టంగుటూరులో అడ్డలూరి జైన శాసనం

యాదాద్రి-భువనగిరి జిల్లా, మండల కేంద్రం ఆలేరుకు 6కి.మీ.ల దూరంలో వున్న టంగుటూరు ప్రాచీన గ్రామం. ఇక్కడ విష్ణుకుండినుల నాణాలు దొరికాయి. నేనా గ్రామంలో టీచరుగా పనిచేసినపుడు ఒక విద్యార్థిని నాకు విష్ణు కుండినులనాటి రెండు సీసపు నాణాలనిచ్చింది. గ్రామానికి ఆగ్నేయదిశలో వున్న ఆంజనేయుని విగ్రహం ముందు 5అడుగుల ఎత్తున్న నలుపలకల తెల్లరాతి శాసనస్తంభం వుంది.


ఈ శాసనం కళ్యాణీ చాళుక్యుల కాలంనాటిది :
టంగుటూరు గ్రామంలో కనుగొన్న కళ్యాణీ చాళుక్యులకాలం శక సం.914 (క్రీ.శ.992)నాటి కొత్త శాసనాన్ని నేను చదివి, పరిష్కరించాను. నేను చేసిన ఈ శాసన పరిశోధనను ఈ ప్రాంత చారిత్రక పరిశోధకులు, మార్గదర్శి విరువంటి గోపాలకృష్ణ గారికి అంకితమిచ్చాను. ఈ శాసనం జాడ చెప్పింది నా విద్యార్థి, విలేకరి ఖుర్షీద్‍ పాషా. నావెంట వచ్చి శాసనాన్ని పరిశీలించిన వారిలో విరువంటి గోపాలకృష్ణ, వేముగంటి మురళీకృష్ణ, మల్లావఝల నారాయణశర్మ, ద్యావనపల్లి సత్యనారాయణ, జి.కుమారస్వామి, నట్వా ప్రభాకర్‍, అచ్చుతీయడంతో సహకరించిన మా చంటి…ఇంకా నా విద్యార్థులు, టంగుటూరు గ్రామప్రజలున్నారు.


శాసన వివరాలు :
టంగుటూరు (అడ్డలూరు) శాసనం:
రాజవంశం: కళ్యాణి చాళుక్యులు
రాజు: (పేర్కొనబడలేదు. కాని.. రెండవ తైలపుని పాలనాకాలం నాటిది)
కాలం: శాలివాహన శక సం.లు 914, వైశాఖ శుద్ధ తదియ గురువారం- క్రీ.శ.992 ఏప్రిల్‍ 7 గురువారం
భాష: తెలుగన్నడం
శకవర్షాలు 914 (క్రీ.శ.992), వైశాఖ శుద్ధ తదియ గురువారం నాడు వేయబడిన ఈ శాసనంలో అడ్డలూరు కామరాజు రేచయ సేద్దియ ధర్మకీర్తుల కొరకు 2 మర్తురుల నీర్నేల (wet land) సర్వపరిహారంగా, ఆచంద్రార్కంగా 4 మర్తురుల నేలను కార్తీకఫలం కొరకు పసలకేశునికి మరికొన్ని మర్తురుల భూమి, 7 ద్రమ్మాలు సిద్ధాయంగా మాణికేశ్వర ప్రభునికి దానమిచ్చినట్లు తెలియ పర్చబడ్డది.


ఇది నల్గొండలో లభించిన రెండవ తైలపుని కాలపు మొదటి శాసనం. శారాజిపేట, టంగుటూరు గ్రామాల మధ్యన అడ్లూరు చెరువుంది. చెరువుకు ఉత్తరాన టంగుటూరువైపు పాటిగడ్డ వుంది. కొన్ని దేవాలయ శిథిలాలున్నాయి. అక్కడే లభించిన ఈ శాసన స్తంభాన్ని తెచ్చి టంగుటూరు ప్రజలు హరిజనవాడలో ఆంజనేయుని ముందర నిలిపారు. దీన్నిబట్టి పూర్వం అక్కడ అడ్డలూరుఅనే గ్రామం వుండేదని తెలుస్తున్నది. ఇపుడు ఆ ఊరు లేదు. కాని, ఆ ప్రాంతంలో నిర్మించబడిన చెరువును ప్రజలు ‘అడ్లూరు’ చెరువనే పిలుస్తారు. అక్కడ పసలకేశుని గుడి, మాణికేశ్వరాలయ ముండేదని తెలుస్తున్నది. ఇక్కడికి దగ్గరలోనే మాణిక్యపురం అనే గ్రామముండడం విశేషం.


శాసనపాఠం :
మొదటి వైపు :

 1. స్వస్తి స
 2. క నృపకాల
 3. తీత సంవ
 4. త్సర సత
 5. ద 914 నే
 6. య నందన సం
 7. వత్సరద వై
 8. సాఖ సుద్ధ
 9. తదీదేయు బ్రు
 10. హస్పతి వా
 11. ర దంద్రు ‘అడ్డ
 12. లూర కామ
 13. రాజాంటప్పుఱే
 14. రేచయ సే
 15. ద్దియ మగ
  రెండవ వైపు :
 16. వల్లియద
 17. కాళేయంగ త
 18. మ్మకీర్తియ
 19. పుఱగే ఇ
 20. మ్మత్త నీర్నేల
 21. న సర్వ ప
 22. రిహారయా
 23. చంద్ర కామాది
 24. యున్బీ అల్లి
 25. నాల్క మత్త
 26. నేలన కార్తీ
 27. క ఫలదింకే
 28. ళుపు బసల
 29. కేశనీశవర
  మూడో వైపు :
 30. బసది ల్వే
 31. దకము కు
 32. ప్పీయకేర
 33. నిక వశేఇళ
 34. కా మత్తర్గేళు
 35. ద్రమ్మవ సి
 36. ద్ధాయా మికి
 37. ళిఱిద నేల
 38. నృల్సముకళే
 39. య కొ- -త్త
 40. ర్గే-ద ద్రమ్మము
 41. మానికేశు ప్రి
 42. భూర్వీంచందాది
  నాలుగో వైపు :
 43. క్షుద్రబాదేమే
 44. ను పాలసల్ల్స
 45. బారనాసి ప్ర
 46. యాగకరు క్షే
 47. త్ర చేఇగపి
 48. లలు వేవురు
 49. తాపసులు
 50. వేవురు బ్రాహ్మ
 51. నులు ఇడ్తబ్బ
 52. దేవర్గేకచ

శ్రీ రామోజు హరగోపాల్‍,
ఎ : 99494 98698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *