భారతదేశం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది. ఈ నేప థ్యంలో అధిక దిగుబడులు సాధించే ప్రయత్నంలో విచక్షణారహి తంగా పురుగుమందులను వాడటం వల్ల వాతావరణ సమతుల్యం దెబ్బతింటుంది. పంటలకు అయ్యే ఖర్చు ఎక్కువై రైతుల ఆత్మ హత్యలకు దారి తీస్తాయి. అందువల్ల మన పొలం దగ్గరే జీవ సంబంధిత రసాయనాలు తయారు చేసుకోవడం వల్ల ఖర్చు తగ్గిం చడమే కాకుండా పర్యావరణాన్ని కూడా కాపాడుకోగలుతాం.
ఆవుపేడ, మూత్ర కషాయం:
- మొదటగా 5 కిలోల ఆవుపేడ, 5 లీటర్ల ఆవు మూత్రం మిశ్రమాన్ని 5 లీటర్ల నీటిలో కలిపి నాలుగు రోజుల వరకు మూత పెట్టి ఒక బకెట్లో అలగే ఉంచాలి
- ఆ తర్వాత దానిని వడపోసి 100 గ్రా. లైమ్ పౌడరును క లపాలి
- పై మిశ్రమానికి 80 లీ. నీటిని కలిపితే ఒక ఎకరాకు సరి పడా ద్రావణం తయారవుతుంది.
- ఈ ద్రావణానికి పచ్చ పురుగు, లిద్దె పురుగు గు డ్లను నాశనం చేసే శక్తి ఉంటుంది. పంటలకు వచ్చే కొన్ని వ్యాధుల బారినుంచి కూడా కాపాడుతుంది.
అల్లం, పచ్చి మిర్చి, వెల్లుల్లి మిశ్రమం
- మొదటగా 18 గ్రా. వెల్లుల్లిని తీసుకొని, పై పొరను వేరుచేసి మెత్తగా నూరుకోవాలి. ఆ తరువాత 9 గ్రా।। పచ్చిమిర్చి + 9 గ్రా।। అల్లంను కలిపి మెత్తగా నూరాలి. పై మి శ్రమాలను ఒక లీటరు నీటిలో కలపాలి. ఆ తర్వాత ఒక బట్ట ద్వారా మిశ్రమాన్ని వడపోయాలి.
- 500 మి.లీ. వడపోయగా వచ్చిన ద్రావణానికి 100 మి. లీ. సబ్బు పొడిని కలిపి పంటల్లో పిచికారి చేయాలి.
- ఇలా పిచికారి చేయడం వల్ల పేనుబంక, దీపపు పురుగు, పిండి పుగురు, తెల్ల దోమలను నివారించుకోవచ్చు.
వేప విత్తన కషాఅయ ద్రావణం (5 శాతం)
- మొదటగా 500 గ్రా।। ఎండిన వేప గింజలను ఏరి మెత్తగా నూరి పొడిగా చేసుకోవాలి. ఆ తర్వాత 50 గ్రా।। పొడిని ఒక మప్లిన్ బట్టలో తీసుకొని 400-500 మి.లీ. నీటిలో ఒక రాత్రి మొత్తం నాబెట్టాలి.
- మరుసటి రోజు మప్లిన్ బట్టను సరిగా పిండి, వచ్చిన కషా యాన్ని మరి కొన్ని నీళ్ళు కలిపి ఒక లీటరు దాకా ఉం డేలా చేసుకోవాలి.
- ఆ తర్వాత 2గ్రా।। సబ్బు పొడిని కలిపితే మనకు 5 శాతం వే విత్తన కషాయం ద్రావణం తయారవుతుంది.
- ఈ మోతాదులో పంటట్లో పిచికారి చేస్తే లద్దెపురుగు, పచ్చ పురుగు, ఆకు ముడత పురుగు, నామాల పురుగు, రసం పీల్చే పురుగులను అరికడుతుంది.
ఎన్.పి.వి. ద్రావణం
- మొదట 900 ఎన్పవివి బారినపడ్డ పచ్చపురుగు లేదా 200 లద్దెపురుగలను కుంటల నుంచి ఏరి ఒక దగ్గర వుంచాలి.
- ఆ తర్వాత వాటిని మెత్తగా నూరి ఒక పలుచని బట్ట ద్వార• వడబోఆఅయలి.
- వడపోయగా వచ్చిన ద్రావానాన్ని 100 లీ. నీటిలో కలపాఇ. ఆ తర్వాత 100 గ్రా।। రాబిన్ బ్లూ పొడిని కలపాలి.
- పైన తయారు చేసుకున్న ద్రావణాన్ని సాయంత్రం వేళలో మాత్రమే పిచికారి చేయాలి.
- పిచికారీ చేసిన 2 నుంచి 5 రోజుల్లో పచ్చ పురుగులు, లద్దె పురుగులు వ్యాధి బారిన బడిన చెట్ల కొమ్మల చివర్లకు చేరి తన వెనకాటి కాళ్ళతో వేలాడి చనిపోతాయి.
పొగాకు డికాక్షన్
- ఒక కిలో పొగాకు పొడిని 10 లీటర్ల నీటిలో కలిపి అరగంట సేపు వేడి చేయాలి.
- ఆ తర్వాత చల్లార్చి మప్లిన్ బట్ట గుండా వడపోయాలి
- వడపోయగా వచ్చిన ద్రావణానికి 2 గ్రా।7 / ఒక లీటరుకు కలిపి 30 నుంచి 100 టీటర్ల వరకు పలుచగా చేసు కోవచ్చు.
- పై ద్రావణాన్ని పంటల్లో పిచికారి చేయడం వల్ల రసం పీల్చే పురుగుల బారి నుంచి కాపాడవచ్చు.
- కాని పొగాకు ద్రావణాన్ని ఒకసారి మాత్రమే పిచికారి చే యాలి. ఎక్కువగా పిచికారి చేస్తే ఆ ద్రావణం మిత్ర పురు గులను కూడా అది నాశనం చేసే అవకాశం ఉంది.
-వి. శ్రీరమ్య ఎం.ఎస్.సి (సాయిల్సైన్స్),
టి.జయప్రకాష్ ఎంఎస్సి జనటిక్స్ & ప్లాంట్ బ్రీడింగ్,
కే మమత, ఎంఎస్సి (అగ్రానమి)
వ్యవసాయ కళాశాల, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్