తీర్పుల్లో పాండిత్యం..?
‘ది ట్రాజెడీ ఆఫ్ హమ్లెట్’లో షేక్స్పియర్ క్లుప్తత గురించి ఇలా అంటాడు. ‘‘తెలివిగల వారి ఆత్మ క్లుప్తత.’ ఈ విషయం సాహిత్యానికే కాదు, చాలా విషయాలకి వర్తిస్తుంది. జీవితాలకి కూడా వర్తిస్తుంది. తీర్పులకి కూడా వర్తిస్తుంది.చాలా తీర్పులు పేజీలకు పేజీలు వుంటాయి. చాలా మంది న్యాయమూర్తులు ఈ క్లుప్తత అంశాన్ని మర్చిపోయారు. ఒకే విషయం మీద ఒక ప్రముఖమైన తీర్పుని ఉదహరించాల్సిన సమయంలో అలాంటి పది పదిహేను తీర్పులని ఉదహరిస్తారు. మరి కొంతమంది న్యాయమూర్తులు అవసరం లేని …