ఓయూలో రాతి పనిముట్లు, నాణేలు, శిలాజాల ప్రదర్శన

చరిత్ర పూర్వ యుగం నాణాలు, శిలాజాల ప్రదర్శన అమోఘం : ప్రిన్సిపాల్‍ ప్రొ. డి.రవీందర్‍


చరిత్ర పూర్వ యుగం, చారిత్రక యుగానికి సంబంధించిన ముఖ్య పనిముట్లు, నాణాలు, శిలాజాలను ప్రదర్శనలో ఉంచడం వల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగం ఉంటుందని ఆర్టస్ కళాశాల ప్రిన్సిపాల్‍ ప్రొఫెసర్‍ డి.రవీందర్‍ అన్నారు. ఓయూ ఆర్కియాలజీ విభాగం ఆధ్వర్యంలో చారిత్రక పూర్వయుగానికి సంబంధించిన పురాతన రాతి పనిముట్లు, మానవ శిలాజాలు, చారిత్రక యుగంకు సంబంధించిన నాణాలు (కైన్స్) ప్రదర్శన కార్యక్రమాన్ని ఆర్టస్ కళాశాల న్యూ సెమినార్‍ హాలులో ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్‍ను కళాశాల ప్రిన్సిపాల్‍ ప్రొఫెసర్‍ డి.రవీందర్‍ ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రొ.డి.రవీందర్‍ మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్‍లో విద్యార్థులు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకునే వీలుందన్నారు. పురాతన వస్తువులు, స్టాంపులు, కరెన్సీ సేకరించడం గొప్ప కళ అన్నారు.


గత చరిత్రను తెలుసుకునేందుకే ఎగ్జిబిషన్‍: ఆర్కియాలజీ హెడ్‍ డా.ఎన్‍.గిరిధర్‍

గత చరిత్రను తెలుసుకునేందుకు, చారిత్రక అంశాల పట్ల విద్యార్థులకు విజ్ఞానాన్ని కలిగించడంతోపాటు పరిశోధనల పట్ల విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఎగ్జిబిషన్‍ను ఏర్పాటు చేసినట్లు ఆర్కియాలజీ హెడ్‍ అండ్‍ బీవోఎస్‍ చైర్మన్‍ డా.ఎన్‍.గిరిధర్‍ అన్నారు.


2600 సంవత్సరాల పూర్వకాలం నుండి నాణాలను సేకరించా : పరిశోధకులు వెంకటేష్‍ కందుల

2600 సంవత్సరాల పూర్వకాలం నుండి నాణాలను సేకరించి ఈ ప్రదర్శనలో ఉంచినట్లు పరిశోధకులు వెంకటేష్‍ కందుల తెలిపారు. తెలుగువారి చరిత్ర శాతవాహనుల కాలం నుంచి మొదలవుతుందన్నారు. ప్రతి 100 సంవత్సరాలకు ఒక రాజు మారినట్లు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ చరిత్రకు సంబంధించిన నాణాలపై 7వ తరగతి నుండే నాణాల సేకరణ చేసినట్లు తెలిపారు. నాణాలను ఇతర వ్యక్తుల నుండి ఎక్కువశాతం కొనుగోలు చేసినట్లు తెలిపారు. వీటి గురించి ఎగ్జిబిషన్‍లో పవర్‍పాయింట్‍ ప్రజంటేషన్‍ ద్వారా వివరించినట్లు తెలిపారు.


10 కోట్ల సంవత్సరాల నుండి 2000 సంవత్సరాల వరకు : చరిత్ర పరిశోధకులు సునీల్‍ సముద్రాల

తాను 2011 నుండి 2019 సంవత్సరాల వరకు 10 కోట్ల సంవత్సరాల వయసు నుంచి 2000 సంవత్సరాల వయసు వరకు ఉన్న చారిత్రక సాక్ష్యాలపై పరిశోధన చేసినట్లు చరిత్ర పరిశోధకులు సునీల్‍ సముద్రాల తెలిపారు. సొంతంగానే చేప శిలాజం, శాండ్‍ డాలర్‍, అత్యంత అరుదైన శిలాజాలను సేకరించినట్లు వివరించారు. తాను సేకరించిన అన్ని వస్తువులను ప్రదర్శనలో ఉంచినట్లు చెప్పారు. కరీంనగర్‍లో పార్ట్టైమ్‍ జాబు చేస్తూనే అనేక చారిత్రక అవశేషాలను సేకరించానని వివరించారు. జాగృతి సంస్థ తనకు ఎంతో సహాయం చేసినట్లు చెప్పారు. తెలంగాణకు చెందిన చారిత్రక పూర్వయుగానికి సంబంధించిన రాతి పనిముట్లను, మానవ శిలాజాలను సేకరించి ఈ ఎగ్జిబిషన్‍లో ప్రదర్శించినట్లు తెలిపారు.


ఉద్యోగం చేస్తూనే చారిత్రక వస్తువుల సేకరణ : చరిత్ర పరిశోధకులు సీతారామారాజు
తాను ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే చారిత్రక వస్తువుల సేకరణ చేసినట్లు చరిత్ర పరిశోధకులు సీతారామారాజు తెలిపారు. వివిధ, కాలాలకు చెందిన నాణాలు, చిత్రాలను సేకరించినట్లు వివరించారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే తాను 1972 నుండి స్టాంప్స్, ఆంటిక్స్, రాళ్లు, కాయిన్స్ సేకరించినట్లు వివరించారు. 2011 రిటైర్‍మెంట్‍ అయ్యాక కాయిన్స్, రాళ్లు, స్టాంప్స్ అన్నింటిని ప్రేమ్‍ రూపంలో తీసుకొచ్చినట్లు చెప్పారు. చరిత్ర గురించి పిల్లలకు చెప్పడం కోసం ఎంతో ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. తాను సేకరించిన వాటిని ప్రేమ్‍ రూపంలో భద్రపరుస్తున్నట్లు చెప్పారు. 9 కాలేజీల్లో మిని మ్యూజియం డోర్‍స్టేప్‍ పేరుతో ఎగ్జిబిషన్లు నిర్వహించినట్లు చెప్పారు.


– దక్కన్‍న్యూస్‍, ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *