- నగరం నుండి పలు పాఠశాలల పిల్లలు హాజరు
గ్లోబల్ ఆర్ట్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ ఆర్ట్ఫెస్ట్ 2020 చిత్రకళా ప్రదర్శనను నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లోని జవహార్ బాలభవన్‍లో జనవరి 30న నిర్వహించారు. అందులో భాగంగా రకరకాల చిత్రాలు, అల్లికలు మరియు కుట్లు, వర్లీ ఆర్ట్, కోలార్జ్, బుక్‍లెట్స్, గ్రీటింగ్స్ కార్డస్, తోలుబొమ్మల చిత్రాలు, మెహిందీ, పచ్చబొట్లు, రంగోలి మొదలైన వాటిలో పిల్లలకు మెళుకువలు నేర్పించారు. అద్దంలో వారి ముఖ చిత్రమును వారే గీసుకునే విధంగా తర్పీదునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల పిల్లలకు పెయింటింగ్‍పై పలు రకాల పోటీలు నిర్వహించారు. నగరంలోని వివిధ పాఠశాలల నుండి పాల్గొన్న పిల్లలు టీమ్‍లవారీగా విడిపోయి వైవిధ్యమైన చిత్రాలు గీశారు. ఆక్స్ఫర్డ్ పాఠశాల నుండి పాల్గొన్న విద్యార్థులు విభిన్నమైన చిత్రాలను గీసి చూపరులను ఆకట్టుకున్నారు. వాటర్ కలర్స్, మల్టీకలర్స్, కలర్ పెన్షిల్స్తో పిల్లలు పేపర్‍పై వేసిన వివిధ రకాల బొమ్మలు ఎంతో ఆకర్షణగా నిలిచాయి. చిత్రకళా నిర్వహణ (ఆర్ట్ క్రియేటివిటి)లో హిమాయత్‍నగర్ ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూలు విద్యార్థులు ఎంతోఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్న పిల్లల నుండి 10వ తరగతి వరకు నగరంలోని పలు పాఠశాలల నుంచి పిల్లలు పాల్గొని, ఎన్నో వైవిధ్యమైన చిత్రాలకు ప్రాణం పోశారు.
చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ చైర్మన్ మణికొండ వేదకుమార్ ఈ చిత్రకళ ప్రదర్శనలో పాల్గొని పిల్లలు వేస్తున్న చిత్రాలను ఆసక్తిగా తిలకించారు. చిత్రకళా నిర్వహణ జరుగు తున్నతీరును పరిశీలించి నిర్వాహ కులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ పాఠశాల నుండి సాబేర్, నుజహత్, ఉపాధ్యాయులు, సీబీఎస్‍ఈ, ఎస్‍ఎస్‍సీ విద్యార్థులు పాల్గొన్నారు.
– సచిన్, 9030 6262 88