బాలచెలిమి గ్రంథాలయంతో సెలవుల సద్వినియోగం

నందిమేడారం గ్రామం, ధర్మారం మండలం, పెద్దపల్లి జిల్లా

చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ సొసైటీ హైదరాబాద్‍ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాల చెలిమి గ్రంథాలయం గత మార్చి నెలలో పెద్దపెల్లి జిల్లా, ధర్మారం మండలం,  నందిమేడారం గ్రామంలో ఏర్పాటు చేయడమైంది. జిల్లా పరిషత్‍ ఉన్నత పాఠశాలలో ప్రారంభించిన ఈ గ్రంథాలయం సెలవుల్లో తమ విరామ కాల సద్వినియోగానికి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.


అభిప్రాయాలు..


చారిత్రక ప్రాధాన్యం కలిగిన మా ఊరు (నంది మేడారం)లో బాల చెలిమి గ్రంథాలయం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఎన్నో వేల రూపాయల విలువ చేసే పుస్తకాలను మా పాఠశాలకు అందజేయడం మా విద్యార్థులకు ఎంతో ఉపయోగం. ఈ సెలవులలో కూడా ఉపాధ్యాయులు, విద్యార్థులకు గ్రంథాలయ పుస్తకాలు ఇచ్చి ఇంటివద్ద చదువుకునే విధంగా ప్రోత్సహించారు. బాల చెలిమి గ్రంథాలయ చైర్మన్‍కు మా ప్రత్యేక ధన్యవాదాలు. -ఏ. శ్రీనివాస్‍. ఏస్‍.ఎం.సి. చైర్మన్‍, జడ్‍.పి.హెచ్‍.ఎప్‍. నంది మేడారం.


వేసవి కాలము ఎండలు మరియు కరోనా వైరస్‍ దృష్ట్యా విద్యార్థులు తమ సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలనే మంచి ఉద్దేషముతో మా పాఠశాల విద్యార్థులకు బాలచెలిమి గ్రంథాలయ పుస్తకాలని వారి ఇంటికిచ్చి చదువుకోవాలని ప్రోత్సహించడము జరిగింది. పాఠశాల దరిదాపులలో ఉన్న దాదాపు 40 మంది 8, 9, 10 తరగతుల పిల్లలకు పుస్తకాలు అందజేయడము జరిగింది. పుస్తకాలు చదవడము ద్వారా జ్ఞానాన్ని పెంచుకోవడముతో పాటుగా నీతిని, సభ్యత, సంస్కృతిని అలవర్చుకోవచ్చు. బాలచెలిమి పుస్తకాలలో చాలా విలువైన విషయలున్నాయి. వాటిని చదివి విద్యార్థులు తమ భవిష్యత్తుకు మంచి పునాది వేసుకుంటారని ఆశిస్తున్నాను. బాలచెలిమి గ్రంథాలయాల వ్యవస్థాపకులు శ్రీ వేదకుమార్‍ గారికి, నందిమేడారం గ్రామస్థులు జస్టిస్‍ శ్రీ నవీన్‍రావు గారు మా పాఠశాలలో గ్రంథాలయం ఏర్పాటు చేయమని సలహా ఇచ్చిన వీరికి మా పాఠశాల తరఫున ధన్యవాదములు. వేదకుమార్‍గారు మంచి మనసుతో మాకు గ్రంధాలయాన్ని కేటాయించినందుకు అది మా విద్యార్థులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేటట్టు చూస్తానని మీ కృషికి మావంతు సంపూర్ణ సహాయ సహకారాలు అందచేస్తామని హామీ ఇస్తున్నాము. -ముహమ్మద్‍ ఉమర్‍ అలీ, ప్రధానోపాధ్యాయులు, ఉన్నత పాఠశాల నంది మేడారం, ధర్మారం మండలం, పెద్దపల్లి జిల్లా.


సెలవులలో మాకు గ్రంథాలయ పుస్తకాలు ఇచ్చినందుకు చాలా సంతోషముగా ఉంది. ఇంటివద్ద ఖాళీగా ఉండే బదులు పుస్తకాలు చదివి ఎన్నో తెలియని విషయాలు తెలుసుకోవచ్చు. సమయాన్ని సద్వినియోగము చేసుకోవచ్చు. మేము చదివి మా కుటుంబసభ్యులకు కూడా విషయాన్ని చెప్పి చర్చించి అవగాహన చేసుకుంటాము. ఇట్టి పుస్తకాలు మాకు అందచేసిన మా హెడ్మాస్టర్‍ గారికి బాలచెలిమి నిర్వహకులకు ధన్యవాదములు. – సాహిత్య రాసూరి, 8వ తరగతి


మా పాఠశాలలో ఏర్పాటు చేసిన బాలచెలిమి గ్రంథాలయం ద్వారా మేము ఎన్నో పుస్తకాలను చదివే ఆవకాశం కలిగింది. సెలవులలో కూడా మా ప్రధానోపాధ్యాయులు మాకు ఈ పుస్తకాలను అందజేసి ఇంటి వద్ద చదువుకొమ్మని చెప్పారు. దీనితో మేము కరోనా సమయంలో బయటికి వెళ్లకుండా ఇంటిలోనే ఉండి చదువుకొని అనేక విషయాలను తెలుసుకొనే అవకాశం కలిగింది. బాల చెలిమి గ్రంథాలయ నిర్వాహకులకు మరియు మా ప్రధానోపాధ్యాయులకు ధన్యవాదాలు. -రాజ్‍ కుమార్‍, 9వ తరగతి.


మా పాఠశాలలో చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ వారు ఏర్పాటు చేసిన బాల చెలిమి గ్రంథాలయం విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది. ఈ పుస్తకాలను చదవడం ద్వారా విద్యార్థులలో సృజనాత్మక నైపుణ్యాలు వెల్లివిరుస్తాయి. ఈ పుస్తకాలే కాకుండా ప్రతి నెల మ్యాగజైన్‍ లు కూడా నిర్వహకులు పంపిస్తామనడం మాకు చాలా సంతోషదాయకం. బాలచెలిమి గ్రంథాలయ చైర్మన్‍ శ్రీ మణికొండ వేదకుమార్‍ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. -అరుణ, జీవశాస్త్ర ఉపాధ్యాయులు


పుస్తకాలు విలువైన సమాచారాన్ని విషయ జ్ఞానాన్ని అందజేస్తాయి. విద్యార్థులు సన్మార్గంలో నడవడానికి పుస్తక పఠనం ఎంతో దోహదపడుతుంది. మా పాఠశాలలో బాలచెలిమి గ్రంథాలయం ఏర్పాటు చేయడం విద్యార్థులకు ఒక గొప్ప అదృష్టమని చెప్పాలి. ఈ పుస్తకాలను మా విద్యార్థులు చాలా చక్కగా వినియోగించు కుంటున్నారు. బాలచెలిమి గ్రంథాలయాల చైర్మన్‍ శ్రీ వేదకుమార్‍ గారు, కన్వీనర్‍ గరిపల్లి అశోక్‍గారు, విద్యార్థులకు గ్రంథాలయాల ఏర్పాటు ద్వారా, వివిధ రచనల ద్వారా, పుస్తక సంకలనాల ద్వారా చేస్తున్న సేవలు అమూల్యమైనవి. వారికి మా పాఠశాల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు.  -అనిత, తెలుగు ఉపాధ్యాయురాలు.బాల చెలిమి గ్రంథాలయ నిర్వాహకులు, జిల్లా పరిషత్‍ ఉన్నత పాఠశాల, నందిమేడారం

– కట్టా ప్రభాకర్‍
ఎ : 8106721111

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *