చేనుకు చేవ – రైతుకు రొక్కం పచ్చిరొట్ట ఎరువులు

ఆధునిక వ్యవసాయంలో పెట్టుబడులు పెరుగుతున్న, పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా దిగుబడులు సాధించలేక పోతున్నారు మన రైతన్నలు. దీనికి ప్రధాన కారణం ఎరువుల యాజమాన్యం రసాయన ఎరువుల వాడకం వలన భూమి నిస్సార మౌవుతున్నాయి. పంటలో రసాయన అవశేషాలు మిగులుతున్నాయి. తద్వారా పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ఈ సమస్యను అధిగమించాలి అంటే ఎరువులను సమగ్రంగా అందించాలి. రసాయన సేంద్రియ ఎరువులను మేళవించి ఉపయోగించుకోవాలి. 60 నుంచి 70 శాతం పోషకాలు సేంద్రియ ఎరువులు నుంచి వచ్చేటట్టు జాగ్రత్త పడాలి. సేంద్రియ ఎరువులలో ముఖ్యమైనవి, అతి తక్కువ ఖర్చుతో రైతుకు, భూమికి, అమిత ప్రయోజనం కలిగింగే పచ్చిరొట్ట ఎరువులు.


పచ్చిరొట్ట ఎరువులతో బహుళ ప్రయోజనాలు
నేల భూభౌతిక లక్షణాలను మెరుగుపరచటానికి తోడ్పడతాయి. నేలలో సేంద్రి పదార్థం వేయటం వల్ల సూక్ష్మ జీవులు వృద్ధి చెంది, జీవ రసాయనిక చర్యల వలన నేల సారం పెరిగి తద్వారా దిగుబడులు పెరుగతాయి. నేలలో లభ్యం కాని రూపంలో ఉన్న పోషకాలను లభ్యరూపంలోకి మారుస్తాయి. కలుపు మొక్కలు పెరుగుదలను నివారించవచ్చును.


పచ్చి రొట్ట పైరులు (జీలుగు) వేసినప్పుడు వాటి వ్రేళ్ళు ఎక్కువ లోతుకు వెళ్ళడం వల్ల భూమి లోపలి పొరలలో నిక్షిప్తమైన అనేక పోషకాలను తెచ్చి లఖ్వ రూపంలో పంటలకు అందిస్తాయి. పప్పుజాతి పచ్చిరొట్ట ఎరువులు (మినుము, పెసర, పిల్లిపెసర, అలసందలు) వలన రైజోబియం అనే బాక్టిరియా గాలిలో నత్రజనిని వ్రేళ్ళ బోడిపెలలో నత్రజనిని స్థిరీకరిస్తాయి. భూమిలోని చౌడు లక్షణాలను తొలగించి (జీలుగ) భూసారాన్ని పెంచుతాయి. పచ్చిరొట్ట పైర్లు ఎరువులగానే కాకుండా పశువలు మేతగా కూడా ఉపయోగపడతాయి. ఉదా: జనము, పిల్లిపెసర. నీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకొనే సామర్థ్యాన్ని నేలకు ఆపాదిస్తాయి. రసాయనిక ఎరువుల ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చును.


పచ్చిరొట్ట ఎరువులు రెండు రకాలు
1) పచ్చి మొక్కల ఎరువులు 2) పచ్చి ఆకు ఎరువులు


పచ్చిమొక్కల ఎరువులు : విత్తనాలు జల్లుకుని భూమిలో కలియదున్నడం పచ్చి మొక్కల ఎరువులుగా వాడుకోదగ్గ మొక్కలు :
1) జీలుగ 2) జనుము 3) సీమ జీలుగు 4) పిల్లిపెసర 5) నీలి 6) అడినీలి / వెంపలి 7) అసలందలు 8) పెసర / మినము
పచ్చిరొట్ట మొక్కలుఉండవలసిన లక్షణాలు : అన్ని రకాల నేల్లో పెరగాలి తక్కువ రోజులలో ఎక్కువ పచ్చిరొట్టను ఇవ్వాలి. పీచు శాతం తక్కువ ఉండాలి.
నేలలో కలియదున్నినప్పుడు త్వరగా కుళ్ళి భూమిలో కలిసే స్వభావం ఉండాలి. పచ్చి రొట్ట పంటల వేర్లు భూమిలో లోతుగా పోయేటట్లు ఉండాలి. త్వరగా పెరిగి కలుపు పెరుగుదలను అరికట్టేదిగా ఉండాలి. పప్పు జాతికి చెందిన పచ్చి రొట్ట అయితే గాలిలో నత్రజని స్థిరీకరించి నేల సారాన్ని పెంచుతుంది.


పచ్చిరొట్ట మొక్కల గుణాలు :
1) జీలుగ, సీమజీలుగ : చౌడు భూముల్లో, వరి పండించే భూముల్లో వీటిని వాడుకొనటానికి అనువుగా ఉంటాయి.
విత్తన మోతాదు: ఎకరాకు 10-12 కిలోలు
లభించే పచ్చి రొట్ట : ఎకరాకు 10 టన్నులు
లభించే పచ్చి రొట్ట : ఎకరాకు 10 టన్నులు
లభించే పోషకాలు : టన్నుకు 6.65 కిలోల నత్రజని, 15. కి. భాస్వరం, 2 కి. పొటాష్‍.
2) జనుము : అన్ని రకాలు నేలల్లో సాగు చేయవచ్చు. పచ్చిరొట్టగా, పశువుల మేతగా ఉపయోగించవచ్చు.
విత్తన మోతాదు : ఎకరాకు 12-15 కి।।
లభించే పచ్చిరొట్ట : 5-6 టన్నులు ఎకరాకు
లభించే పోషకాలు : టన్నుకు 7.5 కి।। నత్రజని, 1కి।। భాస్వరం 66 కి।। పొటాష్‍
3) పిల్లి పెసర : దీనిని తేలిక మరియు బరువైన నేలల్లో సాగు చేయవచ్చు. చౌడు భూముల్లో సాగుకు పనికిరాదు. నీటి ఎద్దడని తట్టుకుంటుంది.
విత్తనమోతాదు: ఎకరాకు 8-10 కి।।
లభించే పచ్చిరొట్ట : 3-4 టన్నులు ఎకరాకు
లభించే పోషకాలు : 10-15 కి।। పొటాష్‍ 15-18 కి।। నత్రజని, 2-9 కి।। భాస్వరం,
4) పెసర / మినుము : తతేలికపాటి నేలలు, నల్లరేగడి నేలలకు అనువైనది.
విత్తనమోతాదు: 15-16 కి।। ఎకరాకు
లభించే పచ్చిరొట్ట : ఎకరాకు 3-4 ట।।
లభించే పోషకాలు : 5 కి।। పొటాష్‍ న్నుకు 77 కి।। నత్రజని, 2 కి।। భాస్వరం,
5) అలసందతేలికిపాటి ఎర్రనేలలో వేసుకోవచ్చు.
విత్తన మోతాదు : 14 -16 కి।। ఎకరాకు
లభించే పచ్చిరొట : ఎకరాకు 6 టన్నులు
లభించే పోషకాలు : 4-2కి నత్రజని, 9 కి।। భాస్వరం, 30 కి।। పొటాష్‍.
6) నీలి, వెంపంలి : ఇవి కలుపు మొక్కలుగా లభ్యమవుతాయి. మన చుట్టుపక్క ప్రదేశాలలో వీటిని పచ్చి రొట్ట ఎరువులుగా వాడుకోవచ్చు. ఎకరాకు 8 నుండి 10 కిలోల విత్తనం సరిపోతుంది. అన్ని రకాల నేలల్లో వేసుకోవచ్చు.


పచ్చి ఆకు ఎరువులు :
కొన్ని మొక్కల ఆకులలో పోషకా గుణాలు సమృద్ధిగా ఉంటాయి. అటువంటి మొక్కలను పొలం గట్ల మీద పెంచి కోసి, పొలంలో వేసి దమ్ముచేసిన 4-6 వారాలకు కుళ్ళి భూమిని సారవంతం చేస్తుంది. వార్షాధార (ప్రాంతాలలో (నీరు లభ్యంకాని) ప్రాంతాలలో వీటిని వాడుకోవచ్చును. పచ్చి ఆకు ఎరువులుగా వాడదగ్గ మొక్కలు : 1) గైరిసీడియా 2) కానుగ 3) సుబాబుల్‍ 4) జిల్లేడు 5) వేప 6) ఆజోల్లా


పచ్చిరొట్ట ఎరువులను వాడే పద్దతి : 
పచ్చిరొట్ట ఎరువులను పూతదశలో నేలలో కలియదన్నాలి. హరిత మొక్కల ఎరువులు లేదా హరిత ఎరువులు ప్రధాన పంట విత్తుటకు 15-20 రోజులు ముందు నేలలో కలియదున్నాలి. కలియదున్నే సమయంలో నేలలో తగినంత తేమ ఉండాలి. కలియదున్నేటప్పుడు తగినంత సూర్‍ ఫాస్పేట్‍ నేలపై వెదజల్లితే కుళ్లే పక్రియ వేగవంతమౌతుంది.


పచ్చిరొట్ట ఎరువుల సాగులో మెళుకువలు :

ప్రధాన పంట కోయగానే నేలలో మిగిలిన తేమను సద్వినియోగ పరచుకుని పచ్చి రొట్ట ఎరువులు విత్తుకోవాలి. తేమ చాలని ప్రాంతాలలో వేసవిలో దుక్కి దిన్ని తొలకరి వర్షాలు పడగానే విత్తుకోవాలి (వరి సాగు చేయు ప్రాంతాల్లో) వరి, చెరుకు పంటల సరళిలో రెండు పంటల మధ్య కాల వ్యవధిలో విత్తుకొని కలియదున్నవచ్చు (చెరుకు ఫిబ్రవరి), (వరి జూన్‍) 

పసుపు, కంద, చెరకు వంటి పంటల వరుసుల మధ్య పచ్చి రొట్ట పెంచి పూత సమయంలో కలియ దున్నవచ్చు. సాధారణంగా పచ్చిరొట్ట పైర్లు చల్లుకునేటప్పుడు అధిక మోతాదు విత్తనం ఉపయోగించిన మొక్కలు తక్కువ ఎత్తు పెరిగి రసవంతంగా ఉంటాయి. లేనిచో జీలుగ వంటి పచ్చి రొట్ట ఎరవులు మొక్క ఎత్తు పెరిగి కాండంలో పీచు ఏర్పడేందుకు ఎక్కువ సమయం పడుతుంది.


– బి. రాజ్యలక్ష్మి, బి.వి.ఎస్‍ కిరణ్‍
(ఎఎన్‍జిఆర్‍ఎయు) మరియు
ఎ. ఎణివాస్‍ (పిజెటిఎస్‍ఎయు)
మొబైల్‍ : 9441837487, 812199038

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *