జానపద ఇంద్రజాల కళారూపాలు
జానపద కళారూపాల్లో ఇంద్రజాల కళారూపాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఇంద్రజాల కళారూపాలు ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షించటమే కాకుండా ఇతర కళారూపాల కంటే ప్రేక్షకునికి ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించి సంభ్రమాశ్చర్యంలో ముంచుతాయి. అందుకే ఇంద్రజాల కళారూపాలకు ఆదరణ ఎక్కువగా ఉంది. ఇంద్రజాలం అంటే ‘‘మాయ’’ అని, మంత్రౌషధాదుల చేత ఒక విధమైన పదార్థాన్ని మరొక విధంగా చూపే విద్య అని, నిఘంటువులు అర్ధాలు చెపుతున్నాయి.ఇంద్రజాలకుడు అంటే కనికట్టు వాడు, ఇంద్రజాలం చేయువాడు అనే అర్థాలు కన్పిస్తాయి. …