Day: May 1, 2020

మాణిక్య మహాప్రభువు ‘మహబూబ్‍ అలీ పాషా’

నయాపూల్‍ దాటాక ఎడమవైపున్న నాయబ్‍ హోటల్‍ పక్క సందులోకి మళ్లితే చత్తాబజార్‍ వస్తుంది. అక్కడి సిటి సివిల్‍ కోర్టు వెనక భాగాన ఉన్నదే పురానీ హవేలీ. ఐదవ కులీ కుతుబ్‍ షాకు (1580-1612) ప్రధానమంత్రిగా పనిచేసిన మీర్‍ మోమిన్‍ అస్త్రాబాదీ నివాసమే ఈ హవేలీ. ఇది అవతలి వారికి కనబడకుండా ఉండటం కోసం దీని చుట్టూ ఒక మైలు దూరం వర్తులాకారంలో ఎత్తైన ప్రహారీ గోడను నిర్మించారు. రెండవ నిజాం మీర్‍ అలీ ఖాన్‍ తన కుమారుడు, …

మాణిక్య మహాప్రభువు ‘మహబూబ్‍ అలీ పాషా’ Read More »

ప్రకృతి మానవ ధాష్టీకాన్ని భరించలేకపోతుంది : డాక్టర్‍ కలపాలా బాబురావు

విశ్రాంత సీనియర్‍ శాస్త్రవేత్త డాక్టర్‍ కలపాలా బాబురావుగారితో కోవిడ్‍-19పై ప్రత్యేక ఇంటర్వ్యూ గ్రామీణ భారతదేశానికి సమాచార మార్పులతో వాతావరణ వ్యతిరేక మార్పులపై పోరాటం చేస్తున్న విశ్రాంత సీనియర్‍ శాస్త్రవేత్త డాక్టర్‍ కలపాలా బాబురావు ‘దక్కన్‍ న్యూస్‍ ఛానెల్‍’కు ఏప్రిల్‍ నెలలో ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ. ఇటువంటి విపత్కర స్థితికి కారణాలేమిటి?ఇది ముందు నుంచి ఊహించిందే. ఇటువంటి ప్రమాదాలు వస్తాయని హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. 2009లో డబ్ల్యూహెచ్‍ఓ కూడా యిక ముందు విషమహమ్మారులు పాండమిక్స్ వచ్చే అవకాశాలున్నాయని, ప్రభుత్వాలు ఎలర్ట్గా వుండాలనీ చెప్పింది. తరువాత …

ప్రకృతి మానవ ధాష్టీకాన్ని భరించలేకపోతుంది : డాక్టర్‍ కలపాలా బాబురావు Read More »

మనల్ని మనం ప్రేమించుకుందాం..

ఎవరూ ఎవర్నీ ప్రేమించరు, తమని తాము ప్రేమించుకుంటారు. తమ అవసరాలను తీర్చే, తమకు ఆనందాన్నిచ్చే వాటిని ప్రేమిస్తారు. అవి వస్తువులు కావొచ్చు, మనుషులు కావొచ్చు, ఆలోచనలు కూడా కావొచ్చు. వాటిని మాత్రమే ప్రేమిస్తారు. కాని ఇవాళ ఆమాట సత్యంగా కనిపించడంలేదు. గత మూడు నాలుగు నెలలుగా ప్రపంచం మొత్తం కోవిడ్‍-19 వల్ల విపత్కరస్థితిని ఎదుర్కొంటోంది. మానవ జీవితం అన్ని విధాలుగా అన్ని రంగాలలో అల్లకల్లోల మవుతోంది. మనిషి తనను తాను నిజంగా ప్రేమించుకో గలిగితే తమ ఉనికికి, …

మనల్ని మనం ప్రేమించుకుందాం.. Read More »

ఒద్దిరాజు సోదరులు

తెలంగాణలో ఆనాడు, సంస్కరణ భావ విజృంభణతో సాహిత్య వికాస చైతన్య దీప్తులు ప్రసరించిన ఒద్దిరాజు సోదరులు బహు భాషా కోవిదులు, సకల శాస్త్ర కళాకోవిదులు. ఒద్దిరాజు సీతారామ చంద్రరావు గారు, ఒద్దిరాజు రాఘవ రంగారావుగార్లు ఏడేళ్ళ వయసు తేడాతో ఒకే తల్లి గర్భాన జన్మించిన అన్నదమ్ములు. వీరిది వరంగల్‍ జిల్లా ఇనుగుర్తి గ్రామం. రంగనాయకమ్మ, వెంకటరామారావు గార్లు వీరి తల్లిదండ్రులు. అమ్మానాన్నల సంస్కారాన్ని, పాండిత్యాన్ని వారసత్వంగా తెచ్చుకున్న ఒద్దిరాజు సోదరులు దేహాలు వేరైనా ఆత్మలొక్కటేనన్నట్లు పెరిగారు. 1887 …

ఒద్దిరాజు సోదరులు Read More »

దళితోద్యమానికి మూలమలుపు కారంచేడు

ఉమ్మడి ఆంధప్రదేశ్‍ చరిత్రలో తెలుగుదేశం పార్టీ స్థాపన, అధికారంలోకి రావడం ఒక కీలక మలుపు. మొదటి సారిగా జనవరి 9, 1983 నాడు తొలి  కాంగ్రేసేతర  వ్యక్తిగా ఎన్టీరామారావు ఉమ్మడి ఆంధప్రదేశ్‍ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిండు. అంతకుముందూ కుల రాజకీయాలున్నప్పటికీ అవి అంత నగ్నంగా బయటికి రాలేదు. కమ్మ సామాజిక వర్గం నుంచి ఈయన తొలి ముఖ్యమంత్రి. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఎన్టీరామారావు చరిత్ర సృష్టించిండు. ఈయన రాష్ట్రమంతటా పర్యటించి ‘తెలుగువారి ఆత్మగౌరవం’ పరిరక్షణ పేరిట ప్రచారం చేసిండు. కాంగ్రెస్‍ పార్టీ అంతర్గత కలహాలు, గాడి తప్పిన సుదీర్ఘ …

దళితోద్యమానికి మూలమలుపు కారంచేడు Read More »

కాసుల గలగలల టంకశాల ‘సుల్తాన్‍ షాహీ’

శాంతి కపోతం ఆరడుగుల అందగాడుగా రూపం ఎత్తితే ఎట్లా ఉంటుంది? అచ్చం గులాం యాసీన్‍లా ఉంటుంది. గులాం యాసీన్‍ ఎవరూ అని అడుగుతున్నారా? కొంచెం ఓపిక పట్టండి ఆ కథ ఈ కథ చివర్లో వినిపిస్తాను. మొగల్‍పురాలో రిఫాయేఆం స్కూలు దాటి అక్కన్న మాదన్నల గుడి ముందు నుండి నడుచుకుంటూపోతే కుడివైపున మీర్‍ మోమిన్‍ దాయెర, మీర్‍జుమ్లా తలాబ్‍ (చెరువు) -ఎడమవైపు సుల్తాన్‍షాహీ బస్తీ ఉంటుంది. గాన సుజనులారా ప్రవేశించండి సుల్తాన్‍ షాహీలోకి! కుతుబ్‍షాహీల కాలంలో ఇచ్చోటనే కదా టంకశాల ఉండేది. అందులో రాజముద్రలు వేయబడిన టంకములను …

కాసుల గలగలల టంకశాల ‘సుల్తాన్‍ షాహీ’ Read More »

ఆవరణ వ్యవస్థలు – మానవ వ్యవస్థలు – పరస్పర సంబంధాలు

 “We need an earth – wisdom revolution, not an infromation revolution”  పర్యావరణం గురించి మూడు దశాబ్దాలుగా అధ్యయనం చేసిన శాస్త్రవేత్త చెప్పిన మాట ఇది. సమాచార విప్లవం కాదు కావలసింది, భూవిజ్ఞాన విప్లవం అని అనటంలోనే శాస్త్రవేత్త సూచించదలచిన అర్ధం, ప్రాధాన్యం ఏమిటో తెలుస్తుంది. పర్యావరణ పరంగా తలెత్తిన సమస్యలు, సంక్షోభాల గురించి ఐదారు దశాబ్దాలుగా వివిధ అను శాసనాలలో అధ్యయనాలు సమస్యను వివరించి, విశ్లేషించటమే కాకుండా పరిమితులకు లోబడి పరిష్కారాలను సూచిస్తున్నాయి. సూచిత పరిష్కారాల …

ఆవరణ వ్యవస్థలు – మానవ వ్యవస్థలు – పరస్పర సంబంధాలు Read More »

అవురవాణి (అవిరువాణ్డి) శాసనం

నల్లగొండ జిల్లా, నార్కెట్‍ పల్లి మండలం అవురవాణి గ్రామశాసనం:రాజ్యం : పశ్చిమ(కళ్యాణి)చాళుక్యులురాజుః త్రిభువనమల్ల విక్రమాదిత్యుడుశాసన కాలం: శక సం.1016, క్రీ.శ.1094 సం.సూర్యగ్రహణ సమయంశాసన లిపి: తెలుగు,శాసనభాష: తెలుగుశాసనోద్దేశం: సామంతరాజు, మహామండలేశ్వరుడుః మల్లయరాజులు దానశాసనంఅవురవాణి గ్రామం తూర్పు శివారు, కల్వర్టు దగ్గరలో 9 అంగుళాల వెడల్పు, 9అడుగుల ఎత్తైన నల్లశానపు రాతిస్తంభం శాసనపాఠం:మొదటివైపుః(శాసనప్రారంభంలో శివలింగం, సూర్యచంద్రులు, ఆవు, దూడల బొమ్మలున్నాయి.)స్వస్తి సమధిగత ప0చమహాశబ్ద మహా మణ్డలేశ్వర…………………………….చాళెక్యాభజిరణ సుజనమనోరంజనం శత్రుమళభంజన దినానాత మనోభివాంచృనఃవరాహలాంఛన నుమాది సమస్త ప్రశస్తిసహితం శ్రీమన్మహామణ్డలేశ్వరజిమల్లయరాజులుజిసక వర్ష …

అవురవాణి (అవిరువాణ్డి) శాసనం Read More »

ఇంటికాడ పిలజెల్ల ఎట్ల ఉండ్రోనని ఎక్కిళ్లుబెట్టిన పదాలు దేశదేశాలను కదిలించిన ఆదేశ్‍ రవి అక్షరాలు

ఎవరీ ఆదేశ్‍ రవి? ఎక్కడో విన్నట్టు, ఇంకెక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదు. అవును మీ అనుమానం నిజమే. కవిగా, గాయకునిగా, సౌండ్‍ ఇంజనీర్‍గా, సినీ సంగీత దర్శకునిగా, మాటల రచయితగా, నటుడిగా, సహదర్శకుడిగా సినిమాకు సంబంధించి అనేక విభాగాలో అవసరానికి అనుగుణంగా ఆయా పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయగల దిట్ట. పదిమందిని మెప్పించే సామర్థ్యం కలిగినవాడు. ప్రస్తుత ‘కరోనా’ పరిస్థితులలో వలసకూలీల వెతలను గానం చేసిన ఆదేశ్‍ రవి ఒక్కసారిగా అందరిదృష్టిని ఆకర్శించిండు. రవి తండ్రి పేరెన్నికగన్న …

ఇంటికాడ పిలజెల్ల ఎట్ల ఉండ్రోనని ఎక్కిళ్లుబెట్టిన పదాలు దేశదేశాలను కదిలించిన ఆదేశ్‍ రవి అక్షరాలు Read More »

ప్రపంచం ముంగిట సరికొత్త సవాలు… కరోనా వైరస్‍…!!!

ఏవైనా రెండు దేశాల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా ప్రపంచమంతా రెండు సమూహాలుగా విడిపోయి ప్రపంచ యుద్ధాలు జరిగిన సంగతి మనందరికీ తెలుసు. కానీ కంటికి కనిపించని కరోనా వైరస్‍ అనే సూక్ష్మక్రిమిపై ప్రపంచంలోని దేశాలన్నీ తమ మధ్య నున్న బేధాభిప్రాయాలను విడనాడి కలిసికట్టుగా యుద్ధం చేయడం మాత్రం ఇప్పుడే చూస్తున్నామని చెప్పవచ్చు. గతకొన్ని మాసాలుగా భూమండలంలోని మానవాళికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ‘కరోనావైరస్‍ సృష్టించిన భీభత్సం వర్ణనాతీతం. ప్రపంచంలో అగ్రరాజ్యంగా భాసిల్లుత్తున్న అమెరికా సైతం …

ప్రపంచం ముంగిట సరికొత్త సవాలు… కరోనా వైరస్‍…!!! Read More »