపల్లెను …

తారే జమీన్‍ పర్‍ ‘ఇరామ్‍ మంజిల్‍’ Read More »

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-14


కళ్యాణచాళుక్య యువరాజు మూడోతైలపుని జడ్చర్ల జినశాసనం (క్రీ.శ.1127)


జడ్చర్ల. అదొక కూడలి. హైదరాబాదు, రాయచూరు, కర్నూలు, శ్రీశైలం, కొల్లాపూర్‍ ఇలా ఎన్నో ఊళ్లకు వెళ్లే మార్గాల కూడలి. అంతేకాదు. అటు శైవ, వైష్ణవ, జైన మతాల కూడలి కూడ ప్రక్కనే ఉన్న గంగాపురంలో మతాల మధ్య సామరస్యాన్ని నింపిన పంచాయతన దేవాలయం, జైనతీర్థంకరునికి ఆచ్ఛాదన కల్పించిన …

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-14 Read More »

పిట్టకొంచెం-కూత ఘనం @ డ్రోన్‍ టెక్నాలజీ


(గత సంచిక తరువాయి)


డ్రోన్లు ఎలా పనిచేస్తాయి
సాధారణంగా ఒకటి లేదా రెండు రెక్కలు కలిగిన హెలికాప్టర్స్ మరియు విమానాలు సుదూరంగా గాలిలో ఎగరడం మనం చూసే ఉంటాం. కానీ నాలుగు రోటర్లు కలిగిన డ్రోన్లు మనకు అత్యంత సమీపంలో, కంటికి కనిపించేంత ఎత్తులో ఎగరడం చూస్తే మనకు చాలా ఆశ్చర్యంగానూ, గమ్మత్తుగానూ అనిపిస్తుంది. అలాంటి …

పిట్టకొంచెం-కూత ఘనం @ డ్రోన్‍ టెక్నాలజీ Read More »