November

గతాన్ని పరిరక్షిస్తేనే.. భవిష్యత్తు!

ఇటీవల మనం ఒక శుభవార్త విన్నాం. ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చాలని కోరుతూ 10 జియోలాజికల్‍ సైట్ల పేర్లను ఆర్కియలాజికల్‍ సర్వే ఆఫ్‍ ఇండియాకు కేంద్ర ప్రభుత్వం పంపించింది. ప్రస్తుతం దేశంలో 100కు పైగా జియో- హెరిటేజ్‍ సైట్లు ఉన్నాయి. వాటిలో 34 మాత్రమే నేషనల్‍ జియోలాజికల్‍ మాన్యుమెంట్స్గా గుర్తింపు పొందాయి. భూమికి సంబంధించిన చరిత్రను తెలుసుకోవడంలో కీలకపాత్ర పోషించే వాటిని లేదా భౌగోళికంగా ఎర్త్ సైన్స్ పరంగా ప్రాధాన్యం ఉన్న స్థలాలను జియో- హెరిటేజ్‍ …

గతాన్ని పరిరక్షిస్తేనే.. భవిష్యత్తు! Read More »

కృత్రిమ మేధ నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రయాణం @ ఆర్టిఫిషియల్‍ న్యూరల్‍ నెట్‍వర్కస్

(2024వ సంవత్సరానికి ఆర్టిఫిషియల్‍ న్యూరల్‍ నెట్‍వర్కస్ సాంకేతికపై పరిశోధనకు గాను భౌతిక శాస్త్ర (ఫిజిక్స్) విభాగంలో నోబెల్‍ బహుమతి వచ్చిన సందర్భంగా..) ఆర్టిఫిషియల్‍ ఇంటలిజెన్స్ లేదా కృత్రిమ మేధ… ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎవరి నోట విన్నా, ఏ ప్రాంతంలో చూసినా దీని గురించిన చర్చే నడుస్తోంది. మనిషి ఏదైనా పనిచేసేముందు దాని గురించి ఆలోచించి, విషయాలను గ్రహించి, సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరిస్తాడు. అదే పనిని యంత్రాల సాయంతో అత్యంత నేర్పుగా లేదా సమర్థవంతంగా చేసినట్లయితే దానిని …

కృత్రిమ మేధ నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రయాణం @ ఆర్టిఫిషియల్‍ న్యూరల్‍ నెట్‍వర్కస్ Read More »

తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం వైస్‍ ఛాన్సలర్‍గా డాక్టర్‍ సూర్యా ధనుంజయ్‍

వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం వైస్‍ ఛాన్సలర్‍గా ప్రొఫెసర్‍ సూర్యా ధనుంజయ్‍ గారు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అభినందిస్తున్న రచయిత 40 ఏళ్ల క్రితం మొదటిసారి హైదరాబాదు వచ్చింది మొదలు కాంపిటీటివ్‍ ఎగ్జామ్‍ రాయడానికో లేదా సంబంధిత ఇంటర్వ్యూ కోసమో వచ్చినపుడు ఇటువైపు రావడం తప్పనిసరి. ఓ వైపు ఆంధ్రా బ్యాంకు, మరో వైపు కోటి ఉమెన్స్ కాలేజ్‍ మధ్యలో ఉన్న రోడ్డు ఇరువైపులా సెకండ్‍ హ్యాండ్‍ పుస్తకాల షాపులు లెక్కకు మించి ఉండేవి. ఎన్నో …

తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం వైస్‍ ఛాన్సలర్‍గా డాక్టర్‍ సూర్యా ధనుంజయ్‍ Read More »

ఎఫ్‍బిహెచ్‍ ఆధ్వర్యంలో 1908 మూసీ వరదలపై.. చింతచెట్టు కింద సమావేశం

1908 మూసీ వరదల 116వ వర్ధంతిని పురస్కరించుకొని, ఫోరమ్‍ ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ (FBH), సివిల్‍ సొసైటీ గ్రూపులతో కలిసి సెప్టెంబర్‍ 28న అఫ్జల్‍గంజ్‍లోని ఉస్మానియా జనరల్‍ హాస్పిటల్‍ ఆవరణలోని ప్రాణధాత చింతచెట్టుకింద 16వ స్మారక మరియు ఐక్యసమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో ఎఫ్‍బిహెచ్‍ ఛైర్మన్‍ Er. వేదకుమార్‍ మణికొండ మాట్లాడుతూ… 1908 మూసీ వరదల సమయంలో జరిగిన ప్రాణ మరియు ఆస్తి నష్టాన్ని గుర్తుచేసుకుంటూ, అఫ్జల్‍ పార్క్లోని ఈ చింతచెట్టుపైకి 150 మంది ఎక్కి ఆశ్రయం …

ఎఫ్‍బిహెచ్‍ ఆధ్వర్యంలో 1908 మూసీ వరదలపై.. చింతచెట్టు కింద సమావేశం Read More »

కొన్నె ఒక చారిత్రక నగరం

కొన్నె జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలంలోని ఒక చారిత్రక పురాగ్రామం. కొన్నె గ్రామానికి ఉత్తరాన చెరువుంది. ఆ చెరువును గోనె చెరువని పిలుస్తారు అక్కడి ప్రజలు. అక్కడున్న కట్టమైసమ్మను గోనెకట్టమైసమ్మ అనే పిలుస్తారు. నిజానికి ఆ దేవత మహిషాసురమర్దిని. రాష్ట్రకూటశైలి విగ్రహం. గోనె లేదా గోన ఆ వూరునేలిన వారి వంశనామం కావచ్చు. ఆ గోనె రానురాను కొన్నెగా కుదించుకుపోయుండొచ్చు. దానితో ఈ వూరుకు కొన్నె అనే పేరు వచ్చివుంటుంది. ఈ గ్రామం వెయ్యేళ్ళ కింద కొత్తగా …

కొన్నె ఒక చారిత్రక నగరం Read More »

పర్యావరణ సంక్షోభంలో జర్నలిజం నవంబరు 16న జాతీయ పత్రికా దినోత్సవం

నవంబర్‍ 16న ప్రెస్‍ కౌన్సిల్‍ ఆఫ్‍ ఇండియా మోరల్‍ వాచ్‍ డాగ్‍గా పనిచేయడం ప్రారంభించింది. పత్రికలు.. జర్నలిజం ప్రమాణాలను పాటించేలా, శక్తిమంతుల ప్రభావానికి లోను కాకుండా చూసేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేశారు. మొదటి ప్రెస్‍ కమిషన్‍ సూచనల మేరకు 1956లో ప్రెస్‍ కౌన్సిల్‍ ఆఫ్‍ ఇండియాను ఏర్పాటు చేశారు. జర్నలిజంలో వృత్తిపరమైన ప్రమాణాలను కొనసాగించ డానికి ప్రెస్‍ కౌన్సిల్‍ దోహదపడుతుంది. ఫోర్త్ ఎస్టేట్‍ అని పిలువబడే పత్రికలు ప్రజాభిప్రాయాన్ని చెప్పడంలో, సమాచారాన్ని వ్యాప్తి చేయడంలో.. అధికారంలో …

పర్యావరణ సంక్షోభంలో జర్నలిజం నవంబరు 16న జాతీయ పత్రికా దినోత్సవం Read More »

విదేశీ కంపెనీలతో సింగరేణి ఉమ్మడి భాగస్వామ్యం నూతన రంగాల్లోకి ప్రవేశం

సింగరేణి ఉద్యోగులకు రూ.796 కోట్ల లాభాల వాటా పంపిణీ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సింగరేణి సాధిస్తున్న లాభాల్లో కొంత శాతం పక్కన పెట్టి కంపెనీ భవిష్యత్తు కోసం, బహుముఖ వ్యాపార విస్తరణ కోసం ఖర్చు చేయనున్నామని, కేవలం బొగ్గు మాత్రమే కాకుండా ఇతర ఖనిజ పరిశ్రమల్లోకి కూడా సింగరేణి సంస్థ విస్తరించడానికి కృషి చేస్తున్నామని సింగరేణిని అగ్రగామిగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక ప్రణాళిక మరియు …

విదేశీ కంపెనీలతో సింగరేణి ఉమ్మడి భాగస్వామ్యం నూతన రంగాల్లోకి ప్రవేశం Read More »

సంక్షోభంలో జీవవైవిధ్యం భారతదేశంలో అత్యధికంగా రవాణా చేయబడిన అడవి జంతువులు

అక్టోబరు మొదటి వారాన్ని భారతదేశంలో ‘‘వన్యప్రాణుల వారం’’గా జరుపుకుంటారు. ఇది వన్యప్రాణుల సంరక్షణకు ప్రాముఖ్యతను సూచిస్తుంది.భారతదేశ జీవవైవిధ్యానికి జరిగే ముప్పులలో అతిపెద్దది వన్యప్రాణుల అక్రమ రవాణా. వీటిని వెలుగులోకి తేవడం చాలా ముఖ్యమైన అంశం. కఠినమైన చట్టాలు, పరిరక్షకుల అవిరామ కృషి ఉన్నప్పటికీ, భారతదేశం వన్యప్రాణుల అక్రమ వ్యాపారానికి కేంద్రబింధువుగా కొనసాగుతోంది. దేశం లోపల, అంతర్జాతీయ సరిహద్దుల్లో జంతువుల భాగాలు, ప్రత్యక్ష నమూనాలు, అన్యదేశ జాతులకు డిమాండ్‍ చాలా ఎక్కువగా ఉంది. గంభీరమైన పులుల నుండి అరుదైన …

సంక్షోభంలో జీవవైవిధ్యం భారతదేశంలో అత్యధికంగా రవాణా చేయబడిన అడవి జంతువులు Read More »

ప్రకృతే సౌందర్యం! 30 ప్రకృతే ఆనందం!! పాలు పోసేది మీరే! ప్రాణాలు తీసేది మీరే!!

కూ•రమృగాలుగా ముద్రవేసిన జంతువులు ఎదురుపడితే పారిపోతారు. అదే మేము (పాములు) ఎదురుపడితే అరిచి, జనాన్ని పోగుచేసి చంపుతారు. పైగా చిన్న పామునైనా పెద్దకర్రతో చంపాలని కథలు చెపుతారు. మరోవైపు ఏ జంతువుకు చూపని భక్తిశ్రద్ధల్ని, ఆరాధనను మాపట్ల చూపుతారు. నాగపంచమి పేరున మీ మహిళలు (మగవారు కాదు) మా ఆవాసాలైన పుట్టల్లో (అన్ని పుట్టల్లో మేం వుండం) పాలుపోసి తరిస్తారు. మాపట్ల మీకు ఇంత గౌరవం భక్తిశ్రద్ధలు వున్నాయి కదా అని మేం మీ వెనక వచ్చామనుకోండి… …

ప్రకృతే సౌందర్యం! 30 ప్రకృతే ఆనందం!! పాలు పోసేది మీరే! ప్రాణాలు తీసేది మీరే!! Read More »

అడ్వెంచర్‍ కమ్‍ ఆధ్యాత్మికం.. అహోబిలం ట్రెక్‍

అడ్వెంచర్‍ కమ్‍ ఆధ్యాత్మికం అహోబిలం (Ahobilam) ట్రెక్‍. గుంటూరు ట్రెక్కింగ్‍ కింగ్స్ (GTK) వారి అహోబిలం బ్రోచర్‍ చూడగానే ఆలోచనలో పడ్డాను. అహోబిలం రెండుమూడు పర్యాయాలు వెళ్ళాను. కానీ దట్టమైన నలమల పశ్చిమ కనుమల అందాలు ఎప్పుడూ చూడలేదు. వెళ్లాలనే ఉత్సాహం నానాటికీ పెరిగిపోయింది. ఉగ్రస్తంభం ఊరిస్తూ ఉన్నది. యూట్యూబ్‍ (Youtube) వీడియోలు భయపెడుతూ ఉన్నాయి. ఎలాగైనా వెళ్ళాల్సిందే.. అనే పట్టుదల పెరిగింది. GTK వాళ్ళతో తర్జనభర్జనల పిమ్మట ప్రయాణానికి సిద్ధమయ్యాను. HTC, YHA లాగా GTK …

అడ్వెంచర్‍ కమ్‍ ఆధ్యాత్మికం.. అహోబిలం ట్రెక్‍ Read More »