జాతి చైతన్యానికి నాంది గ్రంథాలయాలు
ఇవాళ పుస్తకాలు ఎవరు చదువుతున్నారు. ఆరోజులు పోయాయి అనేమాటలు మనం తరచూ వింటూ వుంటాం. ప్రస్తుత విద్యావిధానం వల్ల, కెరీర్ ఒక్కటే చదువుల లక్ష్యంగా మారిన వేళ పై మాటల్లో సత్యం లేకపోలేదు. అలా తగ్గిపోవడానికి దీనికి ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల్ని పెంచుతున్నతీరు, ఆటలు, పాటలూ లేని బాల్యాన్ని యిస్తన్న తీరు, చిన్నప్పటి నుంచే స్థోమతకు మించి ఆడంబరాలు, విలాసాలు అలవాటు చేస్తున్న తీరు, పిల్లలు సాధించవలసిన లక్ష్యాలను నిర్దేశిస్తున్న తీరు, మంచి భవిష్యత్తు పేరిట వారిని …








