2020

ప్రకృతే నియంత్రిస్తుంది! ప్రకృతే శాసిస్తుంది!! -5

ప్రకృతి సూత్రాలలో 18వది – అనగా జీవశాస్త్రపరంగా నాల్గోది : చివరిది
జీవులన్నీటి మధ్యన ఒకదానితో ఒకటి పాదార్థిక బంధాన్ని కల్గివున్నాయి.
(All Life Forms are connected to each other) మనిషిది వానర వారసత్వమంటే నమ్మనివారు, నమ్మేవారు ప్రపంచవ్యాపితంగా వున్నారు. ఇందులో చదువుకున్నవారే అధికులు కావడం గమనార్హం! వీరెవ్వరికి చార్లెస్‍ డార్విన్‍ ప్రతిపాదించిన …

ప్రకృతే నియంత్రిస్తుంది! ప్రకృతే శాసిస్తుంది!! -5 Read More »

మౌఢ్యంతో పోరాడిన హేతువాది, న్యూక్లియర్‍ సైంటిస్ట్: డా.హెచ్‍.నరసింహయ్య

నాలుగు చెరగులా కల్ల, కపటం, ప్రచారం, కృత్రిమత్వం, వ్యాపారధోరణి డొంకదార్లు – ఇలా పరచుకుని సమాజం సాగుతున్న వేళ కొందరు పోరాట యోధుల గురించి తప్పక తెలుసుకోవాలి! అలాంటి అపురూపమైన వ్యక్తి హెచ్‍.ఎన్‍.గా ప్రఖ్యాతులయిన డా.హెచ్‍.నరసింహయ్య! పదమూడవ ఏట నుంచి ఖాదీని వదలని వ్యక్తీ, అమెరికాలో న్యూక్లియర్‍ ఫిజిక్స్లో పిహెచ్‍.డి. చేసిన వ్యక్తీ, సత్యసాయి మహిమలను పరీక్షకు …

మౌఢ్యంతో పోరాడిన హేతువాది, న్యూక్లియర్‍ సైంటిస్ట్: డా.హెచ్‍.నరసింహయ్య Read More »

తెలంగాణ జానపద కళలు అస్థిత్వపు మూలాలు – మనుగడ

తెలంగాణా సంస్కృతిలో జానపద కళలు అంతర్భాగం. విభిన్న పక్రియలతో అనాదిగా తమకు సంక్రమించిన సాహిత్యం, ప్రదర్శనా నైపుణ్యంతో సమాజంలో మనుగడ సాగిస్తున్నవి. వైవిధ్యమైన ఈ మట్టి కళలు తెలంగాణ సాంస్కృతిక వైభవానికి, చరిత్రకు ప్రతీకగా నిలుస్తున్నవి. జానపద కళలు ఆశ్రిత, ఆశ్రితేతర కళారూపాలుగా విభజింపబడ్డాయి. నేటి ఆధునిక కాలంలో కూడా తమ మూల సంస్కృతిని పరిరక్షించుకుంటూ …

తెలంగాణ జానపద కళలు అస్థిత్వపు మూలాలు – మనుగడ Read More »

కాయగూరల వాషింగ్‍ & ప్యాకింగ్‍ పరిశ్రమ

నిత్యజీవితంలో ఆహార పదార్థాల తయారీలో కాయగూరలకు వున్న ప్రాధాన్యత మనందరికి తెలిసినదే. శరీరానికి అవసరమైన పోషక విలువలకు, విటమిన్లను, ఖనిజాలను, ప్రొటీన్లు వంటి వివిధ ఆవశ్యపు పదార్థాలను కాయగూరలు అందించి, సరైన శారీరక, మానసిక వికాసానికి తోడ్పడమే కాకుండా రోగనిరోధకశక్తిని వృద్ధి చేసి అనేక రోగాలను రాకుండా నిరోధించగలిగే శక్తి నాణ్యమైన కాయగూరలకు ఉంటుందని శాస్త్రీయంగా …

కాయగూరల వాషింగ్‍ & ప్యాకింగ్‍ పరిశ్రమ Read More »

తెలంగాణా ఎత్తిపోతల జలపాతం

ఎవరైనా ఎత్తిపోతల జలపాతం ఎక్కడుందంటే ఠక్కుమని నాగార్జునసాగర్‍ దగ్గరుందని చెప్తారు. కాని, మెదక్‍ జిల్లాలో ఉన్న జహీరాబాద్‍ దగ్గర కూడా అదే పేరుతో మరో జలపాతముందని ఎవరూ చెప్పలేరు. అందరికీ తెలిసిన ఎత్తిపోతల జలపాతం రాతి గుట్టల మీద నుంచి దూకితే మనం తెలుసుకోబోతున్న జలపాతం రాతిమట్టి గుట్టల మీది నుంచి దూకుతుంది. ఈ ఎత్తిపోతల జలపాతం మూడు జలపాతాల సముదాయం. …

తెలంగాణా ఎత్తిపోతల జలపాతం Read More »

టంగ్‍ యంగ్‍

చాలా కాలం క్రితం చైనా దేశంలో టంగ్‍ యంగ్‍ అనే పదేళ్ళ కుర్రవాడు ఉండేవాడు. ఒక అవిటి తండ్రి తప్ప అతనికి నా అనేవాళ్లు ఎవరూ లేరు. ఆ అవిటి తండ్రి కూడా ఎప్పుడూ ఏదో ఒక రోగంతో అవస్థ పడేవాడు. రోజంతా కుక్కి మంచంలో పడుకొని మూలుగుతూ ఉండేవాడు. దాంతో సంసార భారమంతా పాపం …

టంగ్‍ యంగ్‍ Read More »

మరవలేనిది మన మట్టివాసన


ప్రకృతితో మనం మమేకమయినప్పుడు అది మనల్ని తన గుండెలకు హత్తుకుంటుంది. మనిషికీ ప్రకృతికీ స్నేహం కావాలంటుంది పర్యావరణ పరిరక్షణ ఉద్యమం. ప్రకృతి మనతో ఎప్పుడు స్నేహం చేస్తుంది? ప్రకృతికి మూలమైన మట్టినీ, చెట్టునీ, నీటినీ, గాలిని సహజంగా ఉండనిచ్చినప్పుడు, వాటిని స్వేచ్ఛగా, నిర్మలంగా ఎదగనిచ్చినప్పుడు ప్రకృతి మనిషిని ప్రేమించి మనిషి భౌతిక, మానసిక అవసరాలను తీర్చడంలో …

మరవలేనిది మన మట్టివాసన Read More »

సదాశివుడు

తెలంగాణ బీళ్ళను తడిపిన
గోదారి పాట సదాశివుడు
‘‘తలాపునా పారుతుంది గోదారి, నీ చేనూ, నీ చెలుకా ఎడారి, రైతన్నా! నీ బతుకు అమాస, నీ చుట్టూ సిరులు ఉన్నా నికేది దక్కదన్నా / నీ చేతిలోని బువ్వే నీ నోటి కందదన్నా / చేతికి మూతికి నడుమ గీత గీసిరన్నా / మోసపోతివన్న అరిగోసపడితివన్నా’’ …

సదాశివుడు Read More »

హైదరాబాద్ ముగ్గు పోసిన ఇరానీ

విద్య కోసం, మల్టినేషనల్‍ కంపెనీల్లో ఉద్యోగాల కోసం వివిధ దేశాల నుంచి వచ్చిన వారితో హైదరాబాద్‍ ఇవ్వాళ అంతర్జాతీయ నగరంగా అలరారుతున్నది. భిన్న సంస్కృతులను, ఆహారపు అలవాట్లను అలవర్చుకుంటున్నది. ఈ అలవాట్లు ఇటీవలి కాలంలోనే మొదలయినట్టుగా బయటికి కనిపిస్తుంది. కాని చరిత్ర మాత్రం మరో విధంగా ఉన్నది. వందల యేండ్ల క్రితమే గోలకొండ/హైదరాబాద్‍ అంతర్జాతీయ రూపుని …

హైదరాబాద్ ముగ్గు పోసిన ఇరానీ Read More »

అలనాటి మేటి తెలంగాణ శాసనాలు-2 విష్ణుకుండి గోవిందవర్మ తుమ్మలగూడెం రాగిరేకు శాసనం (క్రీ.శ.450)

తెరవెనుక
క్రీ.పూ. 3వ శతాబ్దిలో జంబూద్వీపమని పిలువబడిన యావద్భారతదేశం, మౌర్యచక్రవర్తి అశోకుని సర్వసత్తాక పాలనలో ఉంది. మౌర్యసామ్రాజ్యానంతరం జంబూద్వీపంలోని వివిధ భూభాగాలు, వివిధ స్థానిక, పరాయి రాజుల చేత పాలింపబడినాయి. కొంచెం ఆలస్యమైనా, అదే కాలంలో, తెలంగాణాలో, స్థానికులైన గోబద, కంవాయ, నరన, సమగోపులు తెలంగాణాలోని కోటిలింగాల నుంచి పాలించిన తొలి తెలుగు రాజులుగా గుర్తింపు పొందారు. అదే …

అలనాటి మేటి తెలంగాణ శాసనాలు-2 విష్ణుకుండి గోవిందవర్మ తుమ్మలగూడెం రాగిరేకు శాసనం (క్రీ.శ.450) Read More »