ప్రాచీన గుహాచిత్రాల స్థావరం – పాండవుల గుట్టలు
వరంగల్ జిల్లాకేంద్రానికి 50కి.మీ. దూరంలో, వరంగల్-మహదేవపూర్ రహదారిపై రేగొండ మండలం రావులపల్లె పరిసరాల్లో ఈ పాండవులగుట్టలున్నాయి. ఎక్కువ మట్టుకు సున్నపురాళ్ళతో, అవక్షేపశిలలతో ఏర్పడిన ఈ గుట్టల్లో పొరలు పొరలుగా ఒకదాని మీదొకటి పేర్చినట్టుగా అనేక శిలాక•తులు కన్పిస్తాయి. ఎత్తైన బండరాళ్ళ మధ్య లోతైన అగాధాలతో లోయలు, అడుగడుగునా అబ్బురపరిచేవిధంగా పడిగెలెత్తి నిల్చున్న కొండ వాళ్ళు. ఆ కొండగోడలపై అపురూపమైన ప్రాచీన రాతిచిత్రాలు. భారతదేశంలోని 100 శిలాచిత్రలేఖన మండలాల్లో దాదాపు 2,500 చిత్రిత శిలాశ్రయాలున్న 400ల స్థావరాలు కన్పిస్తున్నాయి. …









