సహజ వనరులను సహజంగా ఎదగనిద్దాం!
కరోనా ఏ రోజు కారోజు విజృంభిస్తున్నప్పటికీ ఉత్పాదక విధుల నిర్వహణ ఏదో ఒక పరిమితిలోనైనా పునఃప్రారంభమైంది. లాక్‍డౌన్ సడలింపులు మొదలయ్యాయి. భయభయంగానైనా సామాజిక జన జీవితం దారిలో పడుతున్నది. కరోనాతో సహజీవనమంటే ఇదే. కరోనా వల్ల వచ్చిన ఇబ్బందులు, సమస్యలు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ మనకి ఒక కొత్త జీవన విధానాన్ని అలవాటు చేసింది. దీనివల్ల భౌతిక, ఆంతరంగిక పరిణామాలతో పాటు వాతావరణంలో వచ్చిన మార్పులు హర్షనీయాలే. ముఖ్యంగా వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం తగ్గాయి. …