హైదరాబాద్‍ బుక్‍ ఫెయిర్‍లో ఆవిష్కరించిన పుస్తకాలు

హైదరాబాద్‍ బుక్‍ ఫెయిర్‍ అంటే కేవలం పుస్తకాల అమ్మకాలు ఎలా జరిగాయి అని మాత్రమే చర్చ జరిగేది. కానీ, ఇప్పుడు హైదరాబాద్‍ బుక్‍ ఫెయిర్‍ అంటే అర్థం మారిపోయింది. ఒకప్పుడు మాట్లాడిన అమ్మకాల మాటలకు ఇప్పుడు ప్రాధాన్యత తగ్గిపోయింది. అక్షరాల లక్షల పుస్తకాల మధ్య వందలాది కొత్త పుస్తకాలు పురుడుపోసుకుంటున్నాయి. వక్తల చేసే గుణ, గణ వర్ణలలతో ఆ పుస్తకాలకు కొత్త రెక్కలు వస్తున్నాయి. చలిపులి పంజా విసిరినా వాడి వాడి పదాలతో వేడి పుట్టించాయి పుస్తకాలు. ప్రముఖ రచయిత, గాయకులు దేశపతి శ్రీనివాస్‍ ప్రారంభించిన జాతశ్రీ సాహిత్య వేదిక పై ఒకటి రెండు కాదు… వందల పుస్తకాలు పురుడుపోసుకున్న ఈ కొత్త పుస్తకాలు యువతను ఎక్కువగా ఆకర్షించాయి. ఇప్పుడు హైదరాబాద్‍ బుక్‍ ఫెయిర్‍ తరువాత ఏ ఇద్దరు కనబడినా బుక్‍ ఫెయిర్‍లో ఎన్ని పుస్తకావిష్కరణలకు ఎల్లినవు అనో, ఎన్ని సాహిత్య సభలలో పాల్గొన్నవానో చర్చించుకుంటున్నారు. గత రెండు సంవత్సరాలుగా బుక్‍ ఫెయిర్‍లో పుస్తకావిష్కరణలకు ఒక ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయడం ఒక మంచి పరిణామం అని సాహితివేత్తలు అభినందిస్తున్నారు. డిసెంబర్‍ 16 నుంచి 24 వరకు కొత్త పుస్తకాలు చెప్పిన కొత్త ముచ్చట్లు విందాం.


బండారు ప్రసాదమూర్తి రచించిన ‘దేశం లేని ప్రజలు’ కవితా సంపుటిని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు నందిని సిధారెడ్డి ఆవిష్కరించారు. సిధారెడ్డి మాట్లాడుతూ లోతైన బావుకతతో పాటు సామాజిక దృష్ఠి కల్గిన కవి కాబట్టే ప్రసాదమూర్తి కలం నుంచి దేశం లేని ప్రజల కోసం కవిత్వం వచ్చిందని అభినందించారు. ఈ వేదికపై జరిగిన తొలి సభకు కవి యాకూబ్‍ అధ్యక్షత వహించిగా ఈ సభలో వీక్షణం సంపాదకులు ఎన్‍. వేణుగోపాల్‍, ప్రముఖ విమర్శకులు లక్ష్మీ నరసయ్య, శిఖామణి, శిలాలోలితలు పాల్గొన్ని ప్రసంగించారు. అనంతరం పీఠికల్లోనే కవి, రచయితల హృదయాన్ని సమర్థవంతంగా ఆవిష్కరించగల గొప్ప రచయిత శిఖామణి. ఆయన ఎందరో కవులను, రచయితలను తన కలంతో తట్టి సాహిత్య రంగంలో ముందుకు నడిపించారు. అలా శిఖామణి కలం నుండి ఉబికివచ్చిన ముందుమాటల సమహారమే ‘శిఖామణి పీఠికలు’ను కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య కొలకలూరి ఇనాక్‍ చేతుల మీదగా ఆవిష్కరించబడింది. ప్రముఖ కవి ఏనుగు నరసింహరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రముఖ విమర్శకులు లక్ష్మీ నరసయ్య, ప్రసాదమూర్తి, కోయి కోటేశ్వరరావులు ప్రసంగించారు.


రెండో రోజు మరో నాలుగు పుస్తకాలు ఆవిష్కరించబడ్డాయి. పుస్తకాలంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది గ్రంథాలయాలే. అలాంటి గ్రంథాలయ నిర్వహకులు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాల్లో వివిధ స్థాయిల్లో పని చేసిన వారి వివరాలను సేకరించి గ్రంథస్తం చేశారు. ఈ గ్రంధాలను ఉస్మానియా విశ్వవిద్యాలయ వి.సి రామచంద్రం ఆవిష్కరించారు. అకాడమీ ఆఫ్‍ లైబ్రరీ సైన్స్ అండ్‍ డాక్యుమెంటేషన్‍ ఆధ్వర్యంలో జరిగిన సభలో రాష్ట్ర గ్రంధాలయ సంస్థల అధ్యక్షులు అయాచితం శ్రీధర్‍ మాట్లాడుతూ ఇలాంటి కృషి జరిగినప్పుడే గ్రంథాలయాలు చేసిన పని వెలుగులోకి వస్తుందని అన్నారు. ఈ గ్రంథంలో ఉన్న వారిని ఏ ఒక్కరిని కదిలించినా ఒక్కొక్కరిది ఒక్కొక్క అనుభవం తెలుస్తుందని అది మంచి ప్రయత్నం అన్నారు. అనంతరం ప్రముఖ సామాజిక వేత్త కంచె ఐలయ్య ఆత్మకథ ‘షెప్పడ్‍ బాయ్‍’ గ్రంథాన్ని ట్రాన్స్ జండర్‍ చంద్రముఖి ఆవిష్కరించారు. హైదరాబాద్‍ బుక్‍ ఫెయిర్‍ కార్యదర్శి కోయ చంద్రమోహన్‍ అధ్యక్షత వహించిన ఈ సభలో వక్తలు మాట్లాడుతూ ఇది దేశంలోనే తొలి దళిత ఆటో బయోగ్రఫీ అని అన్నారు. అనంతరం మునాస వెంకట్‍ రచించిన మేధ కవితా సంపుటిని ప్రముఖ వాగ్గేయకారుడు, కవి గోరటి వెంకన్న ఆవిష్కరించారు.


మూడోరోజు శ్రామిక జన జీవితాలను కథల రూపంలో ప్రపంచానికి తెలియజేసిన చెవోహ్‍, మ్యాగ్జిమ్‍ గోర్కి, మెహలాయ్‍ షోలొహోవ్‍లు రాసిన కథలు శ్రామికవర్గ దృక్పథంతో రాసిన కథలు అని ఈ పుస్తకాలను ఆవిష్కరించిన నవతెలంగాణ సంపాదకులు వీరయ్య అన్నారు. నవతెలంగాణ బుక్‍ హౌస్‍ సహ సంపాదకులు తంగిరాల చక్రవర్తి అధ్యక్షతన జరిగిన ఈ సభలో నవతెలంగాణ పబ్లిషింగ్‍ హౌస్‍ జనరల్‍ మేనేజర్‍ కోయ చంద్ర మోహన్‍, ప్రభుత్వ సలహాదారులు రామ్‍ లక్ష్మణ్‍, హైదరాబాద్‍ బుక్‍ ఫెయిర్‍ అధ్యక్షులు జూలూరు గౌరిశంకర్‍లు పాల్గొన్నారు.
నాలుగో రోజు శంకరం వేదిక ఆధ్వర్యంలో ఆరణ్యకృష్ణ సంపాదకీయంలో వచ్చిన ‘ఆమె అస్తమించలేదు’ పుస్తకాన్ని పివోడబ్యు జాతీయ కన్వీనర్‍ వి.సంధ్య ఆవిష్కరించారు. వాడ్రేవు చిన వీరభద్రుడు అధ్యక్షత వహించిన ఈ సభలో ప్రముఖ కవయిత్రి, రచయిత్రి శిలాలోలిత, సావిత్రి గారి కుమార్తె శీరిష పాల్గొన్నారు.


డా.కె.ముత్యం రచించిన ‘సుబ్బారావు పాణిగ్రహి జీవితం’ పుస్తకావిష్కరణ వీక్షణం సంపాదకులు ఎన్‍.వేణుగోపాల్‍, ఎ.కె.ప్రభాకర్‍, జితేంద్రబాబులు ఆవిష్కరించారు.
ఐదో రోజు శంకరం వేదిక ఆధ్వర్యంలో వేమురి సత్యనారాయణ సంపాదకీయంలో వచ్చిన ‘ఆనాటి వాన చినుకులు’ కథల సంపుటిని సీనియర్‍ జర్నలిష్ట్ అమరేంద్ర ఆవిష్కరించారు. ఈ సభలో చందు తులసీ, యాకూబ్‍, శంకరం వేదిక అధ్యక్షులు యలవర్తి రాజేందప్రసాద్‍, ధనలక్ష్మిలు పాల్గొన్నారు. అనంతరం ప్రముఖ రచయిత్రి శిలాలోలిత రచించిన లేఖల సంకలనం ‘వర్తమాన లేఖ’ పుస్తకాన్ని కవి యాకూబ్‍ చిన్న కోడలు దేవాంశీ కేడియా ఆవిష్కరించారు. జూపాక సుభద్ర అధ్యక్షత వహించిన ఈ సభలో జి.లక్ష్మి నరసయ్య, జూలూరు గౌరీశంకర్‍, చింతపట్ల సుదర్శన్‍. కొండవీటి సత్యవతి, కవి యాకూబ్‍లు పాల్గొన్నారు. అనంతరం యువ కవి షహబాన్‍ రచించిన ‘యుద్ధం మాట్లాడుతుంది’ పుస్తకాన్ని సినీయర్‍ జర్నలిస్ట్ పాశం యాదగిరి ఆవిష్కరించారు. ఈ సభలో జూలూరు గౌరీశంకర్‍, కోయ చంద్రమోహన్‍, ఎస్‍.రఘులు పాల్గొన్నారు. ‘పతాన్‍’ కథల సంపుటిని జి.లక్ష్మినరసయ్య, కోయ కోటేశ్వరరావు, అంబటి సురేంద్ర బాబు, సిద్దార్థలు ఆవిష్కరించారు.
ఏడో రోజు విజయ్‍ కుమార్‍ రచించిన ‘విజయ రహస్యాలు’ పుస్తకాన్ని ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య ఆవిష్కరించారు. ఈ సభలో హైదరాబాద్‍ బుక్‍పెయిర్‍ అధ్యక్ష, కార్యదర్శులు జూలూరు గౌరిశంకర్‍, కోయచంద్రమోహన్‍లు పాల్గొన్నారు. వైద్యం భాస్కర్‍ రచించిన ‘జాప్ఞకాల తడి’ పుస్తకాన్ని పొత్తూరి సుబ్బారావు ఆవిష్కరించారు. కవి యాకూబ్‍ అధ్యక్షతన జరిగిన ఈ సభలో జీవన్‍, సునంద, లెనిన్‍ శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతరం వి. శాంతిప్రభోద రచించిన ‘ఆలోచనలో ఆమె’ గ్రంధాన్ని కొండవీటి సత్యవతి ఆవిష్కరించారు. పివోడబ్ల్యూ కన్వీనర్‍ సంధ్య అధ్యక్షతన జరిగిన సభలో ఎ.కె.ప్రభాకర్‍, డాక్టర్‍ నళిని, సత్య బిరుదు రాజులు పాల్గొన్నారు.


ఎనిమిదో రోజు వల్లంపట్ల నాగేశ్వరరావు రచించిన ‘వెలుతురు పాటలు’ పుస్తకాన్ని బీసి కమీషన్‍ చైర్మన్‍ బి.ఎస్‍ రాములు ఆవిష్కరించారు. జలవనరుల శాఖ చైర్మన్‍ వి.ప్రకాష్‍, రచయిత వల్లంపట్ల నాగేశ్వరరావులు పాల్గొన్నారు. బండారు విజయ రచించిన ‘కచ్చీరు ముచ్చట్లు’ పుస్తకాన్ని పి.వరలక్ష్మి ఆవిష్కరించారు. ఈ సభలో గోవర్థన్‍, సమతారోష్ని, విమలక్కలు పాల్గొన్నారు. అనంతరం బండారు రాజ్‍కుమార్‍ రచించిన వెలతురు గబ్బిలం పుస్తకాన్ని వఝల శివకుమార్‍ ఆవిష్కరించారు. శిలాలోలిత అధ్యక్షతన జరిగిన సభలో నారాయణశర్మ, యాకూబ్‍ తదితరులు పాల్గొన్నారు. అనంతరం బిసి పబ్లికేషన్‍ వారు ప్రచురించిన 21 పుస్తకాలను మాజీ హొంమంత్రి టి.దేవేంద్ర గౌడ్‍ ఆవిష్కరించారు. ఈసభలో ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‍, జూపాక సుభద్ర, అల్లం రాజయ్య, సురేపల్లి సుజాతలు పాల్గొన్నారు.


తొమ్మిదో రోజు ‘కొమరం భీం’ జీవితం గ్రంధాన్ని నిఖిలేశ్వర్‍ అవిష్కరించారు. జయధీర్‍ తిరుమలరావు అధ్యక్షత వహించిన ఈ సభలో ఎ.కె ప్రభాకర్‍ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ‘చెంచు లోకం’ పుస్తకాన్ని పాశం యాదగిరి ఆవిష్కరించారు. శంకరం వేదిక ఆధ్వర్యంలో అరణ్యకృష్ణ రచించిన ‘కూలిపోయిన స్వప్నాలకో పరామర్శ’ పుస్తకాన్ని తెలంగాణ ప్రెస్‍ అకాడమీ చైర్మన్‍ అల్లం నారాయణ ఆవిష్కరించారు. ఈసభలో జెడి లక్ష్మినారాయణ, ఎన్‍.వేణుగోపాల్‍, యలవర్తి రాజేందప్రసాద్‍లు పాల్గొన్నారు. అనంతరం సుబ్రహ్మణ్యం రచించిన ‘ట్వైస్‍ టోల్డ్ టేలర్స్’ పుస్తకాన్ని శ్రీనివాస్‍ ఆవిష్కరించారు. మహ్మాద్‍ షరీఫ్‍, కోయ చంద్రమోహన్‍లు పాల్గొన్నారు.


సంగెం లక్ష్మి బాయ్‍ వేదికపై తొలి రోజు ‘కపిలవాయి లింగమూర్తి గారి ఆత్మకథ’ను భారత ఉపరాష్ట్రపతి యం. వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ప్రముఖ సినీ నటులు ప్రకాష్‍ రాజ్‍ రచించిన ‘దోసిట చినుకులు’ పుస్తకాన్ని జయజయ శంకర టీవి సిఈవో ఓలేటి పార్వతీశం ఆవిష్కరించారు. గౌరీ శంకర్‍ అధ్యక్షతన జరిగిన ఈసభతో తొలి ప్రతిని కోయ అమన్‍ అందుకున్నారు. ఈ సభలో నటులు ప్రకాష్‍రాజ్‍, తణికెళ్ల భరణి, కవి, విమర్శకులు సీతారాం, కోయ చంద్రమోహన్‍లు పాల్గొన్నారు. బాలచెలిమి ఎడిటర్‍ యం.వేదకుమార్‍ సంపాదకత్వంలో వచ్చిన బాలల కథలు ‘అంతరిక్ష దొంగలు’ పుస్తకాన్ని చిన్నారి అథర్వ్ – చిన్న భూపతిరావు ఆవిష్కరించారు. కోయ అమన్‍ అనే బాలుడు పాల్గొన్నారు. ఈ సభలో గౌరీశంకర్‍, వేదకుమార్‍, కోయ చంద్రమోహన్‍, సీఏ ప్రసాద్‍, విఆర్‍ శర్మ, చొక్కాపు వెంకటరమణ, దాసరి వెంకటరమణ, సుతారపు నారాయణ పాల్గొన్నారు. ‘నూర్‍ మహాల్‍’ పుస్తకాన్ని బి.నర్సంగరావు, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్‍. శంకర్‍, పరుచూరు గోపాల వెంకటేశ్వరరావు, మామిడి హరికృష్ణ ఆవిష్కరించారు. చంద్రిక రచించిన పిల్లల కథలు ‘బాల చంద్రికలు’ పుస్తకాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య సూర్యధనుంజయ్‍ ఆవిష్కరించారు.

అనంతోజు మోహన్‍ కృష్ణ
ఎ : 8897765417

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *