స్త్రీల కోసం, జెండర్‍ సమానత్వం కోసం సుస్థిరత, అభివృద్ధి UN/SDGs


మార్చ్ నెల స్త్రీల కోసం. మహిళా ఉద్యమాల ఉత్సవాలు జరుపు కోడానికి ప్రపంచ స్త్రీలు ఎదురు చూసే నెల. వాళ్ళతో పాటు నేను కూడా. మార్చ్ నెల ఎండా కాలం వచ్చిందని చెప్తుంది. హైదరాబాద్‍ వేడిగానే వుంది. అది నమ్మి, ఇండియా అంత ఒకే వాతావరణం ఉంటుందని భ్రమపడి, ఢిల్లీ వెళ్ళాను. స్త్రీల హక్కుల కోసం పని చేసినందుకు, భారత ప్రభుత్వం ఇచ్చే జాతీయ పురస్కారాన్ని అందుకోడానికి. చలి. హిమాలయాలు పక్కనే ఉన్నాయా అనిపించేటంత చలి. ‘ఢిల్లీకి సర్దీ’ పాట గుర్తుకు వచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన కాశ్మీర్‍ శాలువ అవసరానికి పనికి వచ్చింది.


UN/SDGs పర్యావరణం గురించి మాత్రమే మాట్లాడుతున్నట్టు మనకు అనిపిస్తుంది కానీ అవి అన్ని అంశాలను సమాంతరంగా ఏక కాలంలో చర్చిస్తున్నాయి. ముఖ్యంగా స్త్రీల గురించి. Women Empowermentఅనేది UNకి అత్యంత ముఖ్యమైన విషయం. ఒకసారి UN/SDGsని గుర్తుకు తెచ్చుకుందాం. యునైటెడ్‍ నేషన్స్ (United Nations) ప్రపంచ రాజ్యాలకు ఇచ్చిన ఆ 17 సుస్థిర అభివృద్ధి (Sustainable Development) లక్ష్యాలు ఇవి: 1. ప్రపంచ ప్రజల పేదరికాన్ని తగ్గించడం. 2. ఆకలి లేకుండా చేయడం. ప్రపంచ ప్రజలకు ఆహార భద్రతను సమకూర్చడం. 3. ఆరోగ్యం. ప్రపంచ ప్రజలకు ఆరోగ్య సదుపాయాలు కల్పించడం. ఆరోగ్యంగా ఉండడానికి సౌకర్యాలు సమకూర్చడం. 4. విద్య. ప్రజలందరూ చదువుకునేటట్లు చేయడం. అందరికి విద్య అందుబాటులో వచ్చేటట్లు చేయడం. 5. జెండర్‍ సమానత్వం (Gender Equity). స్త్రీలకు పురుషులతో పాటు సమాన అవకాశాలు, సమాన హక్కులు కల్పించడం. 6. పరిశుభ్రమైన తాగు నీరు అందరికి అందేటట్లు చేయడం, అంటే సహజ నీటి వనరులను (soft water resources) కాపాడడం దీనితో పాటు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం. 7. సౌరశక్తి సాంకేతికతను పెంపొందించడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం. 8. ప్రజలు హుందాగా బ్రతకడానికి జీవనోపాధి కల్పించడం, పని అవకాశాలు కల్పించడం, దీని ద్వారా ఆర్ధిక స్వావలంబన సాధిం చడం. 9. వైజ్ఞానిక ఆవిష్కరణలు, శాస్త్రీయ రంగాల (scientific) పురోభివృద్ధి, సాంకేతికతను సాధించడం. 10. అసమానతలను తగ్గించడం ద్వారా సమానత్వాన్ని సాధించడం. 11. సుస్థిర నగరాలు, సుస్థిర సమాజాలను అభివృద్ధి చేయడం. 12. బాధ్యతాయుతమైన వినియోగం మరియు ఉత్పత్తిని సాధించడం. 13. పర్యావరణ పరిరక్షణ కోసం వివిధ కార్యక్రమాలు, ప్రణాళికలు చేపట్టడం. 14. నీళ్ల కింద మనుగడ (life below water) అంటే సముద్రాలలో వుండే జీవం. అక్కడ బయో డైవర్సిటీకి విఘాతం రాకుండా చూడటం, సముద్రాలూ కలుషితం కాకుండా కాపాడడం. 15. భూమి మీద మనుగడకు (life on earth) విఘాతం రాకుండా చూడడం అంటే భూమి మీద జంతువులు, వృక్షాలు, మనుషులు, మనుగడ సాగించడానికి వనరులను కాపాడు కోవడం. 16. శాంతి మరియు న్యాయం (peace and justice). ప్రపంచ ప్రజలు వాళ్ళ హక్కులను సాధించు కోవడం ద్వారా సామజిక న్యాయం చేయడం, ప్రజలందరికి న్యాయం అందే టట్లు చేయడం, దాని ద్వారా శాంతి, సుస్థిరత ను సాధించడం, దీనికి కావలసిన సంస్థలను నెలకొల్పడం. 17. పైన చెప్పిన లక్ష్యాలను సాధించడానికి వివిధ సమూహాలతో, సంస్థలతో, దేశాలతో కలిసి పనిచేయడం, భాగస్వాములవ్వడం.


UN Women ప్రతి సంవత్సరం International Women’s Day కోసం ఒక themeని నిర్ణయిస్తుంది. ప్రపంచ మహిళా ఉద్యమాలు దీన్ని స్వీకరించి, ఆ సంవత్సరమంతా ఈ థీమ్‍ ని అమలు చేయడం కోసం పనిచేస్తారు. ఈ సంవత్సరానికి (2021) “Women in leadership: Achieving an equal future in Covid-19 World”. ఈ థీమ్‍ భారత దేశానికీ ఒక pressing challenge. గో కరోనా గో అంటే కరోనా వెళ్ళిపోతుందని నమ్మిన దేశం. గంట శబ్దానికి కరోనా భయపడి పారిపోతున్దని సలహా ఇచ్చిన దేశం. కరోనా కు కూడా ఒక మతాన్ని ఉచితంగా ఇచ్చిన ప్రజాస్వామిక దేశం. మార్చ్ 8న ప్రపంచ స్త్రీలు మహిళా దినోత్సవాన్ని ( International Women’s Day ) జరుపు కుంటారు. అడుగడుగునా ఎదుర్కొన్న వివక్షను గుర్తుకు తెచ్చుకొని, స్త్రీల పోరాటాలను మననం చేసుకుంటారు. ఎదురు తిరిగి చేసిన తిరుగుబాటును గుర్తు చేసుకుంటారు. 100 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర కలిగిన మహిళా ఉద్యమాల స్ఫూర్తిని ఊపిరిగా చేసుకుంటారు. 100 సంవత్సరాల స్త్రీల పోరాటాల చరిత్ర అంటే మాటలా? బొలివియా బొగ్గుగని కార్మికుల (స్త్రీలు) పోరాటం మొదలుకొని, చదువు, వుద్యోగం, ఆరోగ్యం, హక్కులు, చట్టాలు సుదీర్ఘ పోరాటం ద్వారా సాధించు కున్నారు. ఎన్నని చెప్పను? ఇటీవల సాధించుకున్న నార్వే స్త్రీలabortion హక్కు,LGBT హక్కులు, sexual exploitationకు వ్యతిరేకంగా సాగిన ‘mee to’ ఉద్యమం, ‘స్త్రీ ఆమె శరీరానికి ఆమెనే యజమాని భర్త కాదు’ అని మన Supreme Court of India చెప్పేంత వరకు స్త్రీలు వెనుకడుగు వేయకుండా నిరంతర పోరాటం చేసారు. ముందుకు సాగుతూ, జనజీవన స్రవంతిలో కలుస్తూ, భావి తరాలకు బాటలు వేశారు స్త్రీలు. సాధించాల్సింది ఇంకా చాల వుంది. భూమి స్త్రీలది. ఆకాశం స్త్రీలది. సమస్త ప్రకృతి స్త్రీలది. స్త్రీలు లేకుండా ప్రపంచం లేదు. రాజ్యాలు లేవు. అందుకే UNప్రపంచం దేశాలు సాధించాల్సిన ముఖ్యమైన లక్ష్యాలలో Gender Equality ముఖ్యమైనదిగా గుర్తించింది. దీని కోసం ఎన్నో పాలసీ లు, ప్రణాళికలు రచించి ప్రపంచ దేశాలకు ఇచ్చింది.


Gender Mainstream, Gender Equality, Women Empowerment అనేదిUNకి, Feminist School of Thoughtకి ముఖ్యమైన విషయం. ఇది మన ప్రభుత్వాలు గమనించాలి. ఆ ఏముందిలే! స్త్రీలే కదా, రేషన్‍లో బియ్యం ఇచ్చేసి, కుట్టు మిషన్‍ ఒకటి ఇస్తే చాలు, అదే Empowerment అనుకుంటే పొరపాటే అవుతుంది. అది కాదు ఎంపవర్మెంట్‍ అంటే. స్త్రీలు హుందాగా బ్రతకడానికి, స్వేచ్ఛగా తిరగడానికి కావలసిన సామాజిక వాతావరణాన్ని కల్పించాలి. ఇదిlaw and order పరిధిలోకి వస్తుంది. స్త్రీలను mainstream Developmentలో, Development Economicsలో భాగస్వాముల్ని చేయాలి. అమెరికాతో స్నేహం చేసినంత మాత్రాన మనం అమెరికా అంత ఎత్తుకు ఎదగలేము. అమెరికా ను చూసి నేర్చుకోవలసింది చాల వుంది. నాసాలో ప్రతిసారి ఒక భారత స్త్రీని (సైంటిస్ట్) అంతరిక్షంలో పంపినంత మాత్రాన కూడా మనం అభివృద్ధిని సాధించలేము. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మనం మూఢ నమ్మకాలను వదిలించుకొని శాస్త్ర సాంకేతికతను అభివృద్ధి చేసుకున్నప్పుడు. మతాన్ని, దేవుడిని ఇంట్లో పెట్టి, మనిషి మాత్రమే mainstreamలో ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుంది. అంతర్జాతీయ సమాజం మన దేశం గురించి ఏమంటున్నదంటే, ఇండియా తన చుట్టూ వుండే దేశాలను చిన్న చూపు చూస్తుంది, అమెరికాతో స్నేహం చేస్తుంది అని. మన చుట్టూ వుండే ఇరుగు పొరుగు దేశాలతో మనం ప్రేమగా ఉండాలి. వాళ్లకు సహాయం చేయాలి. అప్పుడు మనం South Asia రాజకీయాలను (డెవలప్మెంట్‍ పాలిటిక్స్) ముందు ఉండి నడిపించవచ్చు. ప్రపంచ వేదిక మీద మనదైన గౌరవాన్ని దక్కించు కోవచ్చు. వ్యూహాత్మక కార్యాచరణతో సుస్థిర అభివృద్ధిని సాధించి, 2030 నాటికీ UN SDGsని సాధించి, సంపన్న అమెరికా పక్కన నిలబడితే చూసేందుకు కొంచెం బాగుంటుంది.

  • మహెజబిన్‍, ఎ : 9866587919

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *