చిన్న తరహా పరిశ్రమలు – అవగాహన
దేశ సంపదను పెంచడంలో చిన్న తరహా పరిశ్రమల పాత్ర ఎనలేనిది. పారిశ్రామిక అభివృద్ధితోనే ఏ దేశమైనా అభివృద్ధి చెందు తుంది. ఒక పరిశ్రమను స్థాపించడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో కుటుంబాలకు జీవనాధారం దొరుకుతుంది. ఔత్సాహికులు ఎక్కువ సంఖ్యలో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వస్తే,ఉపాధి అవకాశాలు ఏర్పడి పేదరిక నిర్మూలనతో పాటు జీవన ప్రమా ణాలు మెరుగవుతాయి. చిన్న తరహా పరిశ్రమలు స్థాపించడానికి గొ ప్ప మేధస్సు అవసరం లేదు; కావలసిందల్లా విషయ పరిజ్ఞానం, నిరంతర అధ్యయనం, …