బంగారు తీగల ‘జర్దౌసి’

జర్దౌసి అనేది ఒక రకం ఎంబ్రాయిడరీ. భారత దేశంతో పాటుగా ఇరాన్‍, అజార్‍బైజాన్‍, ఇరాక్‍, కువైత్‍, టర్కీ, సెంట్రల్‍ ఆసియా, పాకిస్థాన్‍, బంగ్లా దేశ్‍లలో ఇది బాగా ప్రాచుర్యంలో ఉంది. జౌర్దౌసి అనేది అందమైన మెటల్‍ ఎంబ్రాయిడరీ. ఒకప్పుడు భారతదేశంలో రాజులు, కులీన వర్గాల వారు దీన్ని ఎంతగానో ఉపయోగించేవారు. రాజులు ఉపయోగించే టెంట్లను అందంగా తీర్చిదిద్దేందుకు కూడా ఈ కళను వినియోగించుకున్న దాఖలాలు ఉన్నాయి. కత్తి పిడి, వాల్‍ హ్యాంగింగ్స్, ఏనుగు అంబారీ, గుర్రపు స్వారీ జీను లాంటివాటిపై జర్దౌసి కళ కనువిందు చేస్తుం టుంది. బంగారం, వెండి దారాలను వినియోగించి పెద్ద పెద్ద డిజైన్లను తయారు చేస్తారు. విలువైన రాళ్ళు, ముత్యాలను పొదగడం ఈ కళకు అదనపు హంగులు సమకూరు స్తుంది. ఆరంభంలో బంగారు ఆకులు, వెండి తీగలతో కళాకారులు అద్భుత కళాకృతులను రూపొందించి నప్పటికీ నేడు మాత్రం ఎక్కువగా బంగారు లేదా వెండి పాలిష్‍తో కూడిన రాగితీగను, వెండి దారాలను వినియోగిస్తున్నారు.


జర్దోజి అనే పర్షియన్‍ పదానికి అర్థం బంగారం తీగతో కుట్టడం. జార్‍ అంటే బంగారం, దోజి అంటే ఎంబ్రాయిడరీ. పర్షియన్‍ సాంస్కృతికాంశాలు, హస్తకళల్లో ముఖ్యమైంది జర్దోజి. దీన్నే జర్దౌజి, కామ్‍-దౌజి, గోల్‍-దౌజి, కమాన్‍-దౌజి లాంటి పేర్లతో కూడా వ్యవహరించారు. ఇరాన్‍లోని హార్మోజ్‍గాన్‍ తదితర ప్రాంతాల్లో ఇది బాగా ప్రాచుర్యంలో ఉంది.


పర్షియన్‍ జర్దోజి మూడు రకాలుగా ఉంటుంది. కొంతమంది వినూత్న పాటర్న్లు, రంగుల కోసం బేసిక్‍ ఫ్యాబ్రిక్‍ను బాఖైతో కుడుతారు. మరికొంతమంది ప్యాబ్రిక్‍ తక్కువ సాంద్రత వర్క్తో కుడుతారు. మరికొందరు వస్త్రాన్ని బంగారు, వెండి తీగలతో కుడుతారు.
భారతదేశంలో జర్దోజి ప్రాచీన కాలం నుంచీ వాడుకలోఉంది. జర్దోజి 17వ శతాబ్ది కాలంలో మొఘల్‍ చక్రవర్తి అక్బర్‍ హయాంలో మహోన్నత దశకు చేరుకుంది. ఔరంగ జేబు హయాంలో రాజపోషణ తగ్గడంతో ఈ కళ ప్రాభవం క్షీణించడం మొదలైంది. ముడిపదార్థాలు విలువైనవి కావడం, వాటి రేట్లు అధికం కావడంతో కళాకారులు తమ సొంతంగా ఎంబ్రాయిడరీ పనులు చేయలేకపోయేవారు.

పారిశ్రామికీకరణ కూడా ఈ కళపై తన ప్రభావాన్ని కనబర్చింది. ఇప్పటికీ ఈ కళ లక్నో, ఫరుఖాబాద్‍, చెన్నై, భోపాల్‍ తదితర నగరాల్లో చక్కటి ప్రజాదరణతో ఉంది. 2013లో జియోగ్రాఫికల్‍ ఇండికేషన్‍ రిజిస్ట్రీ లక్నో జర్దోజికి జియోగ్రా ఫికల్‍ ఇండికేషన్‍ (జీఐ)ని ప్రకటించింది. లక్నో జర్దోజి ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి చెందింది. లక్నో, చుట్టుపక్కల ఉన్న ఆరు జిల్లాలు (బారాబంకి, ఉనావ్‍, సీతాపూర్‍, రాయ్‍ బరేలి, హర్దోయ్‍, అమేథి) ఈ కళకు ఒక బ్రాండ్‍గా మారాయి. ఇక్కడి కళాకారులు ఈ కళ సాధికారిక తకు నిదర్శనంగా నమోదిత లోగోను ఉపయోగించు కోవచ్చు. ఫరుఖా బాద్‍లో ఈ ఎంబ్రాయిడరీకి మంచి మార్కెట్‍ ఉంది. ఇక్కడ రెహ్మాని ఎంబ్రాయిడరీ వర్క్ బాగా పేరొందింది.


-చరిత

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *