ఆరోగ్యాన్నిచ్చే ఆహారం
‘‘ఆకలి వేయడం, తినాలని అనిపించడం రెండూ వేరు వేరు’’ అన్నారు డా.ఎన్.ఆర్.రావుగారు, కర్నూలు మెడికల్ కాలేజీ, విశ్రాంత సూపరింటెండెంటు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి, ఒక ప్రసంగంలో. మెదడులో ‘ఆహారం తీసుకోవాలి’ అనే ఒక ఇష్టాన్ని కలుగచేసే కేంద్రం ఉంటుంది. దానినే ఎపెటైట్ సెంటర్ అంటారు. మానసికంగా అలజడి, క్రుంగుబాటు, కలత, ఒత్తిడి ఇవన్నీ ఆ వ్యక్తి ఆహారం తీసుకునే కోరికపై ప్రభావం చూపిస్తాయి. ఇవేకాక అత్యంత ప్రధమ దశలో ఉన్న కేన్సర్ నుంచి ఉత్పన్నమయే కొన్ని మూలకాల …