కొత్తూరు సీతయ్య గుప్త
శంనోమిత్రః శంవరుణ।। శంనో భవత్పర్యమాశంనో ఇండ్రో బృహస్పతిః।। శంనో విష్ణువిష్ణురురుక్రమఃదేశభక్తి, ప్రజాహిత చింతన మూర్తీభవించిన నిస్వార్థ నిరాడంబర ప్రజా సేవకులు శ్రీ కొత్తూరు సీతయ్య గుప్త. వారు పుట్టింది అతి సామాన్య కుటుంబంలో, ఒక చిన్న వ్యాపార సంస్థలో ఉద్యోగిగా జీవితం ఆరంభించారు. ఏ వ్యాపార సంస్థలో పనిచేసినా లక్షలు ఆర్జించే వ్యవహారదక్షులు. వృత్తిని బట్టి వ్యాపారస్తులైనా, ప్రవృత్తిని బట్టి దేశభక్తుడు. జాతీయవాది, గాంధీతత్వాభిమాని, ప్రజాహిత చింతనగల సంఘ శ్రేయోభిలాషి, నిజాం నిరంకుశ పరిపాలనకు వెరవని ధైర్యశాలి. …









