ప్రాణం వాసన.. సమాజపు చైతన్య సువాసన..

నేడు మనిషి అన్ని రంగాలలో అభివృద్ధి పధంలో సాగుతున్నాడు, కానీ నేటి సమాజంలో మానవీయ విలువలు, ఆత్మీయత కనుమరుగవు తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమై బంధాలు, అనుబంధాలు పూర్తిగా దెబ్బతిని కుటుంబ. వ్యవస్థ నేడు అట్టడుగు స్థాయికి చేరింది.ఈ విపత్కర పరిస్థితిని మార్చగ లిగేది మనుషుల్లో చైతన్యం తెచ్చేది సాహిత్యం మాత్రమే అని చెప్పవచ్చు.
సమాజంలో మార్పు కోసం తపించే రచయిత అక్షరాలు అవినీతిని అంతం చేసే బాణాలుగా ఉండాలి.. శిథిలావస్థకు చేరిన మానవ విలువలకు సజీవనిలా ఉండాలి, అరాచకాన్ని అన్యాయాన్ని నిగ్గదీసి ప్రశ్నించేవిగా ఉండాలి, చివరకు ఆ రచన ముఖ్య ఉద్దేశ్యం ఏదో ఒక రూపంలో సమాజంలో చైతన్యం తీసుకువచ్చి అంతరించిపోతున్న అను బంధాలను ఆత్మీయ పరిమళాల వాసనను రేపటి తరాల వారికి అందించేదిగా ఉండాలి. ఇలా సమాజంలో మార్పు కోసం శ్రీమతి రమాదేవి బాలబోయిన గారు రచించిన లి’’ప్రాణం వాసనలి ‘‘అనే పుస్తకం ఎంతగానో సహక రిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ప్రాణం వాసన అనే కవితా సంపుటిలో 69 కవితలు ఉన్నాయి, ఇందులో ప్రతి కవిత దేనికదే ప్రత్యేకం, ప్రతి కవితలోనూ మానవీయ కోణం సమాజహితం దాగి ఉన్నాయి మన బాధ్యతను గుర్తు చేస్తూ వ్యక్తిత్వ వికాసాన్ని మానవీయ విలువలు పంచాయి రమాదేవి గారి కవితలు.
తెలంగాణ మాండలికంలో కవితలు రాయడం అదీ సరళంగా అందరికీ అర్థమయ్యే విధంగా భావవ్యక్తీకరణ జరగడంతో శ్రీమతి రమాదేవి గారి కవిత్వం చరిత్రలో మహాకవుల సరసన నిలుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.


రమాదేవి గారు ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ విధి నిర్వహణలో ఎంతో మంది పిల్లలను ఆదర్శంగా తీర్చిదిద్దుతూ.. ప్రవృత్తిగా రచనలు చేయడంతో వారు సమాజాన్ని కవితలతో చైతన్యవంతం చేస్తూ తద్వారా సమాజ సేవ చేస్తున్నారు.
ప్రాణం వాసన లోని కొన్ని కవితలు పరిశీలించి చూస్తే వాటి గొప్పతనం మనకు అర్థము అవుతుంది, కవితా శీర్షికలు కూడా చాలా వైవిధ్యంగా ఉన్నాయి.
ఉదాహరణకు… మనుగడ కోసం పోరాటం,
ప్రాణం వాసన,
యాదికున్నదా బిడ్డా..!,
ఆమె ఉలిక్కిపడింది,నే ‘‘బాల’’ నోయి, బతుకు రంగోలి
ముట్టుకోకు, అన్వేషిత,
మనసు లేని లోకం చెవులకు కళ్ళున్నాయా..!
మొదలైన ఎన్నో కవితల శీర్షికలు అద్భుతంగా వైవిధ్యభరితంగా ఉన్నాయి.
ప్రతి కవిత దేనికదే ప్రత్యేకంగా అందమైన కవితల పూలగుత్తి లాగా కనిపిస్తోంది రమాదేవి గారి లిప్రాణం వాసనలి కవితా సంపుటి.
అందులో లిప్రాణం వాసనలి అనే కవితలో
‘‘గీ దునియాల
మానవత్వం మర్శినోల్ల కాడ
పీనుగ కంపు తప్ప
ప్రాణం వాసన గొడ్తాలేదు..!!
ఈ కవితలో అర్థం హృదయాన్ని తాకుతుంది..స్వార్థం నిండిన మనిషి మనసుకి ఈ కవిత కర్తవ్యబోధన చేస్తుంది… నేటి మనిషి మనస్తత్వానికి అద్దం పడుతుంది ఈ కవిత,
మానవత్వం లేని వారికి శవం వాసనే కనిపిస్తుంది కానీ వారికి ప్రాణం వాసన అర్థం తెలియదు అనడం ఎంతో బాగుంది ఇందులోని తెలంగాణ మాండలికం లోని భాష, కవితా వస్తువు, భావవ్యక్తీకరణ, శిల్పం ఎత్తుగడ, ముగింపు ఎంతో ఆదర్శంగా
ఉంది.
మరో కవిత
‘‘అమ్మా నొప్పీ..’’ ఇందులో అమాయకపు అత్యాచార బాధితురాలి హృదయ వేదనను వర్ణించిన తీరు ఎంతో ఆదర్శవంతంగా ఉంది.
మరో చక్కని కవిత లికవిత్వపు పుట్టుకలి ఇందులో కవిత్వం
ఎలా ఆవిష్కరణ జరుగుతుందో తెలిపారు కవితలో ఈ క్రింది వరుసలు పరిశీలిస్తే రచయిత్రి యొక్క ప్రతిభ చెప్పకనే తెలుస్తుంది
‘‘కడుపు మండితే
కడుపు ఎండితే
కడుపు నిండితే
కవిత్వం పుడుతుంది’’
ఈ కవిత చదివితే శ్రీ శ్రీ.. తిలక్‍ గారి కవితలు చదివిన భావన కలుగుతుంది.
ఎన్నో కవితలు చాలా బాగున్నాయి ముఖ్యంగా… చితి నెక్కిన బాల్యం… జ్వలిత దేహం, స్నానం పూర్తి అయ్యింది…
మొదలైన కవితలు బాగున్నాయి.
మట్టి వాసనలి అనే కవితలో జన్మభూమి పై మమకారాన్ని ఆత్మీయతను మట్టి వాసన జ్ఞాపకాలతో చిన్నప్పటి సంగతులను ముడిపెట్టి చక్కని వర్ణనలతో వివరించిన తీరు బాగుంది.
ఈ కవితలో…
‘‘ఎన్ని జ్ఞాపకాలు ఉంటే ఏం లాభం..
ఈ నగరాన బతుకు బందీ అయ్యిందిలి
ఈ కాంక్రీటు జంగల్ల ప్రేమ కరువైంది.’’
అంటారు.. కవయిత్రి దీనిలో నేటి నగరీకరణ సంస్కృతి వల్ల మన పల్లెసీమ యొక్క మాధుర్యాన్ని ఏవిధంగా కోల్పోతున్నామో వివరిస్తూ పట్నంలో యాంత్రిక జీవనంలో ప్రేమ కరువైంది అంటూ ఆవేదనతో కవిత మలిచారు,
మరొక ఉత్తమ కవిత ‘అన్వేషిత’
ఇందులో థర్డ్ జెండర్‍ వారి గురించి వారి మనసులోని భావాలు సంఘర్షణ వివరిస్తూ గొప్పగా కవిత్వీకరించారు.
రమాదేవి గారి ‘‘ప్రాణం వాసన’’లో
మనల్ని సన్మార్గంలో పెట్టే మంచి కవితలు, మహిళల చైతన్యం. పిల్లల బాధ్యత.. సామాజిక స్పృహ, యువతకు ప్రేరణ కలిగించేవి. ఎన్నో మంచి కవితలు ఉన్నాయి. మొత్తానికి ప్రాణం వాసన అనే పుస్తకం ప్రతీ ఒక్కరూ చడవదగిన ఉత్తమ పుస్తకం అనడంలో ఎటువంటి సందేహం లేదు, ప్రతి కవిత దేనికదే ప్రత్యేకం ప్రతి కవితలోనూ కవితా వస్తువు ఆవిష్కరణ, ఎత్తుగడ, ప్రారంభం, ముగింపు, పదబంధాల అల్లిక, భావవ్యక్తీకరణ మొదలైన అంశాలన్నింటికీ రచయిత్రి చక్కగా న్యాయం చేశారు నా అభిప్రాయం ప్రకారం ప్రాణం వాసన అనే పుస్తకం సమాజంలో చైతన్యపు సువాసన తీసుకు రాగలదు. ఈ పుస్తకం చరిత్రలో నిలిచిపోతుంది.


ప్రాణం వాసన (కవిత్వం) రచన : రమాదేవి బాలబోయిన,
ప్రచురణ : మృదువిరి పబ్లికేషన్స్, వెల : 100, పేజీలు : 120,
ప్రతులకు : ఇ.నెం.3-34/1/సి, బృందావన కాలనీ-1, గోపాలపురం, హన్మకొండ, వరంగల్‍, ఫోన్‍ : 7893261262


-వినాయకం ప్రకాష్‍,
8142512219

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *