పరీక్షల సమయం
ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో సాధారణంగా పాఠశాల విద్యార్థులు అయినా, కళాశాల విద్యార్థులు అయినా పరీక్షలు వ్రాయవలసిన సమయం. విద్యార్థులు ఆందోళన చెందుతూ పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయం.గతంలోకంటే పిల్లలపై మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగింది. పిల్లలకంటే పిల్లల తల్లిదండ్రుల పై ఇంకా ఎక్కువ పెరిగింది. మావలే మా పిల్లల భవిష్యత్తు మారకూడదని, మేము చదవని చదువంతా మా పిల్లలు చదవాలని వారిపై తీవ్ర మానసిక ఒత్తిడిని తల్లిదండ్రులే పెంచుతున్నారు.బాగా చదివే (intelligent) విద్యార్థి కాని, సాధారణంగా చదివే …








