July

ప్రపంచ దినోత్సవాలునిర్మాణాత్మక ఆచరణకు స్ఫూర్తినిస్తాయి

నిత్యజీవితంలో ప్రతిరోజూ జాగ్రత్తగా పాటించవలసిన విషయాలను మనుషులు సహజంగానే నిర్లక్ష్యం చేస్తుంటారు. దానివల్ల అనేక రకాల కష్టాలకు నష్టాలకు గురవుతారు. ఈ కష్టనష్టాలు సుదీర్ఘ కాలం కొనసాగవచ్చు. కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చు. కొన్నిసార్లు శాశ్వతం కావచ్చు. నిర్లక్ష్యం చేయబడుతున్న అంశాలను ప్రజలకు గుర్తుచేసి అప్రమత్తం చేయడం కోసం, సరైన ఆచరణకోసం ఒకో అంశానికి ఒకో ప్రత్యేక దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరపుకోవడం మనకు తెలుసు. ప్రతినెలా కొన్ని ఉంటాయి. చారిత్రిక ప్రాధాన్యతను బట్టి, సంఘటనల ప్రాతినిధ్యాన్ని బట్టి ప్రతినెలా …

ప్రపంచ దినోత్సవాలునిర్మాణాత్మక ఆచరణకు స్ఫూర్తినిస్తాయి Read More »

మహిళా స్ఫూర్తిప్రదాత దుర్గాబాయి దేశ్‍ముఖ్‍

జూలై 15న జయంతి తన జీవితమంతా సమాజ సేవకు ముఖ్యంగా స్త్రీజనోద్ధరణకు అంకితం చేసిన స్ఫూర్తిప్రదాత శ్రీమతి దుర్గాబాయి దేశ్‍ముఖ్‍. ఈమె దేశభక్తురాలిగా, స్వాతంత్య్ర సమరయోధురాలిగా, సంఘ సంస్కర్తగా, కార్యకర్తగా, రచయిత్రిగా… తన కాలంలో మరెవరూ చూపని ధైర్యసాహసాలను, ప్రజ్ఞను చూపి చరిత్రలో నిలిచిపోయారు.మన ఆంధ్రరాష్ట్రం గర్వించదగ్గ మహిళామూర్తులో దుర్గాబాయిని ఆగ్రగణ్యులుగా చెప్పుకోవచ్చు. ఆమె వ్యక్తి మాత్రమే కాదు, ఒక వ్యవస్థ, ఓ గొప్ప మహోన్నత శక్తి. మేధావిగా, న్యాయ కోవిదురాలుగా, మానవతావాదిగా, ఆంధ్రమహిళాసభ వ్యవస్థాపకురాలిగా.. బహుముఖ …

మహిళా స్ఫూర్తిప్రదాత దుర్గాబాయి దేశ్‍ముఖ్‍ Read More »

వజ్రాలు కాని వజ్రాలు

వజ్రాలు సహజ పరిస్థితిలో భూమి అడుగున లోతుల్లో అధికపీడనం ఉష్ణోగ్రత వద్ద ఏర్పడి పైపొర లోపలికి అంతర్గమాల ద్వారా చేరిన కర్బన రూపాలు. ఇవి చాలా అరుదుగా మాత్రమే దొరుకుతాయి. వజ్రాలకు ఉన్న వాణిజ్య విలువవల్ల అందరికీ అందుబాటులో ఉండవు. ఈ కారణంగా అనేక ఇతర ఖనిజ/కృత్రిమ పదార్థాలు వజ్రాలకు ప్రత్యామ్నాయంగా వాడ బడుతున్నాయి. వాణిజ్యపరంగా వీటిని కూడా ‘‘వజ్రాలు’’ అనే అంటారు. వీటికిగల వజ్రాన్ని పోలిన లక్షణాలవల్ల తరచుగా వజ్రాలు అనే పదం వీటికి కూడా …

వజ్రాలు కాని వజ్రాలు Read More »

‘‘స్వంత కథ’’

(గత సంచిక తరువాయి)సరే. మళ్లీ మనం మా బాపు పరవస్తు జియ్యరు స్వామి గారి వద్దకు వెళ్లుదాం. ఆయనా, ప్రజాకవి కాళోజీ నారాయణరావుగారు ఇద్దరూ 1915వ సంవత్సరంలోనే మడికొండ గడ్డమీద జన్మించారు. వారిద్దరు సమకాలికులు. ఇద్దరు కూడా హన్మకొండలోని ‘‘మర్కజీ’’ స్కూలు విద్యార్థులే. మా బాపు ‘‘తహెతానియా’’ అంటే మిడిల్‍ స్కూలు అయిపోగానే టీచర్‍ ట్రేయినింగ్‍ కోర్సు చేసి ఏకోపాధ్యాయ పాఠశాలలో టీచర్‍ ఉద్యోగం 1935లో సంపాదించినాడు. మరాఠ్వాడా గ్రామాలలో టీచర్‍గా పనిచేస్తూ 1948 పోలీస్‍ యాక్షన్‍ …

‘‘స్వంత కథ’’ Read More »

తెలుగువారి తొలి రాజధాని కోటలింగాల

శాతవాహనులు తమ పరిపాలన ప్రారంభించింది ప్రతిష్ఠాన (పైథాన్‍)పురం నుంచి కాదనీ, తెలుగుకు ‘ఆణ’మైన తెలంగాణాలోని కోటలింగాల కోటనుంచి అని తెలిసిన తరువాత తెలంగాణాతో పాటు తెలుగునేలంతా పులకించింది. గర్వంతో తొణికిసలాడింది. 1978లో రాష్ట్ర పురావస్తుశాఖ, వి.వి.కృష్ణశాస్త్రి, ఎన్నెస్‍ రామచంద్రమూర్తిల ఆధ్వర్యంలో కోటలింగాల (ప్రస్తుతం జగిత్యాల జిల్లా)లో జరిపిన తవ్వకాల్లో విస్తుబోయే పురాతన ఆనవాళ్లు బయల్పడినాయి. శాతవాహన వంశ మూలపురుషుడైన ఛి(సి)ముక శాతవాహనుడు సా.శ.పూ. 1వ వతాబ్దిలో సామంత స్థాయి నుంచి, రాజుగా ఎదిగి, సొంత రాజ్యానికి హద్దుల్ని, …

తెలుగువారి తొలి రాజధాని కోటలింగాల Read More »

సమస్త ప్రకృతికి ప్రణామంజులై 28 ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం

ప్రస్తుతకాలంలో మనిషి తెలిసి కొంత తెలియక కొంత చేస్తున్న తప్పు ఏదైనా ఉందంటే ప్రకృతిని కాలుష్యం చేయడం. ప్రకృతి కాలుష్యం అవడం వల్ల మనిషి చుట్టూ ఎన్నో సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రతి సంవత్సరం జులై 28వ తేదీన ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవ సందర్భంగా ప్రపంచమంతటా ఏర్పడుతున్న కాలుష్యం, ప్రకృతి విషయంలో మనుషులు చేస్తున్న తప్పులు, ప్రకృతిని కాపాడుకునే మార్గాలు. ప్రణాళికలు వంటివి చర్చించడం, నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.ప్రపంచవ్యాప్త …

సమస్త ప్రకృతికి ప్రణామంజులై 28 ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం Read More »

పర్యావరణ వివేకం కావాలి

పర్యావరణ వ్యవస్థలు కొనసాగాలంటే జీవవైవిధ్యం కొనసాగాలి. జీవవైవిధ్యం కాపాడబడాలి. సామాజిక జీవితంలో, చరిత్రలో మానవాళి పాత్ర ఎలా మారుతూ వచ్చిందనేది ముఖ్యంగా చూడాలి. కొన్ని ప్రత్యేక కాలాల్లో, స్థలాల్లోకి మన దృష్టిని సారించినప్పుడు మన చారిత్రక అనుభవాలు నేడు ఏమి జరుగుతుందనేది అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తుంది. మానవ చరిత్రలో పర్యావరణ పరంగా మాట్లాడితే నిజంగా ఏం జరిగిందనేది తెలుసుకోగలం. మానవులు బహువిధాలుగా భూవ్యవస్థలతో సంబంధాన్ని కలిగి ఉన్నారనేది వాస్తవం. ఈ సంబంధాలు కొన్ని విధాలుగా సుస్థిరమైన సంతులనాన్ని …

పర్యావరణ వివేకం కావాలి Read More »

చదరంగం చరిత్ర మనదే?జూలై 20న ప్రపంచ చదరంగ దినోత్సవం

ప్రజలు అత్యంత ఇష్టపడే బోర్డ్ గేమ్‍లలో చదరంగం కూడా ఒకటి. ప్రపంచంలోని ప్రతిమూలలో చెస్‍ ఆడే వారు ఉంటారు. చెస్‍ ఆటను నిజ జీవితానికి సూచికగా తరచూ చెప్తారు. ‘జీవితమే ఒక చదరంగం’ అంటూ ప్రస్తావించడం తెలిసిందే. ఈ చెస్‍ అనేది ఇద్దరు కలిసి ఆడే ఆట. దీనిని ఆడటానికి మంచి ఏకాగ్రత, చురుకైన మెదడు, అద్భుతమైన వ్యూహాలు, అంకితభావం అవసరం. ఆటలో గెలవాలంటే ఎత్తుకు పైఎత్తులు వేయడం తెలిసుండాలి. ఈ ఆటలో ఒక రాజసం ఉంది. …

చదరంగం చరిత్ర మనదే?జూలై 20న ప్రపంచ చదరంగ దినోత్సవం Read More »

వేగం, భద్రత, ఖచ్చితత్వం @క్యూటీ

రాయి రాయి రాపిడితో నిప్పుపుట్టినా, వెదురుపొదల గాలిచేరి పాట పుట్టినా, అవసరాలు తీరుటలో సాధనాలు ముఖ్యం, సాధనాలు పుట్టుకయే విజ్ఞానపు గమ్యం అన్న విజ్ఞుల మాటలు అక్షర సత్యాలు. నేటి కన్నా రేపు మరింత సౌఖ్యమైన, సౌకర్యవంతమైన భవిష్యత్‍ను పొందాలన్న మానవుని నిరంతర తపన, వైజ్ఞానిక రంగంలో అనేక నూతన సాంకేతికతలను సృజియించింది. అలా మానవాళిని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితిలోకి నిలిపే మరో వినూత్న సాంకేతిక పరిజ్ఞానమే క్యూటీ. క్యూటీ అంటే క్వాంటం టెక్నాలజీ. …

వేగం, భద్రత, ఖచ్చితత్వం @క్యూటీ Read More »

ప్లాస్టిక్‍ ఉత్పత్తితో గుండెకు ముప్పు

రోజువారి వినియోగంలో ఉపయోగిస్తున్న ప్లాస్టిక్‍ వస్తువులు మన మరణాన్ని శాసిస్తున్నాయి. భారతదేశంలో థాలేట్స్తో ముడిపడి ఉన్న అత్యధిక గుండె జబ్బు సంబంధ మరణాలు ఉన్నాయని అధ్యయనం కనుగొంది. ప్రపంచవ్యాప్తంగా థాలేట్‍-సంబంధిత గుండె జబ్బుల మరణాలలో దాదాపు మూడింట ఒక వంతు భారతదేశంలోనే సంభవించాయి. ఇది ప్లాస్టిక్‍ ఉత్పత్తులకు బలమైన నిబంధనల అవసరాన్ని ప్రాధాన్యత చేస్తుంది. ఆహార పాత్రలు, వైద్య పరికరాలు, బొమ్మలు, షాంపూలు, లోషన్లు వంటి అనేక గృహోపకరణాలలో థాలేట్లు ప్రబలంగా ఉన్నాయి.ది లాన్సెట్‍ ఈబయోమెడిసిన్‍లో ప్రచురితమైన …

ప్లాస్టిక్‍ ఉత్పత్తితో గుండెకు ముప్పు Read More »