deccanland

తీర్పుల్లో ఉర్దూ కవిత్వం

ఉర్దూ భాషకి కోర్టులకి అవినావభావ సంబంధం ఉంది. ఉర్దూ పదజాలం కోర్టు పరిభాషలో ఎక్కువగా కన్పిస్తూ వుంటుంది. శాసనాలలో కూడా ఉర్దూ పదాలు ఎక్కువగా దొర్లుతూ వుంటాయి. వకాలత్‍, హలఫ్‍నామా, వకీలు, గవా, హాజిర్‍హై లాంటివి కొన్ని ఉదాహరణలు.ఉర్దూ పదాలు, పదబంధాలే కాదు, చాలా తీర్పుల్లో ఉర్దూ కవిత్వం కూడా కన్పిస్తూ వుంటుంది. సంక్లిష్టమైన కేసుల్లో, అదే విధంగా ప్రజల దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన కేసుల్లో కూడా ఉర్దూ కవిత్వం దర్శనం యిస్తూ వుంటుంది. యుద్ధనేషియా కేసులో, …

తీర్పుల్లో ఉర్దూ కవిత్వం Read More »

ప్రకృతే నియంత్రిస్తుంది! 11 ప్రకృతే శాసిస్తుంది!! భూపరిమాణ శాస్త్రం – సర్వేల విధానం!

(గత సంచిక తరువాయి)గర్‍వాల్‍, కుమాన్‍ జిల్లాల ఆక్రమణ:1814-15 గూర్ఖాలతో యుద్ధం చేసిన బ్రిటీషువారు ఖాడ్మండును ఆక్రమించాలనుకున్నారు. గూర్ఖాల ప్రతిఘటనతో సాధ్యంకాలేదు. కాని, గూర్ఖాల ఆధిపత్యం తక్కువగా వున్న గర్‍వాల్‍, కుమాన్‍ జిల్లాల్ని (నేటి ఉత్తరాఖండ్‍) బ్రిటీషు వారు చేజిక్కించుకున్నారు. వెంటనే విలియం వెబ్‍కు కుమాన్‍ ప్రాంతాన్ని, జాన్‍ హడ్‍సన్‍ (Hodgson)కు గర్‍వాలా ప్రాంతాన్ని అప్పజెప్పారు. వీరు 1816లో తమ సర్వేలను ప్రారంభించారు.రాబర్ట్ మరణంతో ఆయన కుటుంబ బాధ్యతలతోపాటు, మిగతా సర్వే బాధ్యతల్ని హెన్రీ తిరిగి స్వీకరించాడు. అప్పటికే …

ప్రకృతే నియంత్రిస్తుంది! 11 ప్రకృతే శాసిస్తుంది!! భూపరిమాణ శాస్త్రం – సర్వేల విధానం! Read More »

సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం

(షుగర్‍ (డయాబెటిస్‍), బీపీ థైరాయిడ్‍, ఊబకాయం, కీళ్ళనొప్పులు,రక్తహీనత తదితర 45 రకాల వ్యాధులు, 14 రకాల క్యాన్సర్లను దేశీ ఆహారంతో జయించే పద్ధతులు) ఆహారం విషపూరితం2030 నాటికి కోటి 40 లక్షల మంది వరకు కేన్సర్‍ బారిన పడే పరిస్థితి నెలకొంది. దీనిక ప్రధాన కారణం… ప్రతి రోజూ మనం తింటున్న విషతుల్యమైన ఆహారమే! ఇప్పుడు తింటున్న ఆహారం మరింత విషపూరితంగా మారిపోతోంది. పురుగు మందులుజనాభా పెరుగుతున్న కొద్దీ అధికంగా ఆహారం ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏర్పడింది. …

సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం Read More »

మార్జాల రాజు

అనగనగా ఒక ఊళ్లో గొల్లవాడి ఇంట్లో ఒక పిల్లి ఉండేది. పాలు, పెరుగు తాగి వెన్న మెక్కి ఆ పిల్లి పిప్పళ్ళ బస్తాలా తయారయింది. దాన్ని చూస్తే మిగతా పిల్లులకు వెన్నెముకలో వణుకు పుట్టుకొచ్చి ఆమడదూరం పారిపోయేవి. దాంతో పిప్పళ్ళ బస్తా లాంటి పిల్లికి కళ్లు నెత్తిమీది కొచ్చాయి. తన పేరు మార్జాల రాజుగా మార్చేసుకొంది. మిగతా పిల్లులతో మాట్లాడటం తనకు తలవంపులుగా భావించేది.ఒకనాడు మార్జాలరాజు ఒక కాయితం, కలం తీసుకొని అడవిలోకి వెళ్ళింది. దానికి అక్కడ …

మార్జాల రాజు Read More »

ప్రకృతిలో వికృతి ‘మదినా హిజ్రాఘర్‍’

పూర్వజన్మలో ఏ దేవుడికి ఏ నిప్పుల పూజ చేసుకున్నామో ఈ జన్మలో ఇట్లా అఘోరిస్తున్నాం’’.‘‘ఈ సమాజంలో వేశ్యకైనా ఒక గౌరవ స్థానముందేమో గాని మాకు మాత్రం లేదు. ఒక చిన్న చిల్లిపైసకు ఉన్న విలువ కూడా ఈ సంఘంలో మాకు లేదు. మేమందరం ఈ మానవ సమాజంలో అటుఇటు ఎటూగాని వింత ప్రాణులం. మేం నరుడు కాదు నారీ కాదు. ఇట్లాగాక కనీసం అడవిలో ఏ చెట్టుగానో, పక్షిగానో, జంతువుగానో పుట్టినా బాగుండేది. మేం శిలల్లాంటి వాళ్లమే …

ప్రకృతిలో వికృతి ‘మదినా హిజ్రాఘర్‍’ Read More »

గుండేరావు హర్కారే

పట్నములోన హైదరాబాదు గొప్పహైద్రాబాదులోన పాటపత్నంబు గొప్పపాతపట్నంబులో గొప్ప పదియురెండుభాషలెరిగిన హర్కారె పండితుండు(తెలంగాణోదయం) బహుభాషలలోను, బహుశాస్త్రాలలోను ఉత్తమశ్రేణికి చెందిన పండితుడు గుండేరావు హర్కారే. ఎంత పాండిత్యముంటే, అంత ఒదిగి ఉండాలని నిరూపించిన శాంతమూర్తి ఆయన. త్రికరణ శుద్ధికి మారుపేరుగా నిలిచిన హర్కారే జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతూ త్రివిక్రమణ్ణి తలపించాడు.గుండేరావు న్యాయశాస్త్రంలో ఎంత దిట్టనో, వ్యాకరణ శాస్త్రంలోను అంతే దిట్ట. పాణిని రచించిన అష్టాధ్యాయికి, ఆధునిక విజ్ఞానాన్ని అనుసరించి, విద్యార్థుల సౌకర్యార్థం’Sanskrit Grammar Made Easy’ పేరుతో ఒక యంత్రాన్ని …

గుండేరావు హర్కారే Read More »

చరిత్రకెక్కిన హైదరాబాద్‍ మెడికల్‍ స్కూల్‍

ప్రపంచ వైద్యచరిత్రలో హైదరాబాద్‍కు ఒక విశిష్టమైన స్థానమున్నది. అంతకన్నా ఘనమైన చరిత్ర ఉన్నది. ప్రజల ఆరోగ్యం పట్ల ఇక్కడి రాజులు వందల ఏండ్ల క్రితమే శ్రద్ధ వహించారు. కుతుబ్‍షాహీ వంశానికి చెందిన సుల్తాన్‍ మొహ్మద్‍ కులీకుతుబ్‍షా 1595లో హైదరాబాద్‍లోని చార్మినార్‍ పక్కనే ‘దారుషిఫా’ అనే వైద్యాలయాన్ని నిర్మించాడు. ఇక్కడ యునాని వైద్యంలో శిక్షణ నిప్పించడమే గాకుండా, రోగులకు చికిత్స చేసేవారు. రెండంతస్థుల్లో నిర్మించిన ఈ భవనంలో మొత్తం 40 గదులుండేవి. ఒక్కో గదిలో కనీసం నాలుగు బెడ్ల …

చరిత్రకెక్కిన హైదరాబాద్‍ మెడికల్‍ స్కూల్‍ Read More »

అడుగడుగున కథ ఉంది ‘సుల్తాన్‍ బజార్‍’

ఒకప్పుడు సుల్తాన్‍ బజార్‍ లేదు.ఆ ప్రాంతమంతా రెసిడెన్సీ బజార్‍లోనే కలిసి ఉండేది. అక్కడ నిజాం పరిపాలన కాక బ్రిటిష్‍ రెసిడెంటు ప్రభుత్వం నడిచేది. 1933లో కొంత ప్రాంతాన్ని నిజాంకు అప్పగించారు. అప్పుడు ఆ కొత్త ప్రాంతాన్ని సుల్తాన్‍ బజార్‍ అన్నారు. అప్పుడు ఇదొక వస్త్ర వ్యాపారుల విఫణి వీధి. సుల్తాన్‍ బజార్‍కు దగ్గరలో ఉన్న ‘‘బడీ చావుడీ’’ ప్రాంతమంతా మహా రాష్ట్రులతో నిండి ఉండేది. శ్రీకృష్ణదేవరాయల భాషా నిలయం పక్క సందులో మరాఠీలు మరాఠీల కోసం నడిపే …

అడుగడుగున కథ ఉంది ‘సుల్తాన్‍ బజార్‍’ Read More »

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-12

రెండో పులకేశి హైదరాబాదురాగిరేకు శాసనం (క్రీ.శ.610-11) (తొలిసారిగా తెలుగులో) తెలంగాణ కొత్త చరిత్ర బృందం తలవర శ్రీరామోజు హరగోపాల్‍ గారు నాకు ఒకరోజు ఫోన్‍ చేశారు. నేను తెలంగాణలో బాదామీ చాళుక్యులు అన్న పుస్తకాన్ని రాస్తున్నానని, తనకు రెండో పులకేశి హైదరాబాదు రాగిరేకు శాసన ప్రతిబింబాలు, పాఠం ఉంటే పంపిస్తారా, అని అడిగారు. నేను కూడ రెండో పులకేశి గురించి చదివినపుడు ఆ శాసన ప్రస్తావనను గమనించానే తప్ప, శాసన పాఠాన్ని గానీ, ముద్రలను గానీ చూడలేదు. …

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-12 Read More »

స్మైల్ ప్లీజ్‍… ఆగస్టు 19న వరల్డ్ ఫోటోగ్రఫీ డే

ఫొటో.. మాటలకందని ఓ  దృశ్య కావ్యం.. ప్రేమగా లాలిస్తుంది.. హాయిగా నవ్విస్తుంది.. కోపంగా కసురుకుంటుంది.. కంటతడి కూడా పెట్టిస్తుంది..ఫ్రాన్స్కు చెందిన లూయీస్‍ జాక్వేస్‍ మాండే డాగ్వేర్‍ 1837లోనే తొలిసారి డాగ్వేరియన్‍ ఫొటోగ్రఫీ విధానానికి రూపకల్పన చేశారు. రెండేళ్ల తర్వాత 1839 జనవరి 9న ఫ్రెంచ్‍ అకాడమీ ఆఫ్‍ సైన్స్ ఈ విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. వందేళ్ల తర్వాత ఆగస్టు 19న ఫ్రాన్స్ ప్రభుత్వం డాగ్వేర్‍ ఫొటోగ్రఫీ పేటెంట్లను కొనుగోలు చేసింది. ప్రజలందరికీ ఈ విధానం ఉచితంగా …

స్మైల్ ప్లీజ్‍… ఆగస్టు 19న వరల్డ్ ఫోటోగ్రఫీ డే Read More »